Vastu tips: చీపురును వంటగది దగ్గర ఉంచకూడదు; చీపురు వాడేటప్పుడు తప్పులు చేస్తే ధననష్టం
వాస్తు శాస్త్రంలో చీపురుని ఎలా ఉపయోగించాలో కూడా నియమాలు చెప్పబడ్డాయి. నిత్యం మనం చీపురును గదులు శుభ్రం చేయడానికి ఉపయోగిస్తుంటాం ..ఇంట్లో, ఆఫీసు ఇది అది అని తేడా లేకుండా అన్నిచోట్ల చీపురును ఉపయోగిస్తుంటాం. అటువంటి చీపురును ఉపయోగించే వేళ చీపురుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాలి. చీపురు వాడే సమయంలో తప్పులు చేస్తే ఇంట్లో ధన నష్టం కలుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.

చీపురును తొక్కకూడదు
చీపురును పవిత్రంగా చూస్తాం. చాలామంది ధన త్రయోదశి రోజు కొత్త చీపురును కొనుగోలు చేస్తారు. చీపురును లక్ష్మీదేవికి ప్రతిరూపంగా చూస్తారు. అందుకే పెద్దలు చీపురును తొక్కకూడదు అని చెప్తారు. వాస్తు శాస్త్ర నియమాల ప్రకారం చీపురును వినియోగిస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. చీపురును వినియోగించడంలో పాటించవలసిన జాగ్రత్తల విషయానికి వస్తే

డబ్బులు ఉన్న చోట, వంట గదిలో చీపురు పెట్టరాదు
చీపురుకట్టను ఎక్కడపడితే అక్కడ పెట్టకూడదు. ముఖ్యంగా చీపురుకట్టను డబ్బులు, నగలు పెట్టే స్థలాలలో అస్సలు పెట్టకూడదు. అంతేకాదు వంటగదికి కూడా చీపురు దూరంగా ఉంచాలి. ఇంట్లో వంటగది చాలా ప్రాముఖ్యత ఉంటుంది. వంటగది మనకు కావాల్సిన ఆహారాన్ని అందించే ప్రదేశం . వంట గదిలో చీపురు పెట్టడం వల్ల ఇంట్లో ఆహారానికి కొరత ఏర్పడుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. శుభ్రత కోసం ఉపయోగించే వస్తువులు వేటిని వంట గదిలో పెట్టడం మంచిది కాదు అని శాస్త్రం చెప్తుంది.

చీపురును నిలబెట్టటం వల్ల అనవసరపు ఖర్చులు
చీపుర్లు, మరియు ఇల్లు తుడిచే కర్రలు మురికిని సూచిస్తాయి. అటువంటి మురికిని సూచించే వస్తువులను వంటింట్లో పెట్టడం ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. అంతేకాదు చీపురును ఉపయోగించిన తరువాత చాలామంది దాన్ని నిలబెడతారు. కానీ చీపురును ఆ విధంగా నిలబెట్టడం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఉపయోగించిన తరువాత చీపురును పడుకోబెట్టాలి అని సూచిస్తున్నారు. చీపురును నిలబెట్టి ఉంచడం వల్ల అనవసరపు ఖర్చులు పెరుగుతాయి అని, బ్యాంకు బ్యాలెన్స్ ఖాళీ అవుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.

విరిగిపోయిన చీపురును వాడటం అశుభ సూచకం
బాగా పాడైపోయిన చీపురును ఉపయోగించడం కూడా మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. విరిగిపోయిన చీపురును వాడడం అశుభసూచకంగా పరిగణిస్తారు. అంతేకాదు సాయంత్రం సమయంలో చీపురును ఉపయోగించి ఇల్లు శుభ్రం చేయడం మంచిది కాదని పెద్దలు చెబుతుంటారు. సాయంత్రం సమయాల్లో చీపురును ఉపయోగించడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందని చెప్తారు. రాత్రి సమయంలో ఇల్లు ఊడవడం మంచిదికాదని, ఒకవేళ ఊడ్చినా చెత్త బయటపడెయ్యకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications