నేడే తొలి ఏకాదశి: చెయ్యవలసిన, చెయ్యకూడని పనులివే!!

నేడే తొలి ఏకాదశి. తెలుగు వారందరికీ తొలి ఏకాదశి తొలి పండుగ. ఈ పండుగ తోనే వరుసగా పండుగలు ప్రారంభమవుతాయి. ఇక తొలి ఏకాదశిని దేవ శయని ఏకాదశి అని కూడా అంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం జరుపుకునే ఈ పండుగకు చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఈ రోజు నుండి శ్రీ మహా విష్ణువు శేష తల్పంపై నాలుగు నెలల పాటు యోగ నిద్రకు ఉపక్రమిస్తారు అని చెబుతారు.

శ్రీ మహావిష్ణువు నేడు యోగ నిద్ర లోకి వెళ్లి మళ్లీ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటాడని చెబుతారు. మొత్తం ఈ నాలుగు నెలలు పరమపవిత్రమైన మాసంగా, చాతుర్మాసంగా హిందువులు దీనిని కొనసాగిస్తారు. అయితే తొలి ఏకాదశి రోజున కొన్ని చెయ్యకూడని, చెయ్యాల్సిన పనులు ఉన్నాయి. మనం ప్రస్తుతం అవేమిటో తెలుసుకుందాం.

Toli ekadashi 2023: know Dos and donts on this special day!!

తొలి ఏకాదశి రోజున ఉపవాస దీక్ష ఆచరిస్తే మంచిదని చెబుతారు. అలా కాకుండా తొలి ఏకాదశి రోజున ఉపవాస దీక్షను ఆచరించకుండా మాంసం, జంక్ ఫుడ్స్, ఉసిరి, గుమ్మడికాయ, మినుములతో చేసిన ఆహారాలు తినకూడదని చెబుతారు. పరమ పవిత్రమైన తొలి ఏకాదశి నాడు ఎవరు అబద్ధాలు చెప్పకూడదని, చెడు ఆలోచనలు చేయకూడదని దేవుడికి నిష్టగా పూజలు చేయాలని చెబుతారు.

ఇక ఏకాదశి పర్వదినాన తోచినంత దానధర్మాలు చేస్తే మంచిదని, దీనివల్ల మోక్షప్రాప్తి కలుగుతుందని చెబుతారు. ఏకాదశి రోజున దాన ధర్మాలు చేస్తే పుణ్య ఫలితాలు కలుగుతాయి అని చెబుతారు. ఏకాదశి వ్రతం రోజున బ్రహ్మచర్యాన్ని పాటించాలి అని తమ శరీరం పైన, మనసు పైన భక్తులు ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం అని చెబుతారు. ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని పూజించేటప్పుడు ఖచ్చితంగా తులసీ దళాలను సమర్పించాలని చెప్తారు.

అలాగే ఈ రోజు పొరపాటున కూడా చెట్టునుండి తులసి ఆకులను త్రుంచకూడదని చెబుతారు. విష్ణు నామ స్మరణతో రోజంతా భక్తితో పూజిస్తే మంచి జరుగుతుందని చెబుతారు. తొలి ఏకాదశి నాడు రాత్రి జాగారం చేసి, ఆపై ద్వాదశి పొద్దున్నే తల స్నానం చేసి శ్రీమహావిష్ణువుని నిష్ఠగా పూజించి నైవేద్యం సమర్పించిన తర్వాత ఉపవాసాన్ని విరమించి భోజనం చేస్తే సకల పాపాలు తొలగి పోతాయని, ఆ దేవుడి దయ మీపై ఎల్లప్పుడూ ఉంటుందని చెబుతారు. దీని వల్ల ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని చెబుతున్నారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+