vastu tips: ఇంట్లో ఈ మొక్కలు పెంచకూడదు.. వీటిని పెంచితే దరిద్రం!!
మీ ఇంటిని అలంకరించడానికి ఉత్తమ మార్గాలలో ఒకటి మొక్కలను పెంచడం. అవి మీ ఇంటిని మరింత అందంగా కనిపించేలా చేయడమే కాకుండా, సానుకూల వైబ్‌లను ఆకర్షిస్తాయి. తులసి మరియు అలోవెరా వంటి మొక్కలు వాస్తు అనుకూలమైనవి మరియు ఔషధ గుణాలు కూడా కలిగి ఉన్న మొక్కలు. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం మీరు తప్పనిసరిగా దూరంగా ఉండవలసిన మొక్కల గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

పాలు కారే మొక్కలు ఇళ్ళలో ఉంటే దురదృష్టం
అనేక మొక్కలు వాస్తుకు అనుకూలమైనవి కావు. వాస్తుకు అనుకూలంగా లేని మొక్కలను ఇంట్లో ఉంచినప్పుడు అవి దురదృష్టాన్ని తెస్తాయని చెప్పబడింది. కాబట్టి ఈ మొక్కలు ఎంత అందంగా కనిపించినా, వాస్తు ప్రకారం మీరు వాటిని ఇంటికి దూరంగా ఉంచండి. వాస్తు ప్రకారం ఇంట్లో పెంచుకోకూడని మొక్కల విషయానికి వస్తే పాలు ఉత్పత్తి చేసే మొక్కలను ఇంట్లో పెంచకూడదు. ఒక్క తెల్ల జిల్లేడు చెట్టు మినహాయించి మిగతా పాలు ఉత్పత్తి చేసే మొక్కలను ఇంట్లో పెంచకూడదు అని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇలా పాలు ఉత్పత్తి చేసే మొక్కలు దురదృష్టాన్ని తీసుకొస్తాయని వాస్తు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

బోన్సాయ్ మొక్కలను పెంచటం కుటుంబ ఎదుగుదలకు ఆటంకం
చాలామంది ఇళ్ళలో బోన్సాయ్ మొక్కలను పెంచుకుంటారు. బోన్సాయ్ మొక్కలను పెంచటానికి విపరీతమైన ఆసక్తిని కలిగి ఉంటారు. అయితే బోన్సాయ్ మొక్కలను పెంచడం కూడా వాస్తు శాస్త్రం ప్రకారం మంచిది కాదని చెప్పబడింది.
బోన్సాయ్ లేదా కృత్రిమంగా పెరిగే మరగుజ్జు మొక్కలను ఇంట్లో ఉంచడం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. ఎందుకంటే ఇది అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం, మొక్క కుటుంబ ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తుంది.

ఇంట్లో పత్తి మొక్కలు పెంచటం అశుభం
ఇంట్లో బోన్సాయ్ మొక్కలను పెంచడం వల్ల కుటుంబ ఎదుగుదల నెమ్మదిస్తుంది. బోన్సాయి మొక్కలు కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలను సృష్టిస్తుందని కూడా నమ్ముతారు. ఒకవేళ బోన్సాయ్ మొక్కలను పెంచాలని ఉంటే తప్పనిసరిగా వరండా లేదా తోట వంటి బహిరంగ ప్రదేశంలో ఉంచాలి.
కానీ ఇంట్లో పెట్టకూడదు. ఇక ఇంట్లో పెంచకూడని మరొక మొక్క పత్తి మొక్క. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పత్తి మొక్కలు పెంచడం అశుభాలకు కారణమౌతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితిలోనూ ఇళ్లల్లో పత్తి మొక్కలను పెంచకూడదు.

కాక్టస్ పెంచటం డేంజర్ .. ముళ్ళ మొక్కలు ఇళ్ళలో పెంచటం మంచిది కాదు
ఇక ఇళ్లల్లో పెంచుకోడానికి మరొక విషయానికి వస్తే అది కాక్టస్. వాస్తు మరియు ఫెంగ్ షుయ్ నిపుణుల ప్రకారం, ఈ మొక్క ప్రతికూల ప్రకంపనలను విడుదల చేయడానికి మరియు దురదృష్టాన్ని ఆకర్షించడానికి కారణమవుతుంది. వాస్తు శాస్త్ర నిపుణులనమ్మకం ప్రకారం, కాక్టస్ మొక్కలోని ముళ్ళు చెడు శక్తిని కలిగి ఉంటాయి.
ఫలితంగా కుటుంబ సభ్యులలో ఒత్తిడి మరియు ఆందోళన ఏర్పడుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం గులాబీ తప్ప ఇతర ముళ్ళ మొక్కలు ఇళ్ళలో పెంచటం శ్రేయస్కరం కాదు.

కాక్టస్ పెంచాలంటే సరైన ప్లేస్ లో పెట్టాలి
కాక్టస్ ను పెంచాలి అనుకుంటే కిటికీలో పెట్టాలి ఒకవేళ ఇళ్లలో కాక్టస్ ను పెంచుకోవాలి అనుకుంటే అది సరైన స్థలంలో పెట్టడం అవసరం. కాక్టస్ ను కిటికీ వద్ద ఉంచినప్పుడు, అది లోపలికి ప్రవహించే ప్రతికూల శక్తితో పోరాడుతుందని నమ్ముతారు. కాబట్టి, ఇంట్లో కాక్టస్‌ను పెంచాలి అనుకుంటే జాగ్రత్తగా ఉండండి . దానిని పోరాడే ప్రదేశంలో ఉంచండి. ప్రతికూల శక్తి దానిని ఆకర్షించదు. కాక్టస్ దానికి లోనికి రాకుండా అడ్డుకుంటుంది. ఇంకా చాలా మొక్కలు, చెట్లు ఇళ్ళలో పెంచకూడదు. ఇక ఆ వివరాలన్నీ ముందు ముందు డీటైల్ గా తెలుసుకుందాం.












Click it and Unblock the Notifications