vastu tips: ఇంట్లో బల్లి కనిపిస్తే లక్ష్మీదేవి వచ్చినట్లే.. జాతకం మారుతుంది!

సాధారణంగా చాలామంది ఇళ్లల్లో గోడలపై బల్లులు తిరుగుతుండటం సర్వసాధారణం. చాలామంది వాటిని చూడగానే అసహ్యించుకుంటూనో, భయపడుతూనో దూరంగా తరిమేస్తుంటారు. కానీ, హైందవ సాంప్రదాయం, వాస్తు శాస్త్రం ప్రకారం.. బల్లి కేవలం ఒక జీవి మాత్రమే కాదు. దానిని సాక్షాత్తూ లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఇంట్లోని కొన్ని ప్రత్యేక ప్రదేశాలలో, నిర్దిష్ట సమయాల్లో బల్లి కనిపించడం వెనుక మీ జీవితాన్ని మార్చేసే అద్భుతమైన సంకేతాలు దాగి ఉన్నాయని శకున శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఆ ఆసక్తికరమైన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం

పూజా గదిలో కనిపిస్తే.. ఐశ్వర్య సిద్ధి!

మీ ఇంట్లోని పూజా గదిలో లేదా దేవుడి పటాల దగ్గర అకస్మాత్తుగా బల్లి కనిపిస్తే అది పరమ పవిత్రమైన సూచన. ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అనుగ్రహం లభించిందని చెప్పడానికి ఇది నిదర్శనం. త్వరలోనే మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని దీని అర్థం.

Vastu If a lizard is spotted in the house it signifies the arrival of Goddess Lakshmi your fortune will change

రెండు బల్లులు కొట్టుకుంటే.. కాస్త అలర్ట్ అవ్వాల్సిందే!

ఒకవేళ మీ ఇంట్లో రెండు బల్లులు ఒకదానితో ఒకటి గొడవ పడుతూ లేదా కొట్టుకుంటూ కనిపిస్తే మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. వాస్తు ప్రకారం ఇది అశుభ సంకేతం. కుటుంబ సభ్యుల మధ్య లేదా బంధువులతో అనవసరమైన మనస్పర్థలు, వివాదాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే నమ్మిన మిత్రుల వల్ల కూడా ఇబ్బందులు ఎదురుకావచ్చు.

గృహప్రవేశం సమయంలో చనిపోయిన బల్లి కనిపిస్తే..

కొత్తగా ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేసేటప్పుడు లేదా కొత్తగా ఏదైనా అద్దె ఇంట్లోకి మారే సమయంలో.. అక్కడ చనిపోయిన బల్లి కనిపిస్తే అది అస్సలు మంచిది కాదు. ఆ ఇంట్లో ప్రతికూల శక్తులు లేదా తీవ్రమైన వాస్తు దోషాలు ఉన్నాయని చెప్పడానికి ఇది సంకేతం. అలాంటప్పుడు ఇల్లు మారే ముందు నిపుణుల సలహాతో శాంతి పూజలు చేయించడం అవసరం.

దీపావళి రోజు కనిపిస్తే.. తిరుగులేని రాజయోగం!

హిందూ సంస్కృతిలో దీపావళి పండుగ రాత్రి వేళ ఇంట్లో బల్లి కనిపించడం అత్యంత అరుదైన అదృష్టంగా భావిస్తారు. ఆ పవిత్రమైన రోజున బల్లి కనిపిస్తే.. మీ జీవితంలో తిరుగులేని రాజయోగం ప్రారంభం కాబోతుందని, ఆ ఏడాది పొడవునా మీకు ఎలాంటి ధన నష్టం లేకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లోనే కొలువై ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

శరీరంపై బల్లి పడితే.. శకున ఫలితాలు!

గోడపై ఉండే బల్లి అకస్మాత్తుగా మనిషి శరీరంపై పడినప్పుడు శకున శాస్త్రం ప్రకారం రకరకాల ఫలితాలు ఉంటాయి. బల్లి పురుషుల కుడి భాగంపై లేదా స్త్రీల ఎడమ భాగంపై పడితే అది చాలా మంచిది. దీనివల్ల సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడంతో పాటు ఉద్యోగ, వ్యాపారాలలో ఉన్నత పదవులు లభిస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+