‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’: ఐశ్వర్యం, ఆరోగ్యానికి ‘వాస్తు భోజన రహస్యాలు’

మనం తినే ఆహారం కేవలం ఆకలిని తీర్చడానికే కాదు... మన ఆలోచనలను, ఆరోగ్యాన్ని, చివరికి మన భవిష్యత్తును కూడా శాసిస్తుంది అంటారు పెద్దలు. అందుకే మన సనాతన సంప్రదాయంలో భోజన నియమాలకు, ముఖ్యంగా వాస్తు శాస్త్రానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఆధునిక కాలంలో డైనింగ్ టేబుల్స్ సంస్కృతి పెరిగినప్పటికీ... ఏ దిక్కున కూర్చుని తింటున్నామనేది మన జీవితంలోని సానుకూలతను నిర్ణయిస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

దిక్కులు - వాటి వెనుక ఉన్న దైవ శక్తులు

వాస్తు శాస్త్రం ప్రకారం విశ్వంలోని ప్రతి దిశకూ ఒక అధిపతి, ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది.
తూర్పు అనేది ఇంద్రుడి స్థానం. ఇదిశక్తిని, ఉత్సాహాన్ని ఇస్తుంది.
ఉత్తరం అనేది కుబేరుడి స్థానం. ఇది సంపదను, శ్రేయస్సును ఇస్తుంది.
పడమర అనేది వరుణుడి స్థానం. ఇది స్థిరత్వాన్ని, సౌఖ్యాన్ని ఇస్తుంది.
దక్షిణం అనేది యముడి స్థానం. ఇది కాలాన్ని, క్రమశిక్షణను ఇస్తుంది.

Vastu Secrets for Dining Food is the Embodiment of the Supreme Divine for Wealth and Health

ఏ దిక్కున కూర్చుని తినాలి?

తూర్పు ముఖం: విద్యార్థులకు, ఉద్యోగులకు బాగుంటుంది
సూర్యుడు ఉదయించే తూర్పు దిక్కు పవిత్రతకు, సరికొత్త శక్తికి నిదర్శనం.
ఈ దిశగా ముఖం పెట్టి భోజనం చేయడం వల్ల
సూర్యరశ్మి లాంటి సానుకూల తరంగాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి.
జీర్ణక్రియ అద్భుతంగా మెరుగవుతుంది. మనసు ప్రశాంతంగా మారుతుంది.
ఏకాగ్రత పెరగాలనుకునే విద్యార్థులకు,
కెరీర్‌లో రాణించాలనుకునే ఉద్యోగులకు ఈ దిశ అమృతంతో సమానం.

ఉత్తర ముఖం: ఐశ్వర్యం, కెరీర్ గ్రోత్ ఉంటుంది
ఉత్తర దిశ సంపదకు అధిపతి అయిన కుబేరుడి స్థానం.
మేధోపరమైన పనులు చేసేవారికి ఇది దివ్యౌషధంలా పనిచేస్తుంది.
ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
వ్యాపారంలో లాభాలు, కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి.
వ్యాపారస్తులు, లీడర్లగా ఉన్నవారు,
కెరీర్‌లో తదుపరి స్థాయికి వెళ్లాలనుకునేవారికి ఇది అనుకూలమైన దిశ.

పడమర ముఖం: భౌతిక సుఖాలు, స్థిరత్వం ఉంటుంది
వరుణ దేవుడి స్థానమైన పడమర దిక్కు జీవితంలో స్థిరత్వాన్ని ఇస్తుంది.
జీవితంలో లగ్జరీ, భౌతిక సుఖసౌకర్యాలు పెరుగుతాయి.
వ్యాపారాల్లో లేదా ఉద్యోగాల్లో సుదీర్ఘకాలం స్థిరపడాలనుకునే వారికి ఇది మంచిది.

దక్షిణ ముఖం: ఎందుకు నివారించాలి?

వాస్తు ప్రకారం దక్షిణ దిశ యమధర్మరాజు స్థానం.
పితృదేవతలకు తర్పణాలు వదిలేటప్పుడు మాత్రమే ఈ దిశను ఎక్కువగా వాడుతుంటారు.
కాబట్టి రోజువారీ భోజనానికి ఈ దిశను నివారించడమే
శ్రేయస్కరం అని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

'భోజన సూత్రాలు'

ఆహారం మన శరీరానికి ఇంధనం లాంటిది.
దాన్ని స్వీకరించేటప్పుడు ఈ చిన్నపాటి నియమాలు పాటిస్తే ఆరోగ్యం మీ సొంతమవుతుంది
భోజనానికి కూర్చునే ముందు ముఖం, చేతులు, కాళ్లు కడుక్కోవడం వల్ల
శరీరంలోని ఉష్ణోగ్రత సమతుల్యమై, ఆకలి పెరుగుతుంది.
తినేటప్పుడు మొబైల్స్, టీవీలకు దూరంగా ఉండండి.
ఆహారంపై దృష్టి పెట్టి తింటేనే లాలాజలం చక్కగా ఊరి,
జీర్ణక్రియ సజావుగా సాగుతుంది.
అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా, దేవుడి ప్రసాదంగా భావించి కృతజ్ఞతతో
స్వీకరిస్తే ఆ ఆహారం అమృతంగా మారుతుంది.
ఎప్పుడూ నిటారుగా కూర్చుని భోజనం చేయాలి.
మంచాలపై పడుకుని లేదా వంగిపోయి తినడం వల్ల జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పడుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+