vastu tips: ధన త్రయోదశి నేడే..లక్ష్మీపూజకు ముహూర్తమిదే; లక్ష్మీదేవిని ఎందుకు పూజిస్తారో తెలుసా!!

ధన త్రయోదశి... ధన త్రయోదశి వస్తుందంటేనే మహిళల్లో ఉత్సాహం కనిపిస్తుంది. ధన త్రయోదశి నాడు బంగారం కొనుగోలు చేయడానికి మహిళలు పోటీ పడుతూ ఉంటారు. ధన త్రయోదశి నాడు బంగారం కొనుగోలు చేస్తే, ఆ బంగారం మరింత పెరుగుతుందని, ఐశ్వర్యం కలుగుతుందని మహిళలు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ధన త్రయోదశి తో దీపావళి సంబరాలు ప్రారంభమవుతాయని అందరూ భావిస్తారు.

ధనత్రయోదశి నేడు.. లక్ష్మీదేవికి విశేషమైన పూజలు

ధనత్రయోదశి నేడు.. లక్ష్మీదేవికి విశేషమైన పూజలు

దీపావళి సంబరాలకు శ్రీకారం చుట్టే ధనత్రయోదశి నేడు.. ఇక ధన త్రయోదశి సందర్భంగా అసలు ధనత్రయోదశి ప్రాధాన్యత ఏంటి? ధన త్రయోదశి కి చేయవలసినది ఏమిటి? లక్ష్మీదేవిని ఏ సమయంలో పూజించాలి వంటి అనేక అంశాలను ప్రస్తుతం తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయం ప్రకారం ధనత్రయోదశి కి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ధన త్రయోదశి పండుగ రోజు హిందువులు లక్ష్మీదేవికి విశేషమైన పూజలు చేసి ఆ తల్లి కటాక్షం కోసం ప్రయత్నిస్తారు.

లక్ష్మీదేవి పుట్టినరోజు నేడు

లక్ష్మీదేవి పుట్టినరోజు నేడు

అయితే అసలు ధనత్రయోదశి పండుగను ఎందుకు జరుపుకుంటారంటే పురాణాల ప్రకారం దేవతలు, రాక్షసులు క్షీరసాగరాన్ని మధనం చేస్తున్న సమయంలో సముద్రం నుంచి ఇదే రోజున లక్ష్మీదేవి, కామధేనువు, కల్పవృక్షం, ధన్వంతరి ఉద్భవించారని పురాణాలు చెబుతున్నాయి. ఇక లక్ష్మీదేవి పుట్టిన రోజుగా ఈరోజును అందరూ జరుపుకుంటారు. లక్ష్మీదేవి పుట్టినరోజు కావడంతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేసి, విశేషంగా పూజాదికాలు నిర్వహిస్తారు.

ధన్వంతరి పుట్టింది కూడా నేడే .. వీరిని పూజించటం వల్ల ఐశ్వర్యం

ధన్వంతరి పుట్టింది కూడా నేడే .. వీరిని పూజించటం వల్ల ఐశ్వర్యం

అంతేకాదు ఇదే రోజు ఆయుర్వేద దైవంగా భావించే ధన్వంతరి పుట్టినరోజు కావడంతో, ధన్వంతరికి కూడా విశేషంగా పూజలు చేస్తారు. ఇక ధన త్రయోదశి రోజు లక్ష్మిదేవి తోపాటు, సంపదలకు అధిపతి అయిన కుబేరుడిని కూడా పూజిస్తారు. లక్ష్మీదేవి తో పాటు కుబేరుడిని కూడా పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని, సంపద వృద్ధి జరుగుతుందని భక్తులు విశేషంగా నమ్ముతారు. ఇక అటువంటి ధన త్రయోదశి పర్వదినాన్ని ధన్‌తేరాస్ అని కూడా పిలుస్తారు. ధన్‌తేరాస్ అంటే ధన్ అంటే ధనము, సంపద, తెరాస్ అంటే 13వ రోజు అని అర్థం. అంటే త్రయోదశిని మనం ఈ నెలలో పదమూడవ రోజు గా భావిస్తాము.

 ధనత్రయోదశి నాడు లక్ష్మీ పూజకు ముహూర్తం ఇదే

ధనత్రయోదశి నాడు లక్ష్మీ పూజకు ముహూర్తం ఇదే

ఇక దృక్ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం అక్టోబర్ 22వ తేదీన, శనివారం అంటే నేడు ధన త్రయోదశి వచ్చింది. ఇక ఈ రోజు లక్ష్మీదేవిని పూజించాలి అనుకునేవారు సాయంత్రం 7.01 నుండి 08:17 మధ్య లక్ష్మీదేవిని పూజించవచ్చని, అది అత్యంత శుభప్రదమైన ముహూర్తమని చెబుతున్నారు. అత్యంత శుభప్రదమైన ఈ ముహూర్త సమయంలో పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెబుతున్నారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+