వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాస్తు కొలతలు సరిగా లేకపోతే అంతే: గృహ నిర్మాణానికి ఇది తప్పనిసరా?

|
Google Oneindia TeluguNews

ఇంటి నిర్మాణం కొరకు వాస్తుకు సంబంధించిన కొలతలు అతి ముఖ్యమైన అంశంగా భావించాలి.వాస్తు రిత్యా కొలతలు సరిగా లేని గృహం ఫలితం శూన్యం. గృహనిర్మాణానికి స్థలం ఏర్పాటు అయినప్పటి నుండి, గృహనిర్మాణం పూర్తి అయ్యే వరకు ప్రతి దశలో ప్రతి రోజు కొలతల విషయంలో గృహ యజమానియే శ్రద్ధవహించడం చాలా అవసరం అని గుర్తుంచుకోండి.

Recommended Video

వాస్తు ఎందుకు చూస్తారో తెలిస్తే షాక్ అవుతారు ? Importance of Vastu Shastra

అంతే కాకుండా గృహం నిర్మించే తాపిమేస్త్రీని కూడా కొలతల విషయంలో జాగ్రత్తగా ఉండేలా చేయాలి.కొలతలు చక్కగా ఆచారించాలంటే మంచి మేస్త్రీ అవసరం.

చాలా మంది యజమానులకు ఇంటి కొలతలకు వాస్తు శాస్త్ర పద్దతుల విషయంలో ఎటువంటి అవగాహన వుండదు, పెద్దగా పట్టించుకోరు. గృహ నిర్మాణం కోరకు ఏంతో ఖర్చులు చేసి వాస్తు కొలతలకు సంబంధించిన విషయాలు పట్టించుకోకుండా శాస్త్ర పద్దతులతో కొలతలు సరిగ్గా లేకుంటే ఫలితం శూన్యమే అవుతుంది.

 vastu tips to build your house construction

ఇంటికి కొలతలు చూడడం తాపిమేస్త్రీ పని అని గృహస్థులు భావిస్తుంటారు.పూర్వ కాలంలో మేస్త్రీలకు వాస్తు కొలతలపై మంచి అనుభవం ఉండేది,కాని ప్రస్తుత కాలంలో ఏ కొద్దిమంది మేస్త్రీలకు మాత్రమే వాస్తు కొలతలు అనుభవం ఉంటుంది.ఇటీవలి కాలంలో చాలా మంది మేస్త్రీలకు వాస్తు గురించి కాని ,వాటి కోలతల గురించి కాని అస్సలు అవగాహన ఉండడం లేదు. ఒకవేళ కొద్దో గోప్పో ఉన్నా కొలతల విషయాన్ని సీరియస్ గా పట్టించుకోవడం లేదు.

గృహనిర్మాణం కోసం ఏర్పాటు చేసిన స్థలాన్ని మొదట కొలతలు వేయాలి. స్థల మూలలు, దిక్కులు పెరిగి ఉన్నదో గమనించాలి. నైరుతి

మూల మూలమట్టం ఉంచి నైరుతిమూలలను తొంభై డిగ్రీలు ఉండే విధంగా ఏర్పాటు చేసుకొని,తూర్పు, ఉత్తర ఈశాన్యాలు కొద్దిగా పాటి డిగ్రిలు మాత్రమే పెరుగునట్లు ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా చేయునపుడు దక్షిణం వైపు కొలత ఎంతవుందో అంతే కొలత ఉత్తరం కొలతగా వుండాలి. అదే విధంగా పశ్చమం కొలత ఎంతవుందో అదే కొలత తూర్పున కూడా ఉండాలి.

నాలుగు దిక్కుల కొలతలే కాకుండా మూల కొలతలు చాలా ముఖ్యమైనవే వాయువ్యం నుంచి ఆగ్నేయం వరకు గల మూలకొలతను కొలవాలి.అదే విధంగా నైరుతి నుంచి ఈశాన్యం వరకు గల కొలతను కొలవాలి.ఆగ్నేయ వాయవ్యాల మూలకొలత కన్నా, నైరుతి ఈశాన్యాల కొలత ఎక్కువ ఉండాలని అందరు భావిస్తారు.

ఈ విధంగా ఉంటే ఈశాన్యం పెరిగినట్లని వారి అభిప్రాయం.కాని నైరుతి మూల పెరిగి నైరుతి ఈశాన్యం కొలతలు ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఆగ్నేయ వాయవ్య కొలత ఎంత ఉందో అంతే కొలత నైరుతి ఈశాన్యం మూల కూడా ఉండేటట్లు చూడాలి.ఈ విధంగా చేసినప్పుడు రెండు మూల కొలతలు, ఎదురెదురు దిక్కుల కొలతలు సమంగా ఉంటాయి. అప్పుడు నైరుతి ఈశాన్యం మూలకొలతలో ఒకటి రెండు అంగుళాలు పెంచుకోవాలి.

స్థలంలో వివిధ మూలలు పెరిగి ఉన్నప్పుడు ఏ మూలను స్థిరం చేసుకొని కొలత ప్రారంభించాలి..? ఎటువైపు స్థలాన్ని వేరు చేసి వదిలితే మంచిది..? అనే విషయాన్ని స్థలాన్ని బట్టి నిర్ణయించాలే తప్ప ఫలానా పద్దతి మంచిదని చెప్పటం కష్టం. స్థలాన్ని అనుసరిం ఏవైపు పెరిగిన స్థలాన్ని వదిలేస్తే మంచిదనే విషయంలో నిర్ణయం తీసుకోవడంలో స్థల నైసర్గిక స్వరూపము, ఇంటి ప్లాను, వాస్తు శాస్త్రవేత్త అనుభవం పై అధారపడి ఉంటుంది.

ముగ్గు పోయడంలో జాగ్రత్తలు

స్థలం కొలతల ప్రకారం నిర్ణయించిన తరువాత గృహం ప్లానును నేలపై మార్కింగ్ వేయడం ముఖ్యమైనది. దీనినే ముగ్గుపోయడం అంటారు. ముగ్గుపోసే విషయంలో మేస్త్రీ,ఇంజనీరు ఒకరికొకరు సహకరించుకునే విధంగా గృహయజమాని దృష్టిసారించాలి,వాస్తు పండితుడు ఇచ్చే సూచనలను అనుసరించే విషయమై ఇంటి యాజమాని జాగ్రత్త పడాలి.

స్థలం ఎంత శుభ్రంగా ఉంటే అంత ఖచ్చితంగా కొలతలు ఆచరించవచ్చు. స్థలంలో ఎత్తుపల్లాలు ఎక్కువగా ఉన్నప్పుడు కొలతలలో ఎక్కువగా తేడా వస్తుంది. ఇటువంటి సందర్భంలో చాలా జాగ్రత్తగా కొలతలు వేయాల్సి ఉంటుంది. శుభ్రంగా లేని స్థలంలో ముగ్గుపోయడం తాత్కాలికంగా ఇబ్బందే కాకుండా చిరకాలం ఉండాల్సిన ఇంటి కొలతలలో వచ్చే తేడా వలన ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి ముగ్గు పోయడానికి ముందుగా స్థలం శుభ్రంగా ఉండటం ఎంతైనా అవసరం.

గృహం ప్లాను ప్రకారం ముగ్గు పోసినప్పుడు గదులు గదులు, గృహము చాలా చిన్నవిగా కనపడతాయి. కాని అదే ప్లాను గృహం పూర్తి అయిన తరువాత పెద్దదిగా కనిపిస్తుంది.

గదుల గోడల వెడల్పు కన్నా ముగ్గు గీతలు వెడల్పు ఎక్కువగా వుంటాయి. అందుకే ముగ్గు పోసినప్పుడు గదులు చిన్నవిగా కనిపిస్తాయి.

ముగ్గు పోసే విధానంలో కొంత అవగాహన,అనుభవం ఉండాలి. ఇల్లు నిర్మాణం చేసేముందు ఇంజనీర్ ను కలవడం ఎంత ముఖ్యమో వాస్తు సిద్దాంతిని కలవడం అంతకంటే చాలా ముఖ్యం. గ్రహవాస్తు కంటే గృహవాస్తుకు ప్రాధాన్యం ఎక్కువ.

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

English summary
 Vastu is an age old practise of following certain rules to develop and maintain buildings that promises to harness the natural positive energies surrounding us.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X