vasantha panchami 2024: వసంత పంచమికి పసుపు రంగుకు సంబంధం.. ఎందుకు పసుపుకు ప్రాధాన్యం!!
వసంత పంచమి పర్వదినం ఫిబ్రవరి 14వ తేదీన వస్తుంది. మాఘమాసం శుక్లపక్షం 5వ రోజును వసంత పంచమిగా జరుపుకుంటారు.వసంత పంచమి నాడు జ్ఞానాన్ని, ఏకాగ్రతని ప్రసాదించాలని కోరుకుంటూ చదువుల తల్లి సరస్వతీ దేవిని ప్రతి ఒక్కరు పూజిస్తారు. ఈరోజు ఎక్కువమంది అమ్మవారికి పసుపు రంగు బట్టలతో పూజాదికాలు నిర్వహిస్తారు. వసంత పంచమి రోజున పసుపు రంగుకి ఎందుకు అంత ప్రాధాన్యత ఉంటుంది అనే విషయాన్ని ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పసుపు రంగు శాంతికి, శ్రేయస్సుకు, సంతోషానికి సూచికగా భావిస్తారు. పసుపు సాధారణంగానే శుభసూచకం. అలాంటి పసుపును వసంత ఋతువుకు సూచికగా భావిస్తారు. శక్తికి, ఉత్సాహానికి ప్రతీకగా కూడా పసుపు రంగును భావిస్తారు. వసంత పంచమి రోజున భూమి మీద పడే సూర్య కిరణాలు పసుపు రంగులో మారతాయని చెబుతారు. ఈ రోజుకు పసుపు రంగుకు చాలా అవినాభావ సంబంధం ఉంటుంది.

పసుపు రంగు దేవగురువైన బృహస్పతి తో సంబంధం కలిగి ఉంటుంది. జ్ఞానానికి, మేధస్సుకు బృహస్పతిని ప్రతీకగా భావిస్తారు కాబట్టి గురుస్థానం బలంగా ఉండడం కోసం వసంత పంచమి నాడు పసుపు రంగును ఉపయోగిస్తారు. అందులోనూ సరస్వతీ దేవిని పూజించటం కోసం పసుపు రంగును వినియోగిస్తారు.
ఒక వ్యక్తి తెలివితేటలు , మేధస్సు పెరగాలంటే, వారు చదువులో ప్రావీణ్యం సంపాదించి రాణించాలంటే వారిపై బృహస్పతి కృప ఉండాలి. పసుపు రంగు బృహస్పతికి ఇష్టమైన రంగు కాబట్టి, ఆ రంగు దుస్తులను సరస్వతి అమ్మవారిని పూజించడానికి వినియోగిస్తారు. ఈ రోజున పసుపు రంగు దుస్తులతో పూజించడమే కాకుండా, పసుపు రంగు వస్తువులను దానం చేయడం కూడా శుభప్రదంగా పరిగణిస్తారు.
ఆరోగ్యపరంగా కూడా పసుపు రంగు వస్తువులను దానం చేయడం వల్ల మేలు చేకూరుతుంది. పసుపు రంగు దుస్తులతో సరస్వతీ దేవిని పూజించడం వల్ల ఫలితాలు కలుగుతాయి.అంతేకాదు జీవితంలో అనేక సమస్యలు ఉన్నవారు పసుపును వసంత పంచమి నాడు ఉపయోగించి చేసే పరిహారాలతో అన్నీ శుభాలు చేకూరుతాయి.
Disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications