ముఖ్యమైన వాస్తు చిట్కా: బీరువాలో డబ్బుకు ఎదురుగా అద్దం పెట్టండి
మన హిందూ పురాణాల ప్రకారం ఉత్తర దిశకు అధిపతి కుబేరుడు. ఈశాన్యానికి అధిపతి ఈశ్వరుడు. అందుకే ఇంటి ఈశాన్య మూల ఎప్పుడూ ఖాళీగా, వెలుతురుతో ఉండాలి. ఈ మూలలో బరువైన సామాన్లు, చెత్తాచెదారం లేదా చెప్పుల స్టాండ్‌లు ఉంటే అది లక్ష్మీదేవి రాకను అడ్డుకుంటుంది. దీనికి అదనంగా, ఈశాన్య మూలలో ఒక గిన్నెలో నీరు పోసి అందులో తాజా పూలు ఉంచడం వల్ల సానుకూల శక్తి ఇంట్లో నిరంతరం ప్రవహిస్తుంటుంది. డబ్బు నిలవ ఉండటానికి ముఖ్యమైన చిట్కాలను ఒకసారి పరిశీలిద్దాం.
నగలు, డబ్బు దాచుకునే బీరువా ఇంటి నైరుతి మూలలో ఉండాలి.
దాని తలుపులు ఉత్తరం లేదా ఈశాన్యం వైపుకు తెరుచుకునేలా చూడాలి.
మీ నగదు పెట్టె లేదా బీరువా లోపల ఉత్తర గోడకు ఒక చిన్న అద్దం తగిలించండి.
బీరువా తెరిచినప్పుడు అందులోని డబ్బు ఆ అద్దంలో ప్రతిబింబిస్తే,
అది ధనం రెట్టింపు అవ్వడానికి సంకేతంగా వాస్తు నిపుణులు చెబుతున్నారు.

ప్రధాన ద్వారం ద్వారానే ఇంట్లోకి సంపద ప్రవేశిస్తుంది.
తలుపులకు పగుళ్లు ఉండకూడదు
తీసేటప్పుడు కిర్రుమనే శబ్దాలు రాకూడదు.
ప్రవేశ ద్వారం వద్ద మంస్వస్తిక్ లేదా ఓం గుర్తులను ఉంచాలి.
దీనివల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా ఉంటాయి.
ప్రవేశ ద్వారం లోపలికి రాగానే ఎదురుగా ఉండే గోడ ఖాళీగా ఉండకూడదు.
అక్కడ ఒక అందమైన ప్రకృతి దృశ్యం లేదా దేవుడి పటం ఉంచడం వల్ల
ఆ ఇంటికి వచ్చే వారికి ప్రశాంతత కలుగుతుంది.
వంటగది లేదా బాత్రూమ్ ట్యాప్‌ల నుండి నీరు బొట్టు బొట్టుగా కారుతుంటే
అది ఆర్థికంగా డబ్బు వృథా అయిపోతోందనడానికి సంకేతం.
వాస్తు ప్రకారం నీరు లీక్ అవ్వడం అంటే సంపాదన కరిగిపోవడమే.
ఇంటి మధ్య భాగంలో ఎప్పుడూ ఎలాంటి నీటి గుంటలు, టాయిలెట్లు ఉండకూడదు.
ఈ ప్రాంతాన్ని ఎప్పుడూ ఖాళీగా ఉంచాలి.
దీనివల్ల ఇంటి యజమాని ఆరోగ్యంగా, ఆర్థికంగా స్థిరంగా ఉంటారు.
ఆర్థిక స్థితి మెరుగుపడాలంటే వంటగది ఆగ్నేయ మూలలో ఉండాలి.
ఒకవేళ వీలు పడకపోతే, కనీసం పొయ్యిని ఆగ్నేయ మూలలో ఉంచాలి.
వంటగదిలో మందులు ఉంచడం అస్సలు మంచిది కాదు.
ఇది అనారోగ్య ఖర్చులను పెంచుతుంది.
రాత్రిపూట సింక్‌లో ఎంగిలి గిన్నెలు ఉంచకుండా శుభ్రం చేసుకోవాలి.
ఇలా చేయడంవల్ల ఇంటికి దరిద్రం రాకుండా ఉంటుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
ప్రతిరోజూ సాయంత్రం వేళ ఇంట్లో దీపారాధన చేయడం
సాంబ్రాణి ధూపం వేయడం వల్ల గాలిలోని ప్రతికూలత తొలగిపోయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది.












Click it and Unblock the Notifications