శని అమావాస్యతో ఈ రాశుల జీవితంలో నవ శకం ప్రారంభమైంది

న్యాయదేవత అయిన శనిదేవుడు మనం చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదిస్తుంటాడు. మంచి పనులు చేస్తే మంచి ఫలితాలను, చెడు పనులు చేస్తే చెడు ఫలితాలను ఇస్తాడు. శనివారం, అమావాస్య కలిసి రావడం అరుదుగా జరుగుతుంటుంది. ఈసారి మార్చి 29వ తేదీన ఈ రెండూ కలిసివచ్చాయి. విశేషం ఏమిటంటే అదేరోజు ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం ఉంది. ఈ రెండూ కలిసిరావడంవల్ల కొన్ని రాశులవారికి అదృష్టం బంకలా పట్టుకుంటుంది. ఇన్నాళ్లుగా వీరు పడిన కష్టాలకు విముక్తి లభిస్తుంది. ఈ రాశులపై శనిదేవుడు అత్యంత కరుణ చూపించబోతున్నాడు. ఆర్థికంగా బాగా కలిసిరావడంతో ఆస్తులను కొనుగోలు చేస్తారు. ఏయే రాశులకు శని అమావాస్య వల్ల బాగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం

మేష రాశి
కుటుంబ సభ్యుల మధ్య ఉన్న వివాదాలన్నీ తొలగిపోతాయి. గతంలో మొదలై నిలిచిపోయిన ప్రాజెక్టులను తిరిగి ప్రారంభించడమే కాకుండా కొత్తవాటిని కూడా చేపడతారు. కొత్తగా భూమిని, ఆస్తులను కొనుగోలు చేస్తారు. వీరి జీవితం ఆనందమయంగా ఉంటుంది. ఊహించనిరీతిలో వీరికి ధనలాభం ఉంది. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో విజయం లభిస్తుంది. ఆర్థికంగా కలిసివస్తుంది. శివాలయంలో నవగ్రహాలకు ప్రదక్షిణ చేయాలి. శనిదేవుడికి తైలాభిషేకం, పూజలు నిర్వహించాలి.

two zodiac signs will get huge benefits and purchase new house and other properties due to shani Amavasya from march 29th

కర్కాటక రాశి
ఈ రాశివారిపై శనిదేవుడు విశేష కృప చూపడంవల్ల వీరికి కొత్త జీవితం ప్రారంభమవుతుంది. వీరు ఏ పని తలపెట్టినా అదృష్టం తోడుండి బాగా కలిసివస్తుంది. కొత్తగా వాహనాన్ని లేదంటే కొత్తగా భూమిని కొనుగోలు చేస్తారు. గతంలో మొదలై నిలిచిపోయిన పనులు కూడా ఈ సమయంలోనే పూర్తవుతాయి. వీరికి అదృష్టం గట్టిగా పట్టుకుంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళతారు. శివాలయంలో నవగ్రహాలకు ప్రదక్షిణ చేయాలి. శనిదేవుడికి తైలాభిషేకం, పూజలు నిర్వహించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+