vastu tips: సూర్యాస్తమయం తర్వాత ఈ పనులు చేస్తే లక్షీదేవి కటాక్షంతో ఐశ్వర్యం!!
జీవితంలో ప్రతి ఒక్కరు సంపద, శ్రేయస్సు రెండు కావాలని కోరుకుంటారు. వాటిని సాధించడం కోసం చాలా కష్టపడతారు కూడా.. అయితే ఎంత కష్టపడినా ఫలితం రానివారు, తీవ్ర మానసిక వేదనకు గురవుతున్న వారు, అటువంటి సమస్యల నుంచి బయట పడాలంటే సాయం సంధ్యలో కొన్ని చేయవలసిన పనులను సూచిస్తున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. సూర్యాస్తమయంలో మీ ఇంట్లో కొన్ని పనులు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని వాస్తు శాస్త్రం, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.ఇక అవేమిటో ఒకసారి తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రంలో సూర్యోదయానికి ఎంత ప్రాధాన్యత అయితే ఉంటుందో, సూర్యాస్తమయానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. సూర్యాస్తమయం సమయంలో కూడా పూజలు చేసే వారికి వారి జీవితంలోనే అనేక సమస్యల నుండి, కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. ఇక లక్ష్మీదేవి ఆశీర్వాదం కావాలి అనుకునేవారు తప్పనిసరిగా సూర్యాస్తమయం సమయంలో కొన్ని పనులను చేయాలని సూచించబడింది. సూర్యాస్తమయం సమయంలో అస్తమించే సూర్యుడిని పూజిస్తే, సూర్య భగవానుడికి నమస్కరిస్తే కుటుంబంలో సానుకూల దృక్పథం ఏర్పడుతుందని చెప్పబడింది. కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడిన మనస్పర్ధలు తొలగిపోతాయని చెప్పబడింది.

ఇక సూర్యాస్తమయం సమయంలో పూజ గదిలో దేవుడికి పూజలు చేసి, తులసి మొక్కకు దీపారాధన చేసి పూజించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నరాలవుతుందని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పబడింది. వాస్తు శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో ఉన్న గదులలో ఏ మూలన చీకటి ఉండకుండా చూసుకోవాలని, ప్రతి చోట దీపాన్ని వెలిగించాలని సూచించబడింది. ఇక సూర్యాస్తమయం సమయంలో వ్యక్తి ఇంట్లో మంచంపై పడుకోకూడదని, నిద్రపోకూడదని కూడా వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. ఇలాంటి పనులు చేస్తే లక్ష్మీదేవికి కోపం వచ్చి ఆ ఇంట్లో నివాసం ఉండకుండా వెళ్ళిపోతుందని చెబుతారు.
అంతేకాదు సూర్యాస్తమయం సమయంలో పూర్వీకులను స్మరించుకోవడం వల్ల, వారికి మనస్ఫూర్తిగా నమస్కరించడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు లభించి, వారి జీవితంలో సమస్యలు దూరం అవుతాయని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల దేవతలు కూడా సంతోషపడతారని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, లక్ష్మీదేవి కటాక్షంతో సంతోషంగా ఉంటారని అంటున్నారు. సూర్యాస్తమయం వేళ ఇల్లంతా దీపకాంతులతో ఉంచుకుని, నిష్టగా పూజ చేయాలని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications