vastu tips: ఈ పనులు చెయ్యకండి.. ఇంట్లో దరిద్రదేవత తిష్ట వేస్తుంది!!

ఇళ్లల్లో మనం చేసే పనులు మనకు తెలియకుండానే దరిద్రాన్ని తెచ్చి పెడుతూ ఉంటాయి. అందుకే మనం ఏ పని చేస్తున్నా, ఆ పని చేయొచ్చా.. చేయకూడదా అనేది తెలుసుకొని చేయడం మంచిది. ముఖ్యంగా నిత్య జీవితంలో మనం చేసే చిన్న చిన్న తప్పులే మన ఇంటికి దరిద్ర దేవత తీసుకొస్తాయని చెబుతున్నారు. మరి మనం చేసే ఆ తప్పులు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదయాన్నే ఈ పనులు చెయ్యకండి

ఉదయాన్నే ఈ పనులు చెయ్యకండి


తెలిసీ తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లు చాలా సమస్యలకు కారణం గా మారుతున్నాయి. హిందూ సాంప్రదాయాలు నమ్మే వారు మాత్రం కచ్చితంగా ఈ చిన్న చిన్న పొరపాట్లు చేయకుండా ఉంటే మంచిదని సూచించబడింది. వాటిలో ముఖ్యంగా పొద్దు పోయే వరకు నిద్రపోకూడదు. ఉదయం సూర్యోదయం కాకముందే కచ్చితంగా నిద్ర లేవాలి. ఇక ఇంటి ముందు ఊడ్చి, నీళ్లు చల్లి ముగ్గు పెట్టుకునేవాళ్ళు.. పొద్దుపోయిన తర్వాత నీళ్లు చల్లితే సూర్యుడు ముఖంమీద నీళ్లు చల్లినట్లేనని చెబుతున్నారు. అది సూర్యుడికి ఆగ్రహాన్ని తెప్పిస్తుంది అని, మీకు అనారోగ్యాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు. కాబట్టి పొరపాటున కూడా పొద్దుపోయేవరకు నిద్ర పోకూడదు.

ఈ పనులు చేస్తే దరిద్ర దేవతకు ఆహ్వానం పలికినట్టే

ఈ పనులు చేస్తే దరిద్ర దేవతకు ఆహ్వానం పలికినట్టే


నిద్ర లేవగానే చాలామంది దుప్పటి విదిలించి, చక్కగా మడత పెట్టిన తర్వాత బయటకు రావాలి. దుప్పటి తీసి అలా మంచంమీద పడేసి రాకూడదు. అలా దుప్పటి మడత పెట్టకుండా వస్తే దరిద్ర దేవత చక్కగా వచ్చి కూర్చుంటుందట. అందుకే ఎవరు ఎట్టిపరిస్థితులలోనూ దుప్పటి మడత వేయకుండా బయటకు రాకూడదు. చాలామంది భోజనం చేసిన తరువాత తిన్న ఎంగిలి పళ్లెం చేతిలో పట్టుకొని, చేయి కూడా కడుక్కోకుండా అలాగే కూర్చుంటారు. అయితే అది ఏమాత్రం మంచిది కాదని, అలా చేసినా దరిద్ర దేవత వచ్చి కూర్చుంటుంది అని, ఇంట్లో వాళ్ళు అనారోగ్యాల పాలు అవుతారని చెబుతున్నారు.

సాయంత్రం ఈ పనులు అస్సలు చెయ్యకండి

సాయంత్రం ఈ పనులు అస్సలు చెయ్యకండి


అంతేకాదు మాసిన బట్టలు ఉతికిన తర్వాత స్నానం చేయాలి. పొరపాటున కూడా బట్టలు ఉతికేటప్పుడు, ఆ నీళ్ళను కాళ్ళమీద పోసుకుంటే కూడదు. అలా చేస్తే దరిద్రం వచ్చి పడుతుందట. ఇక వంట గదిలో వంట పాత్రలను పెట్టుకోవడానికి ఉపయోగించే మాసిపోయిన బట్టలను పొద్దుపోయిన తర్వాత ఉతకకూడదు. ఇల్లు ఊడ్చిన చీపురును నిలబెట్ట కూడదు. సాయంత్రం సమయంలో ఎప్పుడు పొరపాటున కూడా నిద్ర పోకూడదు. భార్య భర్తలు సాయంత్రం సంసారం చెయ్యకూడదు. ఎవరితోనూ గొడవ పడకూడదు. సాయంత్రం సమయంలో ప్రదోషకాల ధ్యానం, పూజ మంచి ఫలితాలను ఇస్తాయి.

దరిద్రాన్ని ఇంటికి తెచ్చుకోకూడదు అంటే ఇవి పాటించండి

దరిద్రాన్ని ఇంటికి తెచ్చుకోకూడదు అంటే ఇవి పాటించండి


ఇక సాయంత్రం 6 దాటిన తర్వాత సూది, ఉప్పు, కోడిగుడ్లు, నూనె వంటివి ఇంటికి తెచ్చుకోకూడదు. ఒకవేళ వాటిని తెచ్చుకుంటే దరిద్రాన్ని ఇంటికి తెచ్చుకున్నట్టే.
ఇంట్లో దుమ్ము, ధూళి, చెత్తాచెదారం జమ చేసుకోకూడదు. పగిలిపోయిన, విరిగిపోయిన వస్తువులను ఇంట్లో ఉంచుకోవడం మంచిది కాదు. రాత్రి పూట గాజులు , తాళిబొట్టు తీసి పక్కన పెట్టుకోకూడదు. ఇక మహిళలు మంగళ సూత్రాలకు దేవుడు బొమ్మలు, సేఫ్టీ పిన్నులు తగిలించకూడదు. ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది మాట్లాడకూడదు. నోటికొచ్చింది తిట్టకూడదు. ఇలా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మంచిది. అలా కాకుండా తెలిసీ తెలియక ఇలాంటి పనులన్నీ చేస్తే దరిద్ర దేవత మీ ఇంట్లో తిష్ట వేయటం ఖాయం.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+