వాస్తు శాస్త్రం, నిపుణులు చెబుతున్నదాని ప్రకారం ఈ వస్తువులు నేరుగా చేతికి ఇవ్వకూడదు

మన ఇంట్లో పెద్దలు అప్పుడప్పుడు "ఉప్పు నేరుగా చేతికి ఇవ్వకూడదు" అనో, లేదా "కత్తి చేతికి అందించకూడదు" అనో చెప్తుంటారు. రోజూవారీ హడావుడిలో మనకు ఇవన్నీ మూఢనమ్మకాల్లా అనిపించవచ్చు. కానీ, భారతీయ వాస్తు, జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మనం చేసే ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లే ఇంట్లోని ప్రశాంతతను దెబ్బతీస్తాయని, లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గడానికి కారణమవుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. మన రోజువారీ జీవితంలో ఏ వస్తువులను నేరుగా ఇతరుల చేతికి ఇవ్వకూడదో, అలా ఇస్తే ఎలాంటి నష్టాలు వస్తాయో తెలుసుకుందాం.

ఉప్పు, మిరియాలు.. ఆర్థిక నష్టానికి సంకేతం

మన వంటగదిలో ఉప్పు అత్యంత పవిత్రమైనది.
ఇది కేవలం రుచికే కాదు, ఇంట్లోని ఐశ్వర్యానికి, లక్ష్మీదేవి కటాక్షానికి ప్రతీక.
ఎవరికైనా ఉప్పును నేరుగా చేతికి అందించడం వల్ల
ఇంట్లో ధన నష్టం జరుగుతుందని,
అనవసరపు ఖర్చులు పెరుగుతాయని వాస్తు నిపుణులు చెబుతారు.
మిరియాలు లేదా కారంగా ఉండే వస్తువులను నేరుగా చేతికి ఇస్తే,
ఇచ్చే వ్యక్తికి, తీసుకునే వ్యక్తికి మధ్య సంబంధాలు దెబ్బతిని, గొడవలు జరిగే ప్రమాదం ఉంది.
వీటిని ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే నేరుగా చేతికి ఇవ్వకుండా..
టేబుల్‌పై పెట్టడం లేదా ఒక చిన్న గిన్నెలో వేసి ఇవ్వడం మంచిది.

vastu tips According to the experts these items should not be handed directly to another person

చేతి రుమాలు.. బంధాల మధ్య దూరం!

చాలామంది ఆత్మీయతతోనో లేదా అలవాటుగానో
తమ చేతి రుమాలును ఇతరులకు ఇస్తుంటారు.
కానీ ఇది అస్సలు మంచి పద్ధతి కాదు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇతరుల రుమాలును ఉపయోగించడం
లేదా మన రుమాలును నేరుగా వారి చేతికి ఇవ్వడం వల్ల
మానసిక ఒత్తిడి పెరుగుతుంది.
ముఖ్యంగా స్నేహితులు లేదా బంధువుల మధ్య
అనవసరపు విభేదాలు వచ్చి, బంధాలు దూరమవుతాయి.

ఇనుప వస్తువులు / కత్తుల వల్ల శని దోషం ముప్పు

జ్యోతిష్య శాస్త్రంలో ఇనుమును 'శని దేవునికి' ప్రీతికరమైన లోహంగా భావిస్తారు.
కత్తులు, కత్తెర్లు లేదా ఇనుప పనిముట్లను ఎవరికైనా నేరుగా చేతికి అందించడం వల్ల
శని దోషం చుట్టుముట్టే అవకాశం ఉంది.
దీనివల్ల ఇంట్లో అనారోగ్య సమస్యలు,
వ్యాపారంలో నష్టాలు వచ్చే సూచనలు ఉంటాయి.
ఇనుప వస్తువులను ఎప్పుడూ నేరుగా చేతికి ఇవ్వకుండా,
కింద పెట్టడం లేదా ఒక పళ్లెంలో ఉంచి ఇవ్వడం ఉత్తమం.

ఇంట్లో సానుకూల శక్తి పెరగాలంటే ఏం చేయాలి?

ఏ వస్తువైనా సరే.. అవతలి వ్యక్తికి ఇచ్చేటప్పుడు కోపంతోనో,
విసుగుతోనో కాకుండా ప్రశాంతంగా, గౌరవంగా ఇవ్వాలి.
పైన పేర్కొన్న వస్తువులను ఇచ్చేటప్పుడు
మధ్యలో ఒక పాత్రను లేదా టేబుల్‌ను ఉపయోగించడం అలవాటు చేసుకోవాలి.
ఈ చిన్న చిన్న మార్పులను మన జీవితంలో భాగం చేసుకుంటే..
ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ తగ్గి, సుఖశాంతులు, లక్ష్మీదేవి అనుగ్రహం
ఎల్లప్పుడూ ఉంటాయని వాస్తు శాస్త్రం స్పష్టం చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+