వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Vastu tips: అదృష్టంతో పాటు సంపద కోసం ఈ వాస్తు నియమాలు పాటించండి!!

|
Google Oneindia TeluguNews

వాస్తు నియమాల ప్రకారం ఇంటిని నిర్మించుకోవడం ఎంత అవసరమో, అదేవిధంగా ఇంట్లో వాస్తు నియమాలను పాటించడం కూడా అంతే అవసరం. వాస్తు శాస్త్రం సూచించిన కొన్ని నియమాలను పాటించడం వల్ల జీవితంలో అన్ని సమస్యలు తొలగిపోతాయి. వాస్తు నియమాలు పాటిస్తే సంతోషంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు అదృష్టాన్ని కూడా కలిగిస్తుంది. అందుకే ఇంట్లో మనం పాటించాల్సిన వాస్తు నియమాలు ఏంటి? ఒకవేళ మన ఇంట్లో మనకు తెలియకుండా ఏమైనా వాస్తు దోషాలు ఉంటే వాటికి చక్కని పరిష్కారం ఏమిటి? అదృష్టం కోసం మన ఇంట్లో చేయాల్సిన పనులు ఏమిటి? వంటి విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఇల్లు ఇలా ఉండేలా చూసుకోండి

ఇల్లు ఇలా ఉండేలా చూసుకోండి


ఇల్లు పరిశుభ్రంగా ఉండకపోతే ఖచ్చితంగా ఇంట్లో ఉన్నవారికి అనారోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాదు ఆర్థిక ఇబ్బందులు కూడా కలుగుతాయి. ఇల్లు సమస్యల వలయంగా మారుతుంది. అందుకే ఇంట్లో ఎప్పుడూ బూజు లేకుండా, శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఇంట్లో సాలెపురుగులు గూళ్లు కట్టకుండా చూసుకోవాలి. ఇక ఇంటి ప్రధానమైన తలుపులను కానీ కిటికీలను కానీ తెరిచినప్పుడు చాలా ఇళ్ళల్లో క్రిక్ మని శబ్దం వస్తుంది. అలా శబ్దం రావడం కూడా మనకు ఆర్థికంగా నష్టం చేస్తుందని చెబుతున్నారు. కాబట్టి డోర్ల నుండి ఎటువంటి శబ్దాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

తూర్పు, ఉత్తరం దిక్కులలో ఈ పనులు చెయ్యకండి

తూర్పు, ఉత్తరం దిక్కులలో ఈ పనులు చెయ్యకండి


పొరపాటున కూడా తూర్పువైపున, ఉత్తరం వైపున చెత్తాచెదారం పడవెయ్యకూడదు. తూర్పువైపున, ఉత్తరం వైపున ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత మంచి జరుగుతుంది. ఆర్థికంగా కూడా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్కుకు సూర్యుడు అధిపతి కాగా, ఉత్తర దిక్కుకు కుబేరుడు అధిపతిగా చెబుతారు. మన జీవితం సంతోషంగా ఉండాలంటే ఇద్దరి దయ కచ్చితంగా ఉండాలి. కాబట్టి తూర్పు వైపున, ఉత్తరం వైపున పొరపాటున కూడా ఎటువంటి తప్పులు చేయకూడదు. చెత్తాచెదారం వేసి తప్పు చేస్తే అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు తప్పకుండా కలుగుతాయి.

మొక్కల విషయంలో ఈ జాగ్రత్తలు పాటించండి

మొక్కల విషయంలో ఈ జాగ్రత్తలు పాటించండి


ఇంట్లో ఎప్పుడూ పెంచుకునే మొక్కలు ఎండిపోయి ఉండకూడదు. ఎండిపోయి చచ్చిపోయిన మొక్కలను వెంటనే కుండీల నుంచి తొలగించాలి. అలా ఎండిపోయి చచ్చిపోయిన మొక్కలను ఉంచుకుంటే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి అలాంటి మొక్కలను వెంటనే తీసేయడం మంచిదని చెప్పబడింది. ఒకవేళ అలా కాకుంటే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు వచ్చే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు. కాబట్టి ఇంట్లో ఉన్న కుండీలలో కానీ, గార్డెన్లో కానీ ఎండిపోయిన మొక్కలను వెంటనే తొలగించాలి.

ఈశాన్యంలో ఈ పనులు చెయ్యకండి.. అదృష్టం కోసం వాస్తు టిప్స్ పాటించండి

ఈశాన్యంలో ఈ పనులు చెయ్యకండి.. అదృష్టం కోసం వాస్తు టిప్స్ పాటించండి

ఇక అదృష్టం కలిసి రావాలంటే మనం ఈశాన్య భాగంలో బరువులు పెట్టకూడదు. ఈశాన్యంలో బరువు పెడితే మన జీవితమే భారంగా మారుతుంది. కాబట్టి ఈశాన్యంలో బరువు పెట్టకుండా, కేవలం నీళ్లకు మాత్రమే ఈశాన్య భాగాన్ని కేటాయించి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈశాన్యంలో చెట్లు పెట్టడం వంటి పనులు చేస్తే తీవ్రమైన నష్టం జరుగుతుంది. కాబట్టి ఈశాన్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకొని వాస్తు నియమాలు పాటించాల్సిన అవసరం ఉంది. వాస్తు విషయంలో తీసుకునే చిన్నచిన్న జాగ్రత్తలు మన జీవితానికి అదృష్టాన్ని తీసుకొస్తాయని, చిన్న నిర్లక్ష్యమే మన జీవితాన్ని దురదృష్టం వైపు నడిపిస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్పిన అనేక అంశాలను గుర్తుపెట్టుకొని తదనుగుణంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
For good luck and wealth to follow Vastu rules such as keeping the house free of webs, keeping east and north directions clean, removing dry plants, and not placing weights in the north-east.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X