vastu tips: ఉత్తర దిశలో ఈ వస్తువులు పెడితే డబ్బే డబ్బు.. జీవితంలో అద్భుతాలే!!
చాలామంది డబ్బులు సంపాదించి ఆ డబ్బులు నిలవడం లేదని, అనుకోని ఖర్చులు వచ్చి పడుతున్నాయని బాధపడుతూ ఉంటారు. అంతేకాదు ఎంత కష్టపడినా లక్ష్మీదేవి కటాక్షం దొరకడం లేదని తెగ దిగులు పడుతూ ఉంటారు. అటువంటి వారు ఉత్తరం వైపు వాస్తు దోషాలు లేకుండా చూసుకుంటే తగిన ఫలితాలు ఉంటాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే చాలామంది ఇంటిని వాస్తు ప్రకారం కట్టుకున్నప్పటికీ, ఇంట్లో పెట్టుకున్న వస్తువులకు వాస్తు నియమాలను పాటించరు. అలా వాస్తు నియమాలను వస్తువుల విషయంలో పాటించకపోవడం వల్లే ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ఉత్తరం దిశలో ఇవి పెడితే లైఫ్ అద్భుతం
ఉత్తరం కుబేర స్థానం. కుబేర స్థానంలో డబ్బులకు కొదవుండదు. అటువంటి ఉత్తరదిశలో డబ్బులను, నగలను, ఆస్తికి సంబంధించిన ముఖ్యమైన పత్రాలను పెడితే ఆ పాజిటివ్ ఎనర్జీ మన జీవితం పై ప్రభావవంతంగా పనిచేస్తుందని, ఉత్తరం వైపు ధనం పెట్టినవారికి తిరిగే ఉండదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఉత్తరదిశలో డబ్బులు పెడితే ఆపై జీవితం అద్భుతంగా ఉంటుందని సూచిస్తున్నారు. కరెక్ట్ గా ఉత్తరదిశలో ఎనర్జీ వున్న ప్రదేశాన్ని గుర్తించి అక్కడ డబ్బులు పెడితే అవి రెట్టింపు అవుతాయని, ధనం వృధా ఖర్చు కాదని, సంపన్నులు అవుతారని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు ఫెయిల్ అవుతున్నాయా? ఇది కారణం కావచ్చు
ఇక ఉత్తరం వైపు వాస్తు దోషం ఉన్నవారు ఏదైనా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసినా అవి సఫలీకృతం కావని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. పదేపదే ప్రయత్నం చేస్తున్నా, అన్ని అర్హతలూ ఉన్న ఉత్తరం వైపు వాస్తు దోషం ఉంటే వచ్చే ఉద్యోగం కాస్త వెనక్కి పోతుందని వాస్తు శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఉద్యోగ అన్వేషణ చేసే వారు ఒకసారి ఉత్తరం దిక్కు లో వాస్తు దోషాలు లేకుండా సరి చూసుకోవాలని సూచిస్తున్నారు.

కుబేర స్థానంలో ఆ పనులు చేస్తున్నారా ? అయితే దరిద్రమే
కొంతమంది ఉత్తరం వైపు టాయిలెట్స్ నిర్మించి వాటిని వినియోగిస్తూ ఉంటారు. కుబేర స్థానమైన ఉత్తరం దిక్కు వైపు టాయిలెట్స్ నిర్మించడం ఎంత మాత్రం మంచిది కాదని చెబుతున్నారు. ఉత్తరం దిక్కు వైపు ఉన్న టాయిలెట్స్ లో మల,మూత్ర విసర్జన చేస్తే ప్రతికూల ఫలితాలు ఉంటాయని, అది ఏ మాత్రం శ్రేయస్కరం కాదని నిపుణులు చెబుతున్నారు. ఉత్తరం దిక్కు వైపు స్నానం చేయడం చేయవచ్చు కానీ, కుబేర స్థానం వైపు మల మూత్ర విసర్జన చేయడం దరిద్రానికి హేతువు అని హెచ్చరిస్తున్నారు.

ఉత్తరంలో ఈ వస్తువులు పెట్టినా ప్రతికూల ఫలితాలు
ఉత్తర దిక్కుకు జలతత్వం ఉంటుంది. పంచభూతాలతో ఈ సృష్టి ఏవిధంగా అయితే నిర్మితమైనదో, అదేవిధంగా ఇల్లు కూడా పంచభూతాలతో నిర్మితమై ఉంటుందని, జలతత్వ ఉత్తరదిక్కున, ఎవరైనా అగ్ని తత్వానికి సంబంధించిన వస్తువులను పెడితే అది కూడా ప్రతికూల ఫలితాలను ఇస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు పొయ్యి, ఇస్త్రీ పెట్టె తదితర అగ్ని తత్వం ఉన్న వస్తువులను ఉత్తరం వైపు పెట్టకూడదని సూచిస్తున్నారు. అలా చేస్తే కూడా ప్రతికూల ఫలితాలు ఉంటాయని, ఎట్టి పరిస్థితులలోనూ సంపాదించిన ధనం నిలవదని చెబుతున్నారు. దిక్కుల ప్రాధాన్యతను గుర్తించి, పెట్టే వస్తువులను కూడా తదనుగుణంగా పెడితే జీవితంలో ప్రతికూలతలు తగ్గి, అనుకూల ఫలితాలు మెరుగుపడతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications