vastu tips: భార్యాభర్తలు ఒకే ప్లేటులో భోజనం చేస్తున్నారా? అయితే కుటుంబంలో కలహాలు; కారణమిదే!!
మన జీవన శైలిపై కూడా వాస్తు ప్రభావం ఉంటుంది. గృహ నిర్మాణం, ఇంట్లో పెట్టుకునే వస్తువులతో పాటుగా, మనం చేసే పనులు, మనం పడుకునే విధానం, మనం భోజనం చేసే పద్ధతి అనేక అంశాలు వాస్తు ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఇప్పటికే భోజనం చేసే సమయంలో శబ్దం చేయకూడదని, చేతి వేళ్ళు నాకకూడదని, భోజనాన్ని ప్లేట్ లో వదిలేసి పడెయ్యకూడదని, భోజనం చేస్తున్న వారి ప్లేటు లాగకూడదని ఇలా అనేక అంశాలు తెలుసుకున్నాం. ఇప్పుడు ఒకే ప్లేట్ లో భార్య భర్తలు భోజనం చేయొచ్చా? చేయకూడదా అనే అంశం గురించి వాస్తు శాస్త్రం ఏం చెప్తుందో తెలుసుకుందాం.

భార్యాభర్తలు ఒకే ప్లేటులో భోజనం చెయ్యటం వారి మధ్య ప్రేమకు ప్రతీక
ఇప్పుడు ఉమ్మడి కుటుంబాల స్థానంలో చిన్న కుటుంబాలు వచ్చాయి. అటువంటి పరిస్థితిలో, కుటుంబంలో జీవన విధానంలో చాలా పెద్ద మార్పులు కూడా వచ్చాయి. వీటిలో ఆహారానికి సంబంధించిన మార్పులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం చాలా కుటుంబాల్లో భార్యాభర్తలు ఒకే ప్లేటులో భోజనం చేస్తున్నారు. ఒకే ప్లేట్ లో భార్య భర్తలు భోజనం చేయడం వారి మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా భావించవచ్చు. భార్యాభర్తల మధ్య అనుబంధం దృష్ట్యా, ఇది సరైనదని అనిపించవచ్చు. ఎందుకంటే అలా చేయడం వారి మధ్య ప్రేమను పెంచుతుంది.

ఒకే ప్లేటులో భోజనం మంచిది కాదంటున్న వాస్తు శాస్త్రం .. ఎందుకంటే
కానీ వాస్తు శాస్త్రంలో ఇది సరైనది కాదు అని సూచించబడింది. ఇది కాకుండా, మహాభారతంలోనూ ఒకే కంచంలో భోజనం చేయకూడదు అన్న విషయంపై భీష్మ పితామహుడు అనేక ముఖ్యమైన అంశాలను బోధించాడు. భార్య భర్తలు ఒకే కంచంలో భోజనం చేయడం వల్ల వారిద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది అనేది నిర్వివాదాంశం. అయితే ఇలా భోజనం చేయడం వల్ల కుటుంబంలోని ఇతర సభ్యుల కంటే భార్యపై భర్తకు, భర్తపై భార్య కు ప్రేమ పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో కుటుంబం లోని అందరి సభ్యులతో భార్యాభర్తలు ఒకే విధంగా ఉండటానికి వీలు కాదు.

ఒకే ప్లేటులో భోజనం చేస్తే ఇంట్లో గొడవలు... కారణమిదే
భార్య భర్తలు ఒకరిపై ఒకరు విపరీతమైన ప్రేమ పెంచుకోవడం వల్ల మిగిలిన కుటుంబ సభ్యులను విస్మరిస్తారు. దీంతో ఇంట్లో గొడవలు జరుగుతాయి. ఈ విధంగా చిన్న పొరపాటు కాస్త కుటుంబం మొత్తం ఆనందాన్ని దూరం చేస్తుంది. ఇది ఇంటిని సైతం నాశనం చేస్తుందని భీష్మ పితామహుడు మహాభారతం లో చెప్పాడు.
భార్య పట్ల భర్తకు ప్రేమ ఉంటే అది భర్త యొక్క మనస్సును పాడుచేస్తుంది. అతని ఆలోచన జ్ఞానాన్ని తగ్గిస్తుంది. మంచి చెడుల మధ్య వ్యత్యాసం కోల్పోయి భార్య ఏది చేసినా అతనికి కరెక్ట్ గా కనిపిస్తుంది. ఇక భార్య విషయంలోనూ ఇదే జరుగుతుంది.

కుటుంబంతో కలిసి భోజనం .. ఆనందం, శ్రేయస్సు
అందుకే ఒకే ప్లేట్ లో భోజనం చేయడం మంచిది కాదని పెద్దలు చెప్పడంతో పాటు, వాస్తు శాస్త్రం కూడా చెబుతోంది. కుటుంబమంతా కలిసి కూర్చుని భోజనం చేయడం వల్ల, కుటుంబంలో ఐక్యతను, ప్రేమను ఇది పెంపొందిస్తుందని, కుటుంబ సభ్యులందరి మధ్య సంబంధాలను మెరుగు పరుస్తుందని చెబుతారు. కుటుంబ సభ్యులు అందరూ కలిసి కూర్చుని భోజనం చేయడం వల్ల కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు కలుగుతుంది. అలా కాకుండా భార్య భర్తలు మాత్రమే కలిసి భోజనం చేయడం, ఒకే ప్లేట్ లో ఇద్దరు తినడం వల్ల కుటుంబంలోని మిగతా వారితో సఖ్యత లోపించి గొడవలకు కారణం అవుతుంది. కాబట్టి భార్య మీద భర్తకు, భర్త మీద భార్యకు ఎంత ప్రేమ ఉన్నా భోజనం విషయంలో ఒకే ప్లేట్లో తినకుండా, కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడం మంచిదని సూచించబడింది.
Disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
today rashiphalalu: నేడు ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టి సంపన్నులయ్యే రాశులవారు వీరే! -
మేషరాశి, ధనుస్సురాశి, సింహరాశుల వారికి నేటినుండి పట్టిందల్లా బంగారం.. శని మహిమ! -
today rashiphalalu: శని, బుధుల సంచారంలో మార్పుతో వీరు నేడు నక్కతోక తొక్కుతారు! -
వాస్తు ప్రకారం డబ్బు నిల్వ ఉండాలంటే ఇలా చేయాలి -
ధనుస్సు రాశి వార్షిక ఫలం.. వీరికి గృహయోగం.. కానీ ఈ విషయాల్లో జాగ్రత్త! -
రేపటి నుండి బుధుడి ప్రత్యక్ష సంచారంతో కుంభరాశితో సహా వీరు శ్రీమంతులు అవుతారు -
100 శాతం వాస్తు ప్రకారమే ఇల్లు కట్టుకున్నా కలిసిరాకపోతే అందుకు ఒకటే కారణం -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ??












Click it and Unblock the Notifications