vastu tips: రాత్రి పడుకునే ముందు ఈ చిట్కాలు పాటించండి.. ఐశ్వర్యవంతులు అవ్వటం ఖాయం!!
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో ఉంచిన ప్రతిదీ మన జీవితాలపై సానుకూల ప్రభావాన్ని కానీ, ప్రతికూల ప్రభావాన్ని గానీ చూపుతుంది. మీరు లక్షల ప్రయత్నాలు చేసినా జీవితంలో విజయం సాధించలేకపోతే, మీరు వాస్తు శాస్త్రానికి సంబంధించిన కొన్ని ప్రత్యేక చిట్కాలను పాటించవచ్చు. ఈ వాస్తు నివారణలన్నీ మీ ఇంట్లోనే ఉన్నాయి. వాస్తు ప్రకారం, నిద్రపోయే ముందు కొన్ని పనులు చేయడంవల్ల ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు వస్తుంది. అంతేకాదు కనక వర్షం కురుస్తుంది. డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది.

ఎంత కష్టపడినా ఫలితం లేని వారికి వాస్తు శాస్త్రంలో సూచించబడిన చిట్కాలు
ప్రతి మనిషి జీవితంలో తన జీవితం హాయిగా సాగిపోవాలనే కోరిక ఉంటుంది. ఇందుకోసం చాలా కష్టపడుతూ ఉంటారు. అయితే చాలా మందికి కష్టపడి పనిచేసినా మంచి ఫలితాలు రావడం లేదని బాధ పడతారు. అటువంటి పరిస్థితిలో, వారు తరచుగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి వారికోసం వాస్తు శాస్త్రంలో కొన్ని నివారణలు చెప్పబడ్డాయి.

రాత్రి పడుకునే ముందు చేయవలసింది ఇదే
ప్రతి వ్యక్తి చాలా జాగ్రత్తగా అందమైన ఇంటిని నిర్మించుకుంటారు. దానిని కూడా చక్కగా అలంకరిస్తారు. అయితే, ఈ సమయంలో వారు వాస్తు గురించి చాలాసార్లు శ్రద్ధ వహించరు. దాని కారణంగా ఇంట్లో సమస్యలు మొదలవుతాయి. అటువంటి పరిస్థితిలో, రాత్రి పడుకునే ముందు ఇంట్లో కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యలను పూర్తిగా తొలగించవచ్చు. వాస్తు దోషాలున్నా తొలగిపోతాయి. రాత్రి పడుకునే ముందు బకెట్‌లో నీళ్లు నింపి వంటగదిలో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల వ్యక్తికి అప్పుల నుండి విముక్తి లభిస్తుంది. డబ్బు సమస్య కూడా దూరమవుతుంది. దీంతో పాటు ఇంటి ఆర్థిక పరిస్థితి కూడా బలపడుతుంది.

లక్ష్మీదేవి ప్రసన్నం కావాలంటే రాత్రి పడుకునే ముందు ఈ పని చేయండి
వాస్తు శాస్త్రం ప్రకారం, బాత్రూంలో ఉంచిన బకెట్ ఎప్పుడూ సగం నీళ్లతో ఉండకూడదు. బకెట్ ఖాళీగా ఉంటే బోర్లించి ఉండాలి లేదా బక్కెట్ నిండా నీళ్లు ఉండాలి. బాత్‌రూమ్‌లో నిండుగ నీళ్ళ బకెట్ ఉంటే లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో, రాత్రి పడుకునే ముందు, బాత్రూంలో నీటితో నిండిన బకెట్ ఉంచండి.

లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఈ పని చేయండి
ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే, ఇంటి ప్రధాన ద్వారం వద్ద ప్రతిరోజూ సాయంత్రం దీపం వెలిగించాలి. దీనితో పాటు మెయిన్ డోర్ పై కూడా లైట్ వెలిగించాలి. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి ప్రసన్నం అవుతుంది. ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండడానికి ఇష్ట పడుతుంది. ఈ వాస్తుకు సంబంధించిన చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగి డబ్బు రావడంతో పాటు, ఇంట్లో ఆనందం, శ్రేయస్సు వెల్లివిరుస్తుంది.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
100 శాతం వాస్తు ప్రకారమే ఇల్లు కట్టుకున్నా కలిసిరాకపోతే అందుకు ఒకటే కారణం -
మేషరాశి, ధనుస్సురాశి, సింహరాశుల వారికి నేటినుండి పట్టిందల్లా బంగారం.. శని మహిమ! -
today rashiphalalu: శని, బుధుల సంచారంలో మార్పుతో వీరు నేడు నక్కతోక తొక్కుతారు! -
ధనుస్సు రాశి వార్షిక ఫలం.. వీరికి గృహయోగం.. కానీ ఈ విషయాల్లో జాగ్రత్త! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
రేపటి నుండి బుధుడి ప్రత్యక్ష సంచారంతో కుంభరాశితో సహా వీరు శ్రీమంతులు అవుతారు -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!!












Click it and Unblock the Notifications