విజయదశమి నుండి ఈ రాశులవారికి సంపదలను ఇచ్చిన రెండు రాజయోగాలు!
దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగ విజయదశమి. ఈ సంవత్సరం దసరా నేడు జరుపుకుంటున్నాము. నేడు శ్రీరాముడు రావణుని సంహరించాడని, దుర్గాదేవి మహిషాసురుని సంహరించిందని చెడుపై మంచి గెలిచినందుకు విజయదశమి పండుగను జరుపుకుంటున్నామని చెబుతారు.
దసరా నాడు శక్తివంతమైన రాజయోగాలు
అయితే ఈసారి విజయదశమి పండుగకు జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా చాలా ప్రాధాన్యత ఉంది. జ్యోతిష్య శాస్త్రంలో దసరా రోజున శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడుతున్నాయి. శుక్రుడు తులా రాశిలో ఉండడం వల్ల మాలవ్య రాజయోగం, కుంభరాశిలో శని సంచారంతో శశ మహా పురుష రాజయోగం ఏర్పడుతున్నాయి. ఈ కారణంగా కొన్ని రాశులవారికి నేటి నుంచి అదృష్టం ప్రకాశిస్తుంది. మరి ఆ రాశులేమిటో తెలుసుకుందాం.

మకర రాశి
దసరా పండుగ నాడు ఏర్పడే రెండు శక్తివంతమైన రాజయోగాల కారణంగా మకర రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో మకర రాశి జాతకులు ఊహించని ఆర్థిక లాభాలు పొందుతారు. ఉద్యోగాలు చేస్తున్న వారికి పురోగతి ఉంటుంది. ఈ సమయంలో మకర రాశి వారి బ్యాంకు బాలన్స్ పెరుగుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి.
తులారాశి
దసరా పండుగ రోజు ఏర్పడి రెండు శక్తివంతమైన రాజయోగాలతో తులా రాశి జాతకుల అదృష్టం మారుతుంది. దసరా పండుగ నుండి వీరికి ఊహించని ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగాలు చేసే వారి పరిస్థితులు మెరుగుపడతాయి. నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు. వైవాహిక జీవితం సంతోషకరంగా ఉంటుంది. అన్ని రకాల సమస్యలు తొలగిపోయి జీవితం హ్యాపీగా ఉంటుంది. ఈ సమయంలో విజయాలు మీ సొంతం అవుతాయి.
వృషభ రాశి
వృషభ రాశి వారికి రెండు శక్తివంతమైన రాజయోగాల కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. దసరా పండుగ నుంచి వీరికి ఏ పని చేసినా విజయం వరిస్తుంది. కోర్టు కేసులు పరిష్కారమై సానుకూల ఫలితాలు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. అన్ని సమస్యలు పరిష్కారమై కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జీవిస్తారు. ఇది వృషభరాశి వారికి అదృష్టం ఇచ్చే సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications