వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

vastu tips: దీపావళినాడు ఈ నాలుగు జీవాలలో దేనినైనా చూస్తే.. మీ పంట పండినట్టే!!

|
Google Oneindia TeluguNews

హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కరూ అత్యంత సంతోషంగా జరుపుకునే పండుగ దీపావళి పండుగ. అటువంటి దీపావళి పండుగకు ఇంటిని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి? ఇంటిని ఏ విధంగా అమర్చుకోవాలి? ఇంట్లో పెట్టుకునే డెకరేషన్ వస్తువుల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి వస్తువులు ఇంటికి శుభాన్ని చేకూరుస్తాయి? ఎలాంటి వస్తువులను ఇంటికి తీసుకు రాకూడదు? దీపావళి పండుగకు బంధుమిత్రులకు ఎటువంటి బహుమతులను ఇవ్వాలి? వంటి అనేక విషయాలను తెలుసుకున్నాం. అంతేకాదు దీపావళి పండుగ నాడు లక్ష్మీపూజ ను ఏ విధంగా చేయాలి? ఏ సమయానికి లక్ష్మి పూజ ఎలా చేయాలి? పండుగనాడు దీపాలను వాస్తు నియమాల ప్రకారం ఏ విధంగా పెట్టుకోవాలి? వంటి అనేక విషయాలను తెలుసుకున్నాం.

దీపావళి పండుగనాడు ఈ నాలుగింటిని చూస్తే లక్ష్మీ కటాక్షం

దీపావళి పండుగనాడు ఈ నాలుగింటిని చూస్తే లక్ష్మీ కటాక్షం

ఇక ప్రస్తుతం దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండాలంటే ఆ రోజు మనకు నాలుగు జీవులు కనిపిస్తే మంచిదని చెబుతున్నారు జ్యోతిష శాస్త్ర పండితులు. దీపావళి పండుగ రోజున నాలుగు జీవులు కనిపిస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనపై కచ్చితంగా ఉంటుందని చెబుతున్నారు. దీపావళి పండుగనాడు ఈ జంతువుల దర్శనం మనకు సంపదను, శ్రేయస్సును కలిగిస్తుందని, అత్యంత పవిత్రమైనదని చెబుతున్నారు.

దీపావళి పండుగ నాడు ఆవును చూస్తే ఏం జరుగుతుందంటే

దీపావళి పండుగ నాడు ఆవును చూస్తే ఏం జరుగుతుందంటే

హిందూ మతం లో ఆవును అత్యంత పవిత్రమైన జంతువుగా భావిస్తారు. ముఖ్యంగా హిందువులు ఆవును విశేషంగా పూజిస్తారు. దీపావళి పండుగ నాడు ఆవును చూస్తే శుభం జరుగుతుందని ముఖ్యంగా ముదురు గోధుమ వర్ణంలో ఉన్న ఆవును చూస్తే ఇంటికి ఐశ్వర్యం వచ్చి పడుతుందని, సదరు ఇంటి శోభనే మారిపోతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

దీపావళి పండుగనాడు పిల్లి కనిపిస్తే కలిగే ఫలితాలు ఇవే

దీపావళి పండుగనాడు పిల్లి కనిపిస్తే కలిగే ఫలితాలు ఇవే

అంతేకాదు దీపావళి పండుగ నాడు పిల్లి కనిపిస్తే కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. సహజంగా పిల్లి ఎప్పుడైనా కనిపిస్తే దానిని అశుభ సూచకంగా భావిస్తారు. కానీ దీపావళి పండుగనాడు పిల్లి కనిపిస్తే శుభసూచకమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీపావళి పండుగనాడు పిల్లి కనిపించిన వారికి లక్ష్మీదేవి కృప కలుగుతుందని సూచిస్తున్నారు.

దీపావళి నాడు బల్లిని చూశారా.. అయితే జరిగేది ఇదే

దీపావళి నాడు బల్లిని చూశారా.. అయితే జరిగేది ఇదే

దీపావళి పండుగ నాడు బల్లులు కనిపిస్తే కూడా మంచి జరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. బల్లి కనిపించడం లక్ష్మీదేవి ఆనందానికి సూచన అని, బల్లి కనిపించడం వల్ల అంతా మంచే జరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. సహజంగా ఇంట్లో బల్లులను చూసి ఇబ్బంది పడే చాలామంది, దీపావళి పండుగనాడు బల్లులను చూసి లక్ష్మీదేవి ఆగమనాన్ని అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు.

 దీపావళి పండుగనాడు గుడ్లగూబను చూస్తే ఫలితం ఇలా

దీపావళి పండుగనాడు గుడ్లగూబను చూస్తే ఫలితం ఇలా

దీపావళి పండుగ నాడు గుడ్ల గూబ కనిపిస్తే విశేషమైన ఫలితాలుంటాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. సహజంగా గుడ్లగూబ ఇంటి వంక చూసినా, ఇంట్లోకి వచ్చినా ఆ శుభసూచకమని భావిస్తారు. కానీ గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనం కావడంవల్ల, దీపావళి పండుగనాడు గుడ్లగూబ కనిపిస్తే అది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది అని చెబుతున్నారు. దీపావళి పండుగ నాడు గుడ్లగూబ ని చూస్తే వారి అదృష్టం అంతా ఇంతా కాదని చెబుతున్నారు.

English summary
Astrologers say that seeing a dark brown cow, a lizard, a cat, an owl, any of these four creatures on Diwali festival will bring Lakshmi blessings and wealth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X