Vastu tips: స్టోర్ రూమ్ లో ఈ వస్తువులు అస్సలు పెట్టొద్దు.. పెడితే దరిద్రమే!!
ఇంట్లో రోజువారీ జీవితంలో ఉపయోగపడని అనేక వస్తువులను స్టోర్ రూంలో ఉంచుతాం. కానీ స్టోర్ రూమ్ విషయంలో జాగ్రత్తలు పాటించకుంటే వాస్తు దోషాలు తలెత్తే అవకాశం ఉంది అని చెబుతున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. స్టోర్ రూమ్ విషయంలో జాగ్రత్తలు వహించకుంటే ఇంటి వాస్తు క్షీణించడమే కాకుండా రాహు, కేతు గ్రహాలు ఇంట్లో తిష్ట వేసి అనేక సమస్యలకు కారణంగా మారుతాయి.

వాస్తులో స్టోర్ రూమ్ కు ప్రాధాన్యత
వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతిదానికీ సరైన స్థానం మరియు దిశ ఉంటుంది. అందుకే వస్తువులను ఎల్లప్పుడూ సరైన స్థలంలో ఉంచాలి అని సూచిస్తున్నారు. అలా కాకుంటే వాస్తు దోషాలను ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. చాలా సార్లు ఇంట్లో వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి . అయితే వాస్తులో చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఇంట్లో పేదరికం మొదలవుతుంది. వాస్తులో వంటగది అత్యంత ముఖ్యమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. ఇక ఇదే సమయంలో స్టోర్ రూమ్ కూడా అంతే ప్రాధాన్యత కలిగి ఉంటుంది.

ఈ వస్తువులను స్టోర్ రూమ్‌లో ఉంచవద్దు
స్టోర్ రూమ్ లో పెట్టే వస్తువులలో ఏ కిచెన్ వస్తువులకు దూరంగా ఉండాలో తెలుసుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. వాస్తు ప్రకారం ఎక్కువ ఉపయోగించని వస్తువులను స్టోర్ రూమ్‌లో ఉంచుతారు. అయితే స్టోర్ రూమ్ లో పాడైపోయిన వస్తువులను ఉంచవద్దు అని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. స్టోర్ రూమ్‌లో కిచెన్‌కి ఎదురుగా ఉండేలా ఎక్కువ కాలం ఉపయోగించని ఇత్తడి పాత్రలను ఉంచవద్దు.

స్టోర్ రూమ్ లో కత్తులు, కత్తెరలు ఉంచకూడదు
అలాగే పాడైపోయిన వాచ్, కుట్టు మిషన్‌ను స్టోర్ రూంలో ఉంచకూడదు. అంతేకాదు పూజగది, వంటగది వస్తువులను స్టోర్ రూంలో ఉంచడం వల్ల పేదరికం పెరుగుతుంది. ఇక స్టోర్ రూమ్ లలో కత్తులు, కత్తెరలు వంటి వస్తువులను పెట్టకూడదు. అంతేకాదు తుప్పుపట్టిన వస్తువులను స్టోర్ రూంలో ఉంచకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. విరిగిపోయినవి, ఏ విధంగానూ పనికి రాని వస్తువులను స్టోర్ రూమ్ లో ఉంచకూడదు.

వాస్తు ప్రతికూల ప్రభావం ఇంట్లో పేదరికానికి కారణం
కొన్నిసార్లు, చాలా కష్టపడి పనిచేసిన తర్వాత కూడా పేదరికం ఎంతో మంది జీవితాలను బాధిస్తుంది. అయితే ఇంట్లో ఎక్కడో ఒక చోట వాస్తు నియమాలు పాటించడంలో తప్పులు చేస్తే ఆర్థిక నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. వాస్తు మన జీవితాలను సానుకూల మరియు ప్రతికూల మార్గాల్లో ప్రభావితం చేస్తుంది. వాస్తు యొక్క సానుకూల ప్రభావం మనల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళుతుంది. అయితే వాస్తు యొక్క ప్రతికూల ప్రభావం ఇంట్లో పేదరికానికి దారి తీస్తుంది.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications