వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

vastu tips: ఎంత కష్టపడినా వ్యాపారం లాభాలబాటలో సాగడంలేదా? అయితే ఈ చిట్కాలు మీకోసమే!!

|
Google Oneindia TeluguNews

చాలామంది వ్యాపారులు ఎంత కష్టపడినా ఫలితం ఉండడం లేదని తెగ బాధపడుతూ ఉంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం లేక, తమ శ్రమ వృధా అవుతుందని దిగులు పడుతూ ఉంటారు. ఎంత కష్టపడినా మెరుగైన ఫలితం రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. తాము విక్రయించే వస్తువులు నాణ్యమైనవైనా, ఆశించిన మేర విక్రయాలు జరగక బిజినెస్ సరిగా నడవడం లేదని తీవ్ర మనస్థాపానికి గురవుతూ ఉంటారు. అయితే శక్తి వంచన లేకుండా ఎంత కష్టపడుతున్నా, సరైన ఫలితం రావడం లేదంటే అందుకు వాస్తు దోషాలు కారణమై ఉండొచ్చని చెబుతున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. ఇక వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్న ప్రకారం ఎటువంటి వాస్తు దోషాలు వ్యాపారంలో ఆశించిన మేర ఫలితాలు రాకుండా అడ్డుకుంటున్నాయో తెలుసుకుందాం.

 వ్యాపారంలో వాస్తు నియమాలు పాటించటం అవసరం

వ్యాపారంలో వాస్తు నియమాలు పాటించటం అవసరం

ఎవరైనా దుకాణాన్ని నిర్వహించేటప్పుడు ఆ దుకాణం కూడా శుభ సంకేతాలను కలిగి ఉండాలి. దుకాణంలో వస్తువులు వాస్తు నియమాలను అనుసరించి పెట్టడం, దుకాణం యజమాని ఏ దిశ వైపు కూర్చోవాలి అనేది తెలిసి ఉండటం, దుకాణానికి వచ్చే వారికి మెయిన్ ఎంట్రన్స్ ఏ దిక్కున ఉండాలి అనేది నిర్ణయించడం చాలా కీలకమని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దుకాణాన్ని నిర్మించుకునేటప్పుడు దుకాణానికి తూర్పున ప్రధాన ద్వారం ఉండేలా చూసుకోవాలి. ఇక నిర్మాణానికి ముందు నేలను పడమర నుండి తూర్పుకు దక్షిణం నుండి ఉత్తరానికి వాలుగా చేసుకోవాలి.

దక్షిణాభిముఖంగా యజమాని కూర్చుంటే లాభం

దక్షిణాభిముఖంగా యజమాని కూర్చుంటే లాభం


ఇక షాపులో యజమాని కూర్చునే దిశ పైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. తూర్పు దక్షిణ భాగంలో తూర్పు గోడ సరిహద్దు తాకకుండా, దక్షిణ గోడ అభి ముఖంగా కూర్చోవాలి. ఇక దుకాణంలోని క్యాష్ బాక్స్ యజమాని కూర్చున్న టేబుల్ కు ఎప్పుడూ కుడి వైపున ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉత్తరం మరియు తూర్పు మరియు పడమర దిశ లో కూర్చోకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దక్షిణాభిముఖంగా కూర్చుంటేనే వ్యాపారంలో బాగా కలిసి వస్తుందని చెబుతున్నారు.

షాప్ ప్రధాన ద్వారం, ఆల్మరాలపైనా ప్రత్యెక దృష్టి అవసరం

షాప్ ప్రధాన ద్వారం, ఆల్మరాలపైనా ప్రత్యెక దృష్టి అవసరం


అంతేకాదు వ్యాపారంలో పురోగతిని సాధించడానికి ప్రధాన ద్వారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని, ప్రధాన ద్వారం ఎప్పుడూ తూర్పు అభిముఖంగా ఉండాలని అది కూడా ఎప్పుడూ మధ్యలో ఉండాలని చెబుతున్నారు. షాప్ డోర్ ఎప్పుడూ కార్నర్లో ఉండకూడదని చెబుతున్నారు. ఇక షాప్ లో ఏర్పాటు చేసుకునే అల్మరాల దిశ పైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాలని, అల్మారాలు ఎప్పుడూ వాయువ్య దిశలో ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఇక వ్యాపార స్థలంలో దేవుడికి ప్రత్యేకమైన స్థానం ఉంటుందని చెబుతున్న వాస్తుశాస్త్ర నిపుణులు, పూజగది ఎల్లప్పుడూ ఈశాన్య దిశలో ఉండేలా చూసుకోవాలి అని చెబుతున్నారు.

షాప్ కి వేసే రంగులతోనూ ప్రభావం

షాప్ కి వేసే రంగులతోనూ ప్రభావం


ఇక వ్యాపారం బాగా సాగాలంటే షాప్ కి వేసే రంగులు కూడా కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు నిపుణులు. షాప్ లేదా ఆఫీసులో లేత రంగులు వేసుకోవాలని, దీనివల్ల వ్యాపారంలో సానుకూలత ఉంటుందని చెబుతున్నారు. వ్యాపారం చేసే వ్యక్తి మనసు ప్రశాంతంగా ఉంటే అతను ఎక్కువ పనిలో నిమగ్నం అవడానికి అవకాశం ఉంటుందని, అందుకే వ్యాపారంలో షాప్ లో వేసిన రంగులు కూడా ప్రభావాన్ని చూపిస్తాయి అని చెబుతున్నారు. చిన్నచిన్న వాస్తు శాస్త్ర నియమాలు పాటించి వ్యాపారంలో లాభాలు ఆర్జించాలని, పురోగతిని సాధించి ముందుకు సాగాలని వాస్తు శాస్త్ర నిపుణులు సలహా ఇస్తున్నారు.

Disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
No matter how hard you work, the business is not profitable? But Vastu Shastra experts say that if you try these simple Vastu tips, you will get better results.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X