56 ఏళ్ల తర్వాత ఈ రాశులకు అఖండ ధనయోగం
తెలుగు మాసాల్లో వైశాఖ మాసం అంటే శనిదేవుడికి ఎంతో ఇష్టం. చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదించే న్యాయదేవుడు ఆయన. సాడేసతితోపాటు అర్థాష్టమ శనితో బాధపడేవారు శనిత్రయోదశి రోజు కొన్ని పరిహారాలు పాటించడంద్వారా వాటినుంచి బయటపడొచ్చు. రేపు శనివారం నాడే శని త్రయోదశి. ఆరోజు శనిదేవుడు, సూర్యుడు కలుస్తున్నాయి. ఇది చాలా అరుదైన కలయిక. ఈ ప్రభావం మొత్తం 12 రాశులపై ఉన్నప్పటికీ కొన్ని రాశులకు మాత్రం ప్రత్యేక ప్రయోజనాలను తెస్తోంది. ఆరోజు శనిదేవుడికి తైలాభిషేకంతోపాటు నల్లనువ్వులతో కూడా అభిషేకం చేస్తే ఆయన ఎంతో ఆనందిస్తాడు.
వృశ్చిక రాశి
ఈ రాశివారు రాజకీయ రంగంలో బాగా రాణిస్తారు. న్యాయ సంబంధిత వ్యవహారాల్లో కోర్టుల్లో కేసులు నడుస్తున్నవారికి అనుకూలంగా తీర్పులు వచ్చే అవకాశం ఉంది. వారు విజయం సాధిస్తారు. భార్య తరఫు నుంచి ఈ రాశివారికి ఆస్తులు కలిసివస్తాయి. అలాగే తండ్రివైపు నుంచి కూడా ఆస్తులు వస్తాయి. అనుకోని రీతిలో, ఊహించని విధంగా వీరికి ధనలాభం ఉంది. గతంలో వేరేవారికిచ్చిన డబ్బులు ఇక రావు అనుకొని వదిలేయగా.. ఆ డబ్బులు కూడా ఈ సమయంలో మీ చేతికి అందుతాయి. కుటుంబ సభ్యులంతా కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళతారు. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

సింహరాశి
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు చాలా బాగుంటుంది. వారు ఉత్తీర్ణులవుతారు. ప్రభుత్వ ఉద్యోగం దొరికే అవకాశం కనపడుతోంది. అలాగే అబ్బాయిలకు తాము కోరుకున్న అమ్మాయిలతో వివాహం జరిగే అవకాశం ఉంది. సమాజంలో హోదా పెరగడంతోపాటు గౌరవ మర్యాదలు కలుగుతాయి. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కొత్త ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించడంతోపాటు కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. దాంపత్య జీవితంలో జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో ఆర్థిక విజయం లభిస్తుంది. దీనివల్ల కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు.












Click it and Unblock the Notifications