vastu tips: మీ పూజగదిలో ఇవి ఉన్నాయా? వెంటనే తొలగించండి.. లేదంటే అరిష్టం!!

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో అత్యంత పవిత్రమైన స్థలం పూజ గది. చాలా ఇళ్ళల్లో కచ్చితంగా పూజగది ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే పూజ గదిలోనే ఇంటికి కావలసిన పాజిటివ్ ఎనర్జీ పుడుతుంది. ఇంట్లోని ప్రతికూలతలు తొలగించుకోవడానికి పూజ గది కీలక పాత్ర పోషిస్తుంది. ఇక అటువంటి పూజ గదిలో కొన్ని వస్తువులను ఉంచడం వల్ల ఇంట్లో మానసిక అశాంతి నెలకొంటుంది. పూజ గదిలో ఉండకూడని వస్తువులు ఏంటి? ఒకవేళ ఆ వస్తువులను ఉంచితే ఏం జరుగుతుంది? వంటి అనేక విషయాలను ఈరోజు తెలుసుకుందాం.

పూజగదిలో విరిగిపోయిన విగ్రహాలు

పూజగదిలో విరిగిపోయిన విగ్రహాలు

పూజ గదిలో కొన్ని వస్తువులను ఉంచడం వల్ల సంపద తగ్గిపోతుంది. మన శ్రేయస్సు పైన కూడా చెడు ప్రభావం పడుతుంది. అరిష్టం వస్తుంది. మానసిక అశాంతి, కుటుంబములో ఐక్యత లోపిస్తుంది. ముఖ్యంగా ఈ వస్తువులను పూజ గదిలో నుంచి తొలగిస్తేనే, ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. అటువంటి వాటిలో ముఖ్యంగా విరిగిపోయిన విగ్రహాలు ఒకటి. పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలు ఎట్టిపరిస్థితులలోనూ ఉండకుండా చూసుకోవాలి. అలాంటి విగ్రహాలు ఉంటే ఎన్ని పూజలు చేసినా సత్ఫలితాలు రావు. అలాంటి విగ్రహాల వల్ల ప్రతికూల శక్తి ఎక్కువగా ఇంట్లో వ్యాపిస్తుంది. అందుకే కచ్చితంగా విరిగిపోయిన విగ్రహాలను పూజ గది నుంచి తొలగించాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

కోపంతో కూడిన దేవుళ్ళ విగ్రహాలు, చిత్రాలు

కోపంతో కూడిన దేవుళ్ళ విగ్రహాలు, చిత్రాలు

పూజ గదిలో ఉండకూడని మరొక వస్తువు కోపంతో కూడిన విగ్రహాలు. నటరాజ విగ్రహం వంటి ఆగ్రహంతో ఉన్న దేవుళ్ళ విగ్రహాలు ఎప్పుడు పూజగదిలో ఉంచకూడదు. అలాంటి పటాలు ఉన్నా, అలాంటి విగ్రహాలు ఉన్నా అవి వారికి దురదృష్టాన్ని తీసుకొస్తాయి. ఇక ఇదే సమయంలో పూజ గదిలో ఒకటి కంటే ఎక్కువ దేవతా విగ్రహాలను ఉంచకూడదు. చాలామంది ఎక్కడపడితే అక్కడ దేవతా విగ్రహాలను కొనుక్కొచ్చి, పూజ గది నిండా అలంకరిస్తారు. అయితే అది ఏమాత్రం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలా చేస్తే చెడు ప్రభావం ఉంటుంది హెచ్చరిస్తున్నారు.

చిరిగిపోయిన పుస్తకాలు, పగిలిపోయిన ఫోటో ఫ్రేములు

చిరిగిపోయిన పుస్తకాలు, పగిలిపోయిన ఫోటో ఫ్రేములు

ఇక పూజ గదిలో ఉండకూడని మరొక వస్తువు చిరిగిపోయిన మతపరమైన పుస్తకాలు, పగిలిపోయిన ఫోటో ఫ్రేమ్ లు. చిరిగిపోయిన మతపరమైన పుస్తకాలను పూజగదిలో ఉంచడం వల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే పగిలిపోయిన ఫోటో ఫ్రేమ్ లతో కూడా ఇంట్లో అశాంతి చోటు చేసుకుంటుంది. కనుక అలాంటివాటిని ఇంట్లో ఉంచుకోకుండా, నీటిలో వేయడం మంచిదని సూచిస్తున్నారు.

 విరిగిపోయిన నూకల అక్షంతలు ..

విరిగిపోయిన నూకల అక్షంతలు ..

ఇక పూజ గదిలో ఉండకూడని మరొక వస్తువు అక్షంతలు గా ఉపయోగించే బియ్యంలో నూకలు ఉండకూడదు. అలా నూకలను అక్షతలుగా ఉపయోగిస్తే ఖచ్చితంగా చెడు జరుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు దేవతలకు నైవేద్యంగా కూడా నూకలతో తయారు చేసిన ఆహార పదార్థాలను పెట్టకూడదు. ఇక అలాంటి బియ్యాన్ని పూజ గదిలో వినియోగిస్తే పూజ ఫలితం ఉండదు. కాబట్టి వాటిని తొలగించి వాటి స్థానంలో మంచి బియ్యాన్ని ఉంచాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

పూర్వీకుల, మరణించిన వారి చిత్రపటాలు

పూర్వీకుల, మరణించిన వారి చిత్రపటాలు

పూజ గదిలో పెట్టకూడదని మరొక వస్తువు పూర్వీకుల, మరణించిన వారి చిత్ర పటాలు. ఇక ఇవి మన జీవితం పై చాలా ఇబ్బందికరమైన ప్రభావాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని పూజ గదిలో ఉంచవద్దు. వీటిని ఇతర ప్రదేశాలలో ఉంచటానికి కూడా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఇక పూజ గది ఎప్పుడూ శుభ్రంగా, పాజిటివ్ ఎనర్జీ ని కలిగించే విధంగా ఉండాలి. అలా కాకుండా పూజ గది కూడా చిరాకుగా ఉంటే, వారి జీవితాల్లో చిరాకులు ఎట్టిపరిస్థితుల్లోనూ తొలగిపోవు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+