Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Vastu tips: ధనవంతులు కావాలని కలలు కంటున్నారా? అయితే ఇంట్లో ఈ వాస్తుమార్పులు చేసుకోండి!!

మన సమాజంలో దాదాపు అందరూ ధనవంతులు కావాలని కలలు కంటూ ఉంటారు. వారి బ్యాంకు ఖాతాలో తగినంత డబ్బు ఎప్పటికీ ఉండాలని, కుటుంబం సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దాని కోసం, మెరుగైన జీవితాన్ని పొందడం కోసం డబ్బును ఆదా చేయడానికి శతవిధాల ప్రయత్నిస్తారు. అయినప్పటికీ, వారు అనుకున్నది సాధించలేరు. ఎంత డబ్బు దాచి పెట్టాలని ప్రయత్నం చేసినా, ఏదో ఒక రకంగా డబ్బు ఖర్చవుతూనే ఉంటుంది. అలాంటి సమయంలో వారు తీవ్ర నిరాశకు గురవుతారు.

 వాస్తు దోషాలతోనే ధననష్టం.. చిన్న మార్పులతో ధన లాభం

వాస్తు దోషాలతోనే ధననష్టం.. చిన్న మార్పులతో ధన లాభం

అయితే వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో వాస్తు దోషం డబ్బు నష్టానికి దారితీస్తుంది. దాన్ని సరిదిద్దడానికి మరియు సమృద్ధిగా డబ్బును ఆకర్షించడానికి, వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో తప్పనిసరిగా ఉండే కొన్ని వస్తువులను ఉంచాలని సూచిస్తుంది. చిన్న చిన్న వాస్తు మార్పులు చేసుకుంటే ఖచ్చితంగా ఇంట్లో డబ్బు ఉంటుందని, త్వరితగతిన వారు ధనవంతులు అవ్వడానికి వీలవుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఆ మార్పుల విషయానికి వస్తే..

ప్రధాన ద్వారం వద్ద గణేశుడు విగ్రహాన్ని, లేదా పటాన్ని పెట్టుకోండి

ప్రధాన ద్వారం వద్ద గణేశుడు విగ్రహాన్ని, లేదా పటాన్ని పెట్టుకోండి


వాస్తు శాస్త్రం ప్రకారం ప్రధాన ద్వారంకి ఇరువైపులా గణేష్ విగ్రహాలు ఉండటం ముఖ్యం. గణేశుడి బొమ్మ లేదా విగ్రహాన్ని ఉంచడం వల్ల ఇంట్లో వాస్తు దోషం తగ్గుతుంది. కను దిష్టి గణపతి విగ్రహాన్ని పెట్టుకుంటే మరింత మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. గణపతి విగ్రహాన్ని ఇంటిముందు పెట్టుకోవడం వల్ల ఆనందం మరియు శ్రేయస్సు లభిస్తుంది. అనవసరపు ఖర్చుల నుండి విముక్తి లభిస్తుంది. ఇక ఐశ్వర్యవంతులు అవడానికి ఇది కొంత మార్గం సుగమం చేస్తుంది.

 తులసి మొక్క ఇంటి ముందు ఉంటే ఐశ్వర్యం

తులసి మొక్క ఇంటి ముందు ఉంటే ఐశ్వర్యం


వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్క సంపద మరియు శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణించబడుతుంది. ఇంటికి ఈశాన్య దిశలో తులసి మొక్కను పెట్టడం తప్పనిసరి అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంటి ముందు ఈశాన్య భాగంలో తులసి మొక్క ఉంటే శుభప్రదంగా పరిగణించబడుతుందని చెబుతున్నారు. ఇది ఇంట్లో సానుకూలతకు హామీ ఇస్తుంది. సానుకూలత ఉన్న చోట ధన ప్రవాహం కూడా కొనసాగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

 ఇంట్లో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పూజలు చేస్తే ధనప్రాప్తి

ఇంట్లో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పూజలు చేస్తే ధనప్రాప్తి


ఇంట్లో పూజ మందిరంలో ప్రతిరోజూ ఉదయం మరియు సాయంత్రం దీపం వెలిగించడం ముఖ్యం. ఇలా చేయడం వల్ల ఇంట్లో వాతావరణం స్వచ్ఛంగా ఉంటుంది. గుడిలో లక్ష్మీదేవి చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని కూడా ఉంచాలని గుర్తుంచుకోండి. ప్రతి రోజూ పూజలు చేయడం వల్ల ధన, ధాన్యాలకు లోటు లేకుండా ఉంటుందని, లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

కుబేర యంత్రం పెట్టుకుంటే సత్ఫలితాలు

కుబేర యంత్రం పెట్టుకుంటే సత్ఫలితాలు


కుబేరుడు సంపద మరియు శ్రేయస్సును కలిగించే దేవుడు అని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటి ఉత్తర దిశలో, ఈశాన్య మూలలో కుబేరుడు పాలిస్తాడు. కాబట్టి కుబేరుడు ఉండే స్థలాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలని, టాయిలెట్లు, షూ రాక్లు లేదా పాడై పోయినా ఫర్నిచర్ వంటి ప్రతికూల వస్తువులను అక్కడ పెట్టకూడదని సూచిస్తున్నారు. శ్రేయస్సు కోసం ఉత్తర భాగంలోని ఉత్తర గోడపై కుబేర యంత్రాన్ని వచ్చి పూజించడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది అని చెబుతున్నారు.

 బీరువాలు, లాకర్స్ ఈ దిశలో ఉంటే ధనవంతులు కావడం తథ్యం

బీరువాలు, లాకర్స్ ఈ దిశలో ఉంటే ధనవంతులు కావడం తథ్యం


అన్ని విలువైన వస్తువులను - నగలు, డబ్బు మరియు ముఖ్యమైన పత్రాలను ఇంటి నైరుతి మూలలో ఉంచండి. ఉత్తరం వైపు చూస్తున్నట్లుగా డబ్బులు భద్రపరిచే బీరువాలు ఉండడంవల్ల ధన ప్రాప్తి కలుగుతుందని చెబుతున్నారు. మీరు ప్రధాన సేఫ్ లను, బీరువాలను, లాకర్‌లను దాని తలుపు ఉత్తరం లేదా ఈశాన్య దిశలో తెరుచుకునే విధంగా ఉంచినప్పుడు ఆర్థిక సమస్యలు నివారించబడతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ఈశాన్య భాగంలో నీటివనరులు ఉంటే ధన ప్రవాహం

ఈశాన్య భాగంలో నీటివనరులు ఉంటే ధన ప్రవాహం

ఇంట్లో ముఖ్యంగా ఈశాన్య భాగంలో నీటి వనరులను ఉంచడం వల్ల సానుకూలత మరియు శ్రేయస్సు లభిస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఈశాన్య భాగంలో అక్వేరియం లేదా ఒక చిన్న ఫౌంటెన్ ఏర్పాటు చేయడం మంచిదని సూచిస్తున్నారు. ప్రవహించే నీటిలో ఉన్న వస్తువులను ఈశాన్యం వైపు పెడితే ఆర్థికంగా లాభం చేకూరుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు . కాబట్టి వాస్తు శాస్త్ర పరంగా ఉన్న ఈ చిన్న చిన్న మార్పులు చేస్తే కచ్చితంగా ధనవంతులవుతారని వాస్తు శాస్త్ర పండితులు చెబుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+