Vastu tips: ఇంట్లో డబ్బులు అస్సలు ఉండటంలేదా? బీరువా ఆ దిశలో పెట్టండి; ఆపై లక్ష్మీకటాక్షం

ధనం మూలం మిదం జగత్ అంటారు. డబ్బు లేనిదే సృష్టిలో ఏ పనులు జరగవు. మనుషుల జీవితంలో ప్రేమానుబంధాలు, ఆరోగ్యం ఎంత ముఖ్యమైనవో అంతటి ప్రాధాన్యత వున్నది డబ్బుకే.. కొన్ని సందర్భాల్లో అనుబంధాలు నిలబడడానికి, ఆరోగ్యాన్ని కాపాడటానికి కూడా డబ్బు ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి అటువంటి ధనాన్ని నిల్వచేసే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించకపోతే లక్ష్మీదేవి కటాక్షం లభించదు. ధనాన్ని నిల్వచేసే బీరువాను ఇంట్లో పెట్టే విషయంలో కూడా వాస్తు శాస్త్ర నియమాలు ఉంటాయి. ఆ నియమాలేంటో ఇక్కడ మనం తెలుసుకుందాం

బీరువా పెట్టే విషయంలో వాస్తు పాటించాలి

బీరువా పెట్టే విషయంలో వాస్తు పాటించాలి


ఇంటి నిర్మాణంలో వాస్తు శాస్త్రానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో, వాస్తు శాస్త్రంలో ఇంట్లో పెట్టే వస్తువులు, వాటి స్థానాలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఏ గది ఏ వైపు ఉండాలో నిర్దేశించినట్టే, ముఖ్యమైన వస్తువులను కూడా ఏది ఎక్కడ పెట్టాలో నిర్దేశించారు. ఇంట్లో ముఖ్యంగా చెప్పబడే వస్తువులలో, మనం సంపాదించిన ధనాన్ని, నగలను దాచిపెట్టే వస్తువు అయిన బీరువా ఒకటి. అటువంటి బీరువాలను ఎక్కడపడితే అక్కడ పెట్టకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఏ దిక్కున బీరువా పెడితే డబ్బులు నిల్వ ఉంటాయి, ధన నష్టం జరగకుండా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

బీరువాను ఈ దిక్కున పెడితేనే లక్ష్మీ కటాక్షం

బీరువాను ఈ దిక్కున పెడితేనే లక్ష్మీ కటాక్షం

ముఖ్యంగా బీరువాని పెట్టడంలో వాస్తు శాస్త్ర నియమాలను పాటించాలి. ఉత్తర వాయువ్యంలో బీరువా ను పెట్టి డబ్బులు నగలను ఆ బీరువాలో పెడుతుంటే, ధనం పెరగడమే కాకుండా ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఉత్తరం గోడ పడమటి గోడ రెండూ కలిసిన మూల అయిన వై వీధిలో బీరువా పెడితే మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉత్తరానికి బీరువా వెనుకభాగం చూసేవిధంగా డబ్బులు, నగలు పెడితే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది, పోతుంది అని చెబుతున్నారు.

ఈ మూలలో బీరువా పెడితే అన్నీ ఆర్ధిక కష్టాలే

ఈ మూలలో బీరువా పెడితే అన్నీ ఆర్ధిక కష్టాలే

ఇక నైరుతి మూలలో బీరువాలో పెట్టి డబ్బులు , నగలు పెడితే ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. అలా పెడితే బీరువాలో డబ్బులు, నగలు అసలు పెరగవని, జీవితంలో ఆర్థిక వృద్ధి ఉండదని వాస్తు శాస్త్ర నిపుణుల అభిప్రాయం. ఇక ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలంటే బీరువాని సరైన స్థానంలో పెట్టడంతో పాటు, మరి కొన్ని విషయాలలో జాగ్రత్తలు వహించాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. డబ్బును నిర్లక్ష్యంగా ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు అని వాస్తు శాస్త్రం చెప్తుంది.

ఎక్కడ పడితే అక్కడ పెడితే డబ్బు ఉండదు .. నిర్దేశించిన చోటే ధనం పెట్టాలి

ఎక్కడ పడితే అక్కడ పెడితే డబ్బు ఉండదు .. నిర్దేశించిన చోటే ధనం పెట్టాలి

కొందరు ఇంటికి రాగానే జేబులో వున్న డబ్బులు తీసి బల్ల పైన, అల్మారాలో, డైనింగ్ టేబుల్స్ పైన ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటారు. ఇక ఈ పద్ధతి మంచిది కాదని చెబుతున్నారు. ఇక మహిళలు పప్పు డబ్బాలలో, పోపు డబ్బాలలో డబ్బులను రాస్తుంటారు. అలా చేయడం కూడా మంచిది కాదని చెబుతున్నారు. అలా ఎక్కడపడితే అక్కడ లక్ష్మీదేవి ఉండటానికి ఇష్టపడదట. అందుకే డబ్బులను ఎక్కడపడితే అక్కడ పెట్టకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం నిర్దేశించిన దిక్కులలో ఉన్న ధనాన్ని పెడితే ధన వృద్ధి చెందుతుందని, ఇంట్లో సంతోషం నిండుతుంది అని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇంట్లో ఆర్థిక కష్టాలు కలగకుండా వాస్తు శాస్త్రం నిర్దేశించిన సూచనల మేరకు ధనాన్ని పెట్టి లక్ష్మీదేవి కటాక్షం పొందవచ్చని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+