వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త సంవత్సరంలో ఇలా: మోడీ ప్రభుత్వ తీరుతెన్నులు

వచ్చే తెలుగు సంవత్సరాదిలో మోడీ ప్రభుత్వం ఎలా పనిచేస్తోంది, ఏయే రంగాలు ప్రగతిపథంలో నడుస్తాయనే విషయాలను జ్యోతిష్కుడు వివరించారు.

By Pratap
|
Google Oneindia TeluguNews

దేశ భాగస్వామ్య పార్టీలలో చైతన్యం మరింత పెరిగి నిర్దేశక సూత్రాలను ఎంచుకొని దేశాభివృద్ధికి పాటుపడుతారు. అంతర్జాతీయంగా మన దేశఖ్యాతి గతయేడు కంటే మరింత వృద్ధి చెందుతుంది. ద్వితీయ స్థానమును పరిశీలించగా దేశ ఆర్థికవిధానాలలో ముందుచూపు నిర్ణయాలు, పాలనాయంత్రాంగం సరిగ్గా స్పందించడం, కొన్ని జాతీయ పనులు వెంటనే కార్యరూపం దాల్చడం వంటివి ప్రజల అభివృద్ధికి దోహదం చేస్తాయి.

అలాగే (అంతర్జాతీయ స్నేహ సంబంధాల వలన విదేశాల నుండి ఋణ ఆర్థిక సహాయమును అధికముగా తీసుకురాగల సూచనలున్నవి. అలాగే ఇంటా, బయట శత్రువులను ఇనుప పాద ధోరణితో అణచడం, తద్ద్వారా రక్షణ వ్యయం కొంత తగ్గడం, సామాన్యులపై భారం తరగడం వంటి సూచనలు ఉన్నాయి.

తృతీయస్థానమును పరిశీలించగా ఇతర దేశాలతో దౌత్య సంబంధాలు, ఒప్పందాలు కుదర్చడంలో ప్రభుత్వం సమర్ధతతో వ్యవహరించి ఊహించని పురోగతిని సాధిస్తుంది. సమాచార రంగంలో విప్లవాత్మకమైన మార్పులు, సంస్కరణలు వస్తాయి.

ఆ సంఘాల్లో కుటిల రాజకీయాలు

ఆ సంఘాల్లో కుటిల రాజకీయాలు

చతుర్థ స్థానమును పరిశీలించగా కేంద్రప్రభుత్వ ధోరణితో విద్యారంగంలో ప్రగతి కనిపించుచున్నది. కాని, సమర్ధులైన వైజ్ఞానికులు, వైద్యులు ఉన్నప్పటికిని విద్యార్థి సంఘములలో కుటిల రాజకీయములు ప్రవేశించి సమాజమునకు, అలాగే ఆయా రంగాలలో అంతర్జాతీయస్థాయికి తగిన కృషిని ప్రోత్సహించ లేని పరిస్థితిని సృష్టించును.

వ్యవసాయ రంగంలో ఇలా...

వ్యవసాయ రంగంలో ఇలా...

వ్యవసాయ రంగములో రైతులకు వ్యాపార పంటలపై ఆసక్తి పెరిగి ఆహారధాన్యాలు, పశుగ్రాసములను నిర్లక్ష్యము చేయు సూచనలున్నవి. ప్రభుత్వము వారి ధరల మద్దతు గూడ అదిశలోనే నడుచును. పొగాకు వంటి ఆరోగ్య భంగకరమైనటువంటి పంటలు కూడా పెరగవచ్చు. పంచమస్థానమును పరిశీలించగా సంగీత, సాహిత్య కళా రంగాలలో ప్రభుత్వప్రోత్సాహం కొంత్ర తగ్గవచ్చు. మనదేశ దౌత్యాధికారులు అంతర్జాతీయంగా దేశ ఖ్యాతిని ఇనుమడింప చేస్తారు.

ఉగ్రవాదులను, శత్రుదేశం వెన్నుపోట్లను సమర్థంగా...

ఉగ్రవాదులను, శత్రుదేశం వెన్నుపోట్లను సమర్థంగా...

షష్ఠ స్థానమును పరిశీలించగా శత్రుదేశముల వెన్నుపోట్లను సమర్థవంత ముగా త్రిప్పికొట్టడం, ఉగ్రవాదులను అణగద్రోక్కు విధానములతో అంతర్జాతీయముగా మన దేశానికి మద్దతు పెరిగే సూచనలున్నాయి. సప్తమ స్థానమును పరిశీలించగా విదేశములతో అనుకూల సంబంధాలను వాణిజ్యపరంగాను, వ్యావహారిక పరంగాను వృద్ధి చేసుకోవటంలో కేంద్ర ప్రభుత్వం గతం కంటే మరింత సమర్థవంతముగా వ్యవహరించే సూచనలు ఉన్నాయి. అష్టమ స్థానమును పరిశీలించగా షేర్ మార్కెట్ల, స్పెక్యులేషన్ వ్యవహారాలు, ఆర్థిక వ్యాపారాలలో ప్రోత్సాహకరమైన మార్పు కనిపిస్తున్నది.

ఆధ్యాత్మిక భావనలు పెరుగుతాయి...

ఆధ్యాత్మిక భావనలు పెరుగుతాయి...

నవమ స్థానమును పరిశీలించగా దేశంలో ఆధ్యాత్మిక భావాలు, ప్రజలలో దేశభక్తి, జాతీయభావములు బాగా పెరుగుతాయి. అలాగే ఆధ్యాత్మిక గురువులు నైతికవిలువలను, ఆధ్యాత్మిక విలువలను పెంచడంలో విపరీతమైన కృషి చేస్తారు. అలాగే న్యాయశాఖలో జాతీయ ప్రాముఖ్యము గల విప్లవాత్మక తీర్పులు కొన్ని రావచ్చును.

పారిశ్రామిక రంగంలో ఇలా...

పారిశ్రామిక రంగంలో ఇలా...

దశమ స్థానమును పరిశీలించగా పారిశ్రామిక రంగములోను, భారీ పరిశ్రమరంగంలో ఈ ఏడు కొంత మంచి వాతావరణం ఏర్పడి నిలకడగల అభివృద్ధిని సాధించడం జరుగు తుంది. యాజమాన్యకార్మిక సంబంధములు మొత్తము మీద తృప్తికరంగా ఉండగలవు.

నిరుద్యోగులకు ఈ ఏడాది శుభవార్తలు...

నిరుద్యోగులకు ఈ ఏడాది శుభవార్తలు...

ఏకాదశ స్థానమును పరిశీలించగా నిరుద్యోగ తీవ్రత గణనీయముగా తగ్గే అవకాశమున్నది. ప్రభుత్వము వివిధ పథకముల ద్వారా సమృద్ధిగా ఆదాయ వనరులు సమీకరించుకొనును. కాగా, వ్యాపారరంగంలో లాభాలు పొంగి పొరలుచున్నట్లు పైకి కనిపించు చుండంగానే వ్యాపారములు మునిగిపోవు సన్నివేశములున్నాయి.

దేశంలో శాంతిభద్రతలు ఇలా...

దేశంలో శాంతిభద్రతలు ఇలా...

ద్వాదశ స్థానమును పరిశీలించగా దేశప్రయోజనాలను, శాంతి భద్రత విషయాలను, ఆంతరంగిక రక్షక విభాగాలు విశేషమైన పరిశ్రమతో శ్రద్ధ వహించటంలో విజయములు సాధిస్తాయి. అలాగే శత్రుదేశముల, ఉగ్రవాదుల ధాటియును నియంత్రించడంలో ప్రభుత్వం విజయం సాధిస్తుంది.

ఎన్ని ఆటంకాలు ఎదురైనా...

ఎన్ని ఆటంకాలు ఎదురైనా...

మొత్తం మీద ఈ సంవత్సరమున రాజైన కుజుని ప్రభావము ఉన్నను, మంత్రి అయిన శుక్రుని సహకారం వలన ఎన్ని ఇబ్బందులు ఎదురైనను, వాటిని ధైర్యంగా అధిగమించి దేశమును అభివృద్ధి పథములో పయనింప చేయుటలో ప్రభుత్వములు సఫలీకృతమయ్యేఅవకాశము మెండుగా కనిపించుచున్నది. ప్రజలును దైవభక్తి, ధర్మనిరతి కలిగి, దైవానుగ్రహమున శుభ సుఖములనే అధికముగా పొందెదరు. ఈ సంవత్సరము మన దేశమును పాలించు గ్రహములలో దత్తాత్రేయ, సుబ్రహ్మణ్య అంశలు ఎక్కువ ఉన్నందున దత్తాత్రేయ, సుబ్రహ్మణ్యుల ఆరాధనము ప్రజలకు శ్రీరామ రక్ష.

English summary
According to in Telugu year after this Ugadai festival PM Narendra Modi's government will move forward in all fronts in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X