వాస్తు శాస్త్రం ప్రకారం దేవుడికి ఎన్ని అగరుబత్తీలు వెలిగించాలి?
ప్రతిరోజు కచ్చితంగా మనం ఇంట్లో పూజ చేసుకుంటాం. దీనివల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ పారిపోతాయి. సానుకూల శక్తి ఉంటుంది. పూజ చేసుకునే సమయంలో దేవుడికి హారతి ఇవ్వడంతోపాటు అగరుబత్తీలు కూడా వెలిగిస్తాం. అయితే దీపారాధన సమయంలో ఎన్ని అగరుబత్తీలు వెలిగించాలి? వాటికి ఒక లెక్క ఉంటుందా? ఇన్నే వాడాలి? అనే నియమం ఉందా? తదితర వివరాలను తెలుసుకుందాం.
దేవుడికి వెలిగించే అగర్ బత్తీలకు లెక్క ఉండదు.
మనం ఎన్నైనా వెలిగించుకోవచ్చు.
ఇవి ప్రతికూల శక్తిని పారద్రోలతాయి.
సాయంత్రం ఆరు గంటలకు సాంబ్రాణీ కడ్డీలు,
గుగ్గిలం లాంటి వాటితో పొగ వేస్తే చాలా మంచిది.
సానుకూల శక్తి ఇంకా పెరుగుతుంది.

వీటికి ఒక లెక్కంటూ ఉండకపోయినా మన మనసును బట్టి ఆధారపడివుంటుంది.
మన మనసులో ఉన్న భావనకు అనుగుణంగా కూడా చేసుకోవచ్చు.
3 వెలిగిస్తే త్రిమూర్తులకు వెలిగించినట్లు లెక్క.
5 వెలిగిస్తే పంచభూతాలకు ప్రతీక.
1 అగరుబత్తీ వెలిగిస్తే భగవంతుడు ఒక్కడే అనే భావనతో సమానం.
ఆ భావన మన మనసులో ఉండాలి.
వాస్తు ప్రకారం వెదురును కాల్చడం అశుభంగా పరిగణిస్తారు.
కాబట్టి, లోపల వెదురు పుల్ల లేని ధూపాలను వెలిగించాలి.
ఇలా చేయడంవల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని వాస్తు చెబుతోంది.
అగరుబత్తీలను వెలిగించిన తర్వాత దేవుడి గదిలో ఆగ్నేయ మూల ఉంచాలి.
ఆగ్నేయ మూల అనేది అగ్నికి సంబంధించనది.
ఉదయం, సాయంత్రం వేళల్లో అగరుబత్తీలు వెలిగించడం వల్ల
ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి పోయి, ప్రశాంతత లభిస్తుంది.
విరిగిపోయిన లేదా సగం కాలిన అగరుబత్తీలను తిరిగి వెలిగించడం వాస్తు ప్రకారం దోషం.
అగరుబత్తీల సువాసన మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.
ఇంట్లోని గాలిని శుద్ధి చేస్తుంది.
చందనం లేదా గులాబీ సువాసన గల అగరుబత్తీలు లక్ష్మీ కటాక్షానికి కారణమని పండితులు చెబుతారు.












Click it and Unblock the Notifications