వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

vastu tips: తూర్పుదిక్కు ప్రాధాన్యత తెలుసా? తూర్పుదిక్కున ఈ పనులు అస్సలు చెయ్యొద్దు!!

|
Google Oneindia TeluguNews

వాస్తు శాస్త్రంలో దిక్కులకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. వాస్తు శాస్త్రంలో దిక్కు లను బట్టి వాస్తు నియమాలను రూపొందించారు. ఏ దిశలో ఏం చేయాలి? ఏ దిశలో ఏం చేయకూడదు? ఏ దిశలో పని చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి? వంటి అనేక అంశాలు వాస్తు శాస్త్రంలో పొందుపరిచారు. ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి దిక్కుకు తమదైన ప్రాధాన్యత ఉంటుంది. ఇక ఆయా దిక్కులలో చేయవలసిన పనులు, చేయకూడని పనులు కూడా నిర్ధారించబడి ఉంటాయి.

vastu tips: భార్యాభర్తల మధ్య గొడవలా? అయితే ఈ సింపుల్ వాస్తుచిట్కాలు ట్రై చెయ్యండి!!vastu tips: భార్యాభర్తల మధ్య గొడవలా? అయితే ఈ సింపుల్ వాస్తుచిట్కాలు ట్రై చెయ్యండి!!

 తూర్పు దిశకు అధిపతి సూర్యుడు..

తూర్పు దిశకు అధిపతి సూర్యుడు..

ఇక ఈ క్రమంలో వాస్తు శాస్త్రంలో తూర్పు దిశలో చేయకూడని పనుల గురించి చెప్పుకునే ముందు తూర్పు దిశ యొక్క ప్రాధాన్యత గురించి తెలుసుకోవాలి. తూర్పు దిక్కుకు సూర్యుడు అధిపతి. తనవారి కోసం అవసరమైతే ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉండే సూర్యభగవానుడిచే పాలించబడే దిశ తూర్పు దిశ. అందుకే సహజంగా మనం ఇల్లు నిర్మించుకుంటే తూర్పు దిశలోనే ప్రవేశ ద్వారాన్ని ఉండేలా చూసుకుంటాము. తూర్పు దిక్కుకు ఉండే ప్రాధాన్యత అలాంటిది. ఉదయం పూట సూర్యకాంతి ఇంట్లోకి ప్రవేశిస్తే, మన శరీరం పైన పడితే మంచిదని వాస్తుశాస్త్రం చెబుతోంది. అందుకే తూర్పు దిశలో లివింగ్ రూమ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాం.

తూర్పు దిశలో చెయ్యకూడని పనులివే

తూర్పు దిశలో చెయ్యకూడని పనులివే


అటువంటి తూర్పు దిశలో మనం చేయకూడని అనేక పనులు ఉన్నాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక సూర్యభగవానుడు ఉండే తూర్పు దిశలో సూర్యుడికి ఎదురుగా ముఖం కడగడం, ఉమ్మివేయడం చేయకూడదు. అంతేకాదు తూర్పు దిశలో చెత్త పడ వేయకూడదు. ఇక తూర్పుదిశలో చెప్పుల స్టాండ్ లు పెట్టడం, చెప్పులు ఎలా పడితే అలా పడెయ్యటం చెయ్యకూడదు. తూర్పుదిశలో పాడైపోయిన వస్తువులను జమ చేయటం చెయ్యకూడదు. తూర్పు దిశను చాలా పవిత్రమైనదిగా భావించి, ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. తూర్పు దిశను పాలించే సూర్యుడు మనల్ని కరుణించాలి అంటే కచ్చితంగా వాస్తు నియమాలను పాటించాలి.

తూర్పు దిశలో చెయ్యవలసిన పనులివే

తూర్పు దిశలో చెయ్యవలసిన పనులివే


తూర్పుదిశలో మురుగు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. తూర్పు దిశ ఎంత శుభ్రంగా కనిపిస్తే అంత ప్రశాంతంగా జీవితం ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక తూర్పు దిశలో గార్డెనింగ్ చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. తూర్పున డ్రాయింగ్ రూమ్ ఉన్నా మంచిదే అని చెప్తున్నారు. ఉదయం లేచిన వెంటనే తూర్పు దిశకు అభిముఖంగా నిలబడి కాసేపు వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సూర్య భగవానుడికి ఒక చెంబుడు నీటితో నమస్కరించటం వల్ల కూడా మేలు జరుగుతుంది.

 తూర్పు దిక్కు శుభ్రంగా ఉంటే సూర్యుడి అనుగ్రహం

తూర్పు దిక్కు శుభ్రంగా ఉంటే సూర్యుడి అనుగ్రహం


ఇంట్లో దేవతలకు ఏ విధంగా అయితే పూజ చేస్తామో, అదేవిధంగా తూర్పు దిక్కును శుభ్రంగా ఉంచి సూర్యభగవానుని స్మరించుట వల్ల మంచి జరుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ధృడమైన శరీరం, మానసిక ఆరోగ్యం తూర్పు దిక్కున వాస్తు దోషాలు లేకుండా చూసుకుంటే ఉంటాయని అంటున్నారు. అందుకే తూర్పు దిక్కుకు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని వాస్తు దోషాలు కలిగేలా పనులు చేయకూడదు, ఆ సూర్య భగవానుడి అనుగ్రహం కలిగేలా చిన్న చిన్న జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

Disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
Sun is the lord of east direction. Throwing garbage, spitting, putting sandals, putting old goods, sewage should not be done in such east direction.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X