వసంత పంచమి నాడు ఇలా చేయండి.. విద్యతో పాటు డబ్బుకు డబ్బు
వసంత పంచమి 2025 ఫిబ్రవరి 2వ తేదీన జరుపుకుంటారు. ఇది మాఘ మాసంలో శుక్ల పక్ష పంచమి రోజున వస్తుంది. ఈ రోజున సరస్వతీ దేవిని పూజిస్తారు.ఈ రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేయడం చాలా మంచిది. కొత్తగా చదువుకోవడం ప్రారంభించే పిల్లలకు ఈ రోజున అక్షరాభ్యాసం చేస్తే వారికి చదువు బాగా వస్తుంది అని నమ్ముతారు.వసంత పంచమి రోజున పసుపు రంగు దుస్తులు ధరించడం శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున సరస్వతీ దేవికి పసుపు రంగు పువ్వులు మరియు పసుపు రంగు పదార్థాలు నైవేద్యంగా సమర్పిస్తారు.
వసంత పంచమి ఫిబ్రవరి 2 ఉదయం 9 గంటలకు ప్రారంభమై మరసటి రోజు అనగా ఫిబ్రవరి 3 ఉదయం 6:35 నిమిషాల ముగుస్తోంది.ఈ సమయంలోనే సరస్వతి దేవిని పూజించడం ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు.విద్యార్ధులు, పిల్లలు, టీచర్లు, అందరూ ఈ రోజు సరస్వతి పూజ చేసి తమ విద్యార్థి జీవితంలో విజయాలు సాధించాలని ప్రార్థిస్తారు. ముఖ్యంగా ఈ రోజున ఎంతోమంది అక్షరాభ్యాసం చేయిస్తారు .ఈ పండుగను చాలా మంది ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.

అక్షరాభ్యాసం రోజున, పిల్లలను ఒక పలకపై బియ్యం గింజలతో "ఓం నమః శివాయ" అని రాయమని చెబుతారు. తరువాత, పిల్లలకు గురువు లేదా తల్లిదండ్రులు అక్షరాలను నేర్పుతారు. ఈ సంస్కారం పిల్లలకు విద్య పట్ల ఆసక్తిని పెంచడానికి మరియు వారిని జ్ఞానవంతులుగా చేయడానికి ఉద్దేశించబడింది.పఠనాన్ని పూర్తిగా చేసిన తర్వాత, 5 లేక 9 మంది పిల్లలకు.. పలక, బలపం, ఎక్కాల పుస్తకం వంటివి పంచిపడితే ఎంతో ఉత్తమం. తర్వాత వేయించిన శనగపప్పు, మరమరాలు, బెల్లం కలిపి పిల్లలకు పంచిపెట్టాలి. ఇవన్నీ చెయ్యడం ద్వారా పిల్లలకు సరస్వతి దేవి అనుగ్రహం ముందటమే కాకుండా.. వాళ్లు చదువు పరంగా ఉన్నత స్థాయిలో ఉంటారనే నమ్మకం తొలి నుంచి ఉంది.












Click it and Unblock the Notifications