వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

vastu tips: ధన త్రయోదశినాడు బంగారం కొనటం కంటే ఈ చిన్నపనులు చేస్తే అష్టైశ్వర్యాలు!!

|
Google Oneindia TeluguNews

దీపావళి పండుగకు ముందు ధన త్రయోదశిని చాలా విశేషంగా జరుపుకుంటారు. హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే దీపావళి పండుగను సహజంగా ధన త్రయోదశి పర్వదినం తోనే ప్రారంభిస్తారు. ఇక ఆ రోజు ఆయుర్వేద దైవంగా భావించే ధన్వంతరిని విశేషంగా పూజిస్తారు. ప్రతి సంవత్సరం ఆశ్వీయుజ బహుళ త్రయోదశి రోజును ధనత్రయోదశి గా, దంతేరాస్ గా జరుపుకోవడం ఆనవాయితీ. అసలు ధన త్రయోదశి రోజు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అన్న అంశంపై చాలామందికి సరైన పరిజ్ఞానం లేదు అంటున్నారు పండితులు. ధన త్రయోదశి నాడు దానాలు విశేష ఫలితాన్ని ఇస్తాయని చెప్తున్నారు.

vastu tips: దీపావళి పండుగనాడు ఈ పనులు అస్సలు చెయ్యకండి.. లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికాకండి!!vastu tips: దీపావళి పండుగనాడు ఈ పనులు అస్సలు చెయ్యకండి.. లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికాకండి!!

ధన త్రయోదశినాడు బంగారాన్ని కొంటున్నారా? ఇది మీ కోసమే

ధన త్రయోదశినాడు బంగారాన్ని కొంటున్నారా? ఇది మీ కోసమే


ధన త్రయోదశి రోజు చాలామంది బంగారం, వెండి, వాహనాలు, పాత్రలు ఇలా కొత్త వస్తువులను కొనుగోలు చేయడానికి ప్రాధాన్యతనిస్తారు. ధనత్రయోదశి వచ్చిందంటే చాలు బంగారం షాపులన్నీ కిటకిటలాడాయి. ఆ రోజు కనీసం ఒక గ్రాము బంగారం అయినా కొనుక్కోవాలని చాలామంది విశ్వసిస్తారు. అలా బంగారాన్ని కొనుగోలు చేస్తే ఆ బంగారం పెరుగుతుందని విశ్వసిస్తారు. అయితే ధన త్రయోదశి రోజు చెయ్యవలసింది బంగారాన్ని కొనుగోలు చేయడం కాదు. బంగారాన్ని దానం చేయడం అంటున్నారు పండితులు.

ధన త్రయోదశి నాడు ఇవి దానం చేస్తే అఖండ ఐశ్వర్యం

ధన త్రయోదశి నాడు ఇవి దానం చేస్తే అఖండ ఐశ్వర్యం


ధన త్రయోదశి రోజు పెసర గింజంత బంగారాన్ని దానం చేస్తే, గుమ్మడి కాయంత బంగారం మన ఇంటికి వచ్చి చేరుతుందని చెబుతున్నారు. దాన ధర్మాలతో మంచి జరుగుతుందని చెబుతున్నారు. ధన త్రయోదశి నాడు బంగారం, వెండి, ముత్యాలు, పగడాలు, రత్నాలు తదితరాలను దానం చేయడం మంచిదని, దానివల్ల మంచి ఫలితాలు కలుగుతాయి అని చెబుతున్నారు. అంతేకాదు ధన త్రయోదశి నాడు పాలు, పెరుగు, తేనె, వెన్న దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు.

ధనత్రయోదశి నాడు దంపతులు ఈ పని చేస్తే అన్యోన్య దాంపత్యం

ధనత్రయోదశి నాడు దంపతులు ఈ పని చేస్తే అన్యోన్య దాంపత్యం


అంతేకాదు ధన త్రయోదశి నాడు తెల్లని వస్త్రాలు, కాళ్లకు చెప్పులు, గొడుగు దానం చేసినవారికి అఖండమైన సంపదలు వస్తాయని పండితులు చెబుతున్నారు . భార్యాభర్తల జీవితం సాఫీగా సాగాలంటే, దంపతులు అన్యోన్యంగా జీవితం సాగించాలంటే ధన త్రయోదశి నాడు ఎవరికైనా పరుపును కానీ, మంచాన్ని కానీ దానం చేయాలని సూచిస్తున్నారు. ఇలా దానం చేస్తే ఆ దంపతులు ఎప్పటికీ విదిపోరని అంటున్నారు. సువర్ణ దానం, వస్త్ర దానం, శయ్యా దానం, వస్తు దానం, పదార్థాల దానం ఇలా పైన పేర్కొన్న ఐదు రకాల దానాలలో ఏ దానం చేసినా అఖండమైన ఐశ్వర్యం కలుగుతుందని చెబుతున్నారు.

దానధర్మాలతో లక్షీ దేవికి సంతోషం.. ఆపై లక్ష్మీ కటాక్షం

దానధర్మాలతో లక్షీ దేవికి సంతోషం.. ఆపై లక్ష్మీ కటాక్షం


దానం ఉద్దేశం త్యాగం అని, ధన త్రయోదశి నాడు దానం చేయడం లక్ష్మీదేవికి సంతోషాన్ని కలిగిస్తుందని, కచ్చితంగా ఆమె కృప దానధర్మాలు చేసిన వారిపై ఉంటుందని చెబుతున్నారు. ధన త్రయోదశి రోజు బంగారాన్ని లేదా కొత్త వస్తువులను కొనుక్కుని దాచుకునే బదులు, ఉన్న దానిలో కొద్దో గొప్పో దానం చేస్తే మంచి ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
It is said that instead of buying gold on Dhanteras, donating gold, silver and pearls, donating white clothes, donating milk, curd, butter and honey will bring special results and wealth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X