• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

vastu tips: ఇంటి అలంకరణలో ఒంటెల జత.. బిజినెస్ లో హుషార్.. సమస్యలన్నీ పరార్!!

|
Google Oneindia TeluguNews

వాస్తుశాస్త్రంలో గృహ అలంకరణ వస్తువులు కూడా తగిన ప్రాధాన్యత ఉంటుందని తెలుసుకున్నాం. గృహాలంకరణ వస్తువులుగా ఇంట్లో ఏనుగులను, పరిగెడుతున్న కళ్లెం వేయని గుర్రాలను పెట్టుకుంటే మంచి జరుగుతుందని, శుభఫలితాలు ఉంటాయని తెలుసుకుంన్నాం . ఇక గృహాలంకరణలో ఒంటెల జతను పెట్టుకోవడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

vastu tips: ఇంట్లో ఏనుగుబొమ్మలు పెట్టుకోండి; ఆనందం, ఐశ్వర్యం.. ఆపై జరిగే అద్భుతాలు మీరేచూడండి!!vastu tips: ఇంట్లో ఏనుగుబొమ్మలు పెట్టుకోండి; ఆనందం, ఐశ్వర్యం.. ఆపై జరిగే అద్భుతాలు మీరేచూడండి!!

ఒంటె విగ్రహాలతో ఇంటికి ఎంతో మేలు

ఒంటె విగ్రహాలతో ఇంటికి ఎంతో మేలు


ఇంటిని అలంకరించుకోవడం ప్రతీ ఒక్కరికీ ఇష్టంగానే ఉంటుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో హాల్ లో కానీ, పడక గదిలో కానీ అందమైన షోపీస్‌లు, ఫోటోగ్రాఫ్‌లు లేదా కొన్ని అందమైన వస్తువులు ఉంచబడతాయి. ఇవన్నీ ఇంటిని అందంగా కనిపించేలా చేస్తాయి. అదే సమయంలో, ఈ విషయాలన్నీ వాస్తు ప్రకారం ఉంచినట్లయితే, అవి మరింత సానుకూల శక్తిని కలిగిస్తాయి. అటువంటి పరిస్థితిలో, వాస్తు శాస్త్రం ప్రకారం, మీరు ఇంటిని అలంకరించడానికి ఒక జత ఒంటెలను తీసుకువస్తే, అది ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని చెబుతోంది వాస్తు శాస్త్రం.

 ఒంటె శ్రమకు ప్రతీక.. అందుకే ఒంటె బొమ్మలు ఇంట్లో ఉంటే వృత్తిలో విజయం

ఒంటె శ్రమకు ప్రతీక.. అందుకే ఒంటె బొమ్మలు ఇంట్లో ఉంటే వృత్తిలో విజయం


నిజానికి ఇంట్లో ఒంటె విగ్రహం ఉంటే శుభం కలుగుతుందని నమ్ముతారు. ఇది పనిలో పురోగతి మరియు విజయానికి మార్గంగా సూచిస్తారు. ఎందుకంటే ఒంటె కష్టతరమైన పరిస్థితులలో కూడా అవిశ్రాంతంగా పనిచేస్తుంది, కాబట్టి ఇది ఒక రకమైన శ్రమ జీవిగా పరిగణించబడుతుంది. ఇంట్లో రెండు ఒంటెల విగ్రహాలను ఉంచడం వల్ల వృత్తిలో విజయం లభిస్తుందని, డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారమవుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.

ఒంటె విగ్రహాలను పెట్టటానికి వాయువ్యం అనుకూల దిశ

ఒంటె విగ్రహాలను పెట్టటానికి వాయువ్యం అనుకూల దిశ


ఇక ఒంటెల విగ్రహాలను ఎక్కడపడితే అక్కడ ఉంచకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. వాటిని పెట్టడానికి కూడా సరైన దిశ ఉంటుందని వెల్లడించ బడింది. ఇంట్లో మనం రెండు ఒంటెల విగ్రహాలను ఎక్కడైనా ఉంచాలంటే డ్రాయింగ్ రూమ్ లేదా లివింగ్ రూమ్‌లో వాయువ్య దిశలో ఉంచాలని సూచించబడింది. అప్పుడే అది ప్రయోజనకరంగా ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

 ఒంటెల జత ఇంటికి సంపద తెస్తుంది

ఒంటెల జత ఇంటికి సంపద తెస్తుంది


ఇంట్లో ఒంటె విగ్రహాన్ని ఉంచడం వల్ల ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. అదే సమయంలో, ఒంటెల విగ్రహాలను జంటగా ఉంచినట్లయితే, అది ఇంటికి సంపదను తెస్తుంది. జంట ఒంటెల విగ్రహాలు ఇంటిని సిరి సంపదలతో తులతూగేలా చేస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. చైనీస్ మరియు జపనీస్ వాస్తు అయిన ఫెంగ్ షుయ్ ప్రకారం కూడా ఒంటె విగ్రహాలు వ్యాపార ఇబ్బందులను, ఆర్థిక అడ్డంకులను తొలగిస్తాయి.

నిరంతరం సమస్యలు ఉన్నవారు ఒంటె విగ్రహాన్ని తెచ్చుకోండి.. సమస్యలన్నీ పరార్

నిరంతరం సమస్యలు ఉన్నవారు ఒంటె విగ్రహాన్ని తెచ్చుకోండి.. సమస్యలన్నీ పరార్


ఒక వ్యక్తి తన జీవితంలో నిరంతరం సమస్యలను ఎదుర్కొంటుంటే, అతను ఇంట్లో లేదా కార్యాలయంలో తప్పనిసరిగా ఒంటె విగ్రహాన్ని ఉంచాలని చెబుతారు. దీంతో కెరీర్‌లో సంక్షోభాలను తగ్గించుకోవచ్చునని, సమస్యలన్నీ పరార్ అవుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఇంట్లో పెట్టుకుని గృహాలంకరణ వస్తువుల విషయంలో వాస్తును పాటించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. ఇదే సమయంలో ఇళ్ళల్లో పెట్టకూడని అనేక గృహాలంకరణ వస్తువులకు సంబంధించి కూడా వాస్తు శాస్త్ర నిపుణులు పదే పదే సూచనలు చేస్తున్నారు. వీటిని గమనించి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో జీవితం ముందుకు సాగడానికి సానుకూల ఫలితాలనిచ్చే వస్తువులనే ఇంట్లో పెట్టుకుంటే మేలు జరుగుతుందని వాస్తు నిపుణుల సూచన.

English summary
Vastu Shastra experts say that if you keep camel idols at home, you will be successful in business.. All problems will be avoided. It is said that a pair of camels in home decoration brings wealth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X