వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

vastu tips: ఇంటి శుభ్రతకు వాస్తు.. ఈ చిట్కాలు పాటిస్తే మీ ఇంట్లోనే మహాలక్ష్మి నివాసం!!

|
Google Oneindia TeluguNews

వాస్తు శాస్త్రంలో రోజువారీ జీవితంలో శుభ్రతకు పెద్దపీట వేయబడింది. వాస్తు శాస్త్రంలో శుభ్రత కు సంబంధించి అనేక విషయాలు ప్రస్తావించబడ్డాయి. ఇల్లు శుభ్రంగా లేకుంటే దరిద్ర లక్ష్మి తాండవిస్తుంది అని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా, అలాగే వాస్తు శాస్త్రంలో సూచించిన అనేక అంశాలను అనుసరించడం ద్వారా జీవితంలోని అన్ని సమస్యలను పరిష్కరించుకోవచ్చని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ఇంటి శుభ్రతకు వాస్తు చిట్కాలు

ఇంటి శుభ్రతకు వాస్తు చిట్కాలు

హిందూ ధర్మం ప్రకారం పరిశుభ్రత ఉన్న ఇంట్లో మహాలక్ష్మి ఉంటుందని మొదటి నుండి పెద్దలు చెబుతుంటారు. శుభ్రంగా ఉన్న ఇంట్లో మహాలక్ష్మి అనుగ్రహం నిలిచి ఉంటుందని చెబుతారు. ఉదయాన్నే ఇంటిని శుభ్రపరచుకోవడానికి కొన్ని ప్రత్యేక వాస్తు చిట్కాలు (వాస్తు చిట్కాలు) చెప్పబడడానికి కారణం ఇదేనని చెప్తున్నారు. ఇల్లు శుభ్రం చేసుకోవడానికి కూడ వాస్తు శాస్త్ర నియమాలు చెప్పబడ్డాయి. ఇక వీటిని ప్రతి ఒక్కరు పాటిస్తే ఇంట్లో మహాలక్ష్మి తాండవిస్తుంది.

ఇల్లు ఊడ్వాలంటే సమయ పాలన అవసరం .. రాత్రి వేళల్లో ఊడిస్తే ఆర్దిక ఇబ్బందులు

ఇల్లు ఊడ్వాలంటే సమయ పాలన అవసరం .. రాత్రి వేళల్లో ఊడిస్తే ఆర్దిక ఇబ్బందులు


మహిళలు ముఖ్యంగా సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయానికి తరువాత చీపురుతో ఊడ్వకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. అలా ఎప్పుడు పడితే అప్పుడు ఊడిస్తే అది సంపదపై ప్రభావం చూపుతుందని చెబుతారు. ఇల్లు శుభ్రంగా ఉండడం వల్ల మన మనస్సు, శరీరం, ఆరోగ్యంతో పాటు మన పురోగతి మరియు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక రాత్రిపూట పొరపాటున కూడా చీపురు తో ఊడ్వకూడదని చెబుతున్నారు. అలా చేస్తే ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచండి

మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచండి

ఇంట్లోని టాయిలెట్ లను కూడా ప్రత్యేకంగా శుభ్రంగా ఉంచుకోవాలి. బాత్రూంలను అశుభ్రంగా ఉంచడం వల్ల అనారోగ్యం కలుగుతుంది. ఒక బాత్రూమ్ లను ఎప్పుడూ బూజు పట్టకుండా చూసుకోండి. బాత్రూమ్-టాయిలెట్ కారణంగా ఏదైనా వాస్తు దోషం ఉంటే, అప్పుడు ఉప్పు నింపిన గిన్నెను ఒక మూలలో ఉంచితే దోషాలు తొలగిపోతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. అంతే కాకుండా బాత్‌రూమ్‌లో చెత్త పేరుకుపోకుండా చూడాలని చెబుతున్నారు.

ఇంటి మూలలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి

ఇంటి మూలలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి

మీ ఇంటి నాలుగు మూలలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి. ముఖ్యంగా ఉత్తరం, ఉత్తరం మరియు పడమర కోణాలను ఎల్లప్పుడూ ఖాళీగా మరియు శుభ్రంగా ఉంచండి. సాయంత్రం పూట ఇంట్లోని చెత్తను ఎప్పుడు బయట పడెయ్యకూడదని చెబుతున్నారు. ఇలా చేస్తే ఆ చెత్తతో ఇంటి లక్ష్మి కూడా వెళ్లిపోతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

బాల్కనీ, పై కప్పులపై చెత్తా చెదారం ఉంచరాదు

బాల్కనీ, పై కప్పులపై చెత్తా చెదారం ఉంచరాదు


వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటి బాల్కనీ, లేదా పైకప్పు పైన ఉపయోగించని వస్తువులను, విరిగిపోయిన వస్తువులను, చెత్తాచెదారాన్ని జమ చేయ కూడదని చెప్తున్నారు. ఇలా చేస్తే ఇంట్లో డబ్బు కొరతను ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు వెల్లడిస్తున్నారు. కాబట్టి ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం, ఇల్లు డ్చుకునేటప్పుడు సమయపాలన పాటించడం, సాయంత్రం సమయాల్లో ఇంట్లో నుండి చెత్తను బయట పారేయకుండా ఉండటం మంచిదని చెబుతున్నారు. విరిగిపోయిన, పాడైపోయిన వస్తువులను ఇంటి పై కప్పు పై జమ చేయడం వంటి పనులు చేయకుండా ఉండాలని చెబుతున్నారు. ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే, ఇంట్లో లక్ష్మి కలకాలం ఉంటుందని, ఇంట్లో ఉన్న వారందరూ ఆరోగ్యంతోపాటు, ఆనందంగా జీవిస్తారని వాస్తు శాస్త్రం చెబుతుంది.

English summary
Architectural rules must be followed for the cleanliness of the house. Mahalakshmi's abode will be in your house if you follow the architectural tips in keeping the house clean. Your house will be weighed down with money.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X