వాస్తు బాగున్నా.. కచ్చితంగా చేయాల్సిన మార్పులు మాత్రం ఇవే.. చూసుకోండి!
వాస్తు అంతా బాగున్నప్పటికీ ప్రతి ఇంటికి కచ్చితంగా వాస్తులో 5 మార్పులు మాత్రం చేయాలి. దీనివల్ల అనేక ఆటంకాలు తొలగిపోతాయని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని చెబుతున్నారు. వృథా ఖర్చులు తగ్గించుకొని వాస్తు సూచించిన విధంగా చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల జీవితంలో ఆర్థికంగా స్థిరత్వం దొరుకుతుందని, మంచి స్థాయికి చేరుకుంటారని నిపుణులు నొక్కి వక్కాణిస్తున్నారు. వారు ఏమేం మార్పులు చెబుతున్నారు? అనే వివరాలను ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.
ఇంట్లో ఉండే పూజా మందిరం శక్తి మొత్తం ఇంటిపై ఉంటుంది.
అది మిమ్మల్ని కాపాడుతుంటుంది.
క్రిస్టల్ తో చేసిన శివలింగాన్ని పూజామందిరంలో ఉంచండి.
ఇది మానసిక ప్రశాంతతను, సానుకూల శక్తిని ఇస్తుంది.
దుమ్ము, పాత వస్తువులు లేకుండా చూడండి.
పూజా మందిరాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచండి.

శివరాత్రి, హోలీ, దీపావళి లాంటి పర్వదినాల్లో 3 పాత రాగి నాణాలను శాస్త్రం ప్రకారం పూజించండి.
వాటిని ఎర్రటి వస్త్రంలో కట్టి ఉంచండి.
దాన్ని అలాగే తీసుకెళ్లి నగలు, డబ్బులు ఉండే లాకర్ లో పెట్టండి.
ఇలా చేస్తే ఆ కుటుంబంలో వృథా అవుతున్న ఖర్చులన్నీ నియంత్రించబడతాయి.
ఇంటి సింహద్వారం ఎదురుగా తులసిమొక్కను, అరిచెట్టును పెంచండి.
ఇది వాస్తు దోషాలను తొలగిస్తుంది.
సానుకూల శక్తిని ప్రవేశింపచేస్తుంది.
కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాన్ని పెంచుతుది.
మీ అభివృద్ధికి మార్గం సుగమం అవుతుంది.
ఇంట్లో ఎప్పుడూ ఆనందం ఉంటుంది.
ప్రార్థనా మందిరంలో శంఖం ఊదాలి.
దీనివల్ల ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి.
శంఖంతో చేసే ధ్వని వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది.
ఈ ధ్వని లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది.
ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి.
సాయంత్రం వేళ దీపం వెలిగించి శంఖం ఊదాలి.
ఇంట్లో పాత వస్తువులు ఉంచొద్దు.
వంటగది, పూజా గది, డబ్బు ఉన్న ప్రదేశాలు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి.












Click it and Unblock the Notifications