vastu tips: కాకి కనిపిస్తే, అరిస్తే.. శుభమా.. అశుభమా? ఏ దిశలో అరిస్తే ఏమవుతుంది!!

కాకి ఒక సాధారణమైనటువంటి పక్షి. కానీ కాకి శనికి వాహనం కావడంవల్ల కాకిని చెడుకు సంకేతంగా భావిస్తారు. అయితే శని మనిషికి చెడును కలిగించే దేవుడు కాదు అనే విషయాన్ని అందరూ గుర్తించాలి. శని సహనాన్ని ఇచ్చే దేవుడు. ఆయనకు వాహనం గా ఉండే కాకి కూడా అపశకునంగా భావించకూడదని చాలామంది చెబుతూ ఉంటారు. అయితే మన ఇంటి వద్ద కాకి కొన్ని దిశల్లో ఉండి అరవడం వల్ల మంచి ఫలితాలు కూడా కలుగుతాయని చెబుతున్నారు.

 కాకి ఏ దిశలో కనిపిస్తే మంచి జరుగుతుంది అంటే

కాకి ఏ దిశలో కనిపిస్తే మంచి జరుగుతుంది అంటే

ముఖ్యంగా ఏ దిశ నుండి కాకి కనిపిస్తే, అరిస్తే మంచి కలుగుతుందో... ఏ దిశలో కాకి కనిపించడంతో పాటు, అరవడం వల్ల చెడు జరుగుతుందో ప్రస్తుతం ఇక్కడ తెలుసుకుందాం. సాయంత్రం ఆగ్నేయ దిశ నుండి వచ్చే కాకి కనిపించినట్లయితే అది ధన లాభం ని సూచిస్తుందని చెబుతున్నారు. ఇక మనిషికి ఎడమ వైపునుండి కాకి వెళితే ఇది మంచి పరిణామంగా పరిగణించబడుతుంది అని చెబుతున్నారు. తెల్లవారుజామున కాకి ఈశాన్య దిశ నుండి ఎగురుతూ వస్తే అది కొన్ని శుభవార్త లను సూచిస్తుంది అని చెబుతున్నారు. ఇంటి ఎదురుగా కూర్చొని అరుస్తూ ఉంటే ఇంటికి అనుకోని అతిధులు వస్తారని చెబుతున్నారు.

కాకి ఇలా కనిపిస్తే అశుభ సూచకం

కాకి ఇలా కనిపిస్తే అశుభ సూచకం


సాయంత్రం వేళ నైరుతి దిశ నుండి కాకి కనిపించినట్లయితే అది ప్రమాదానికి సూచికగా చెబుతున్నారు. కాకి ఒక వ్యక్తి యొక్క మంచం మీద ఏదైనా కాలిన చెక్కను కానీ, ఎముకలను కానీ, మాంసం ముక్కలను కానీ పడవేస్తే అది సమీప భవిష్యత్తులో ప్రమాదాన్ని లేదా మరణాన్ని సూచిస్తుందని చెబుతున్నారు. చాలా కాకులు ఒక మూలకు చేరి ఇంటి చుట్టు పక్కల కలిసి అరవడం ప్రారంభిస్తే అది ప్రమాదానికి సంకేతంగా చెబుతున్నారు. ఇక ఇంటి పై కప్పు పైన కాకి వాలి అరవడం అశుభానికి సంకేతమని, కాకి ఎవరి తలపైన అయినా వాలితే అది అశుభాన్ని సూచిస్తుంది అని అంటున్నారు.

కాకి కనిపిస్తే శుభ ఫలితాలు కూడా

కాకి కనిపిస్తే శుభ ఫలితాలు కూడా


దక్షిణం వైపు ముఖం పెట్టి ఒక కాకి అరుస్తుంటే కుటుంబ పెద్దకు మంచి జరుగుతుందని చెబుతున్నారు. ఒక పంది పైన కాకి కూర్చున్నట్టు అయితే న్యాయపరమైన చిక్కులను సూచిస్తుందని, ఒంటె పైన కానీ, గాడిద పైన గాని కూర్చున్నట్లు అయితే అది శుభసూచకంగా పరిగణించబడుతుంది అని చెబుతున్నారు. ఒక వ్యక్తి తన పైనుంచి ఒకే దిశలో ఎగురుతున్న కాకిని చూస్తే వాళ్లు తమ బంధువులతో అనవసరమైన గొడవలు జరుగుతాయి. కాకి ముక్కు లో ఏదైనా మొక్క జొన్న గింజ గాని, రాయి గాని కనిపిస్తే ఆ వ్యక్తికి ధన లాభం వస్తుందని చెబుతారు.

ఆ దిశలో కాకి ఉంటె ధన లాభం

ఆ దిశలో కాకి ఉంటె ధన లాభం


కాకి ఏదైనా వస్తువులు తీసుకు వెళితే అది ప్రమాదాన్ని సూచిస్తుంది. పండ్ల చెట్టు పైన కాకి కూర్చోవటం చూస్తే సంపదను గౌరవాన్ని పొందుతారు. వాయువ్యం వైపు కాకి అరిస్తే కుంటుంబ పెద్దకు ధన ధాన్యాలు సమకూరుతాయి. ఉత్తరం వైపు ముఖం పెట్టి కాకి కూర్చుంటే కుటుంబ పెద్దలకు కొత్తబట్టలు లేదా వాహనయోగం ఉంటుందని చెబుతారు. కాకి ఈశాన్య దిశగా కూర్చుంటే ఇంట్లోని వారికి ధన లాభం వస్తుందని చెబుతారు.

Disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+