వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

vastu tips: ఇంట్లో పూజగదికి వాస్తు.. నియమాలు పాటించకుంటే అన్నీ సమస్యలే!!

|
Google Oneindia TeluguNews

ఇల్లు నిర్మించుకోవడానికి ఏ విధంగా అయితే వాస్తు చిట్కాలు ఉంటాయో, అదేవిధంగా ఇంట్లో దేవుని మందిరం నిర్మించడానికి, పూజగది ఏర్పాటు చేసుకోవడానికి వాస్తు చిట్కాలు ఉంటాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో దేవుని గది పరమ పవిత్రమైన స్థానంగా చెప్తున్నారు. పాజిటివ్ ఎనర్జీని ఇచ్చి ఇంట్లో ఉన్న వారంతా సంతోషంగా జీవించటానికి పూజగది ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉంటుంది.

పూజగది నిర్మాణంలో వాస్తు నియమాలు

పూజగది నిర్మాణంలో వాస్తు నియమాలు

దేవుడికి స్థానం లేకుండా ఇల్లు పూర్తికాదని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు. మన ఇంట్లో మందిరం ఉండాలా, దేవుడి గది నిర్మాణంలో వాస్తు రహస్యాలు ఏమిటి, అది ఏ దిశలో ఉండాలి?భగవంతుని పూజ చేసేటప్పుడు మనం ఏ దిశలో ఉండాలి? అనే విషయాలపై వాస్తు శాస్త్ర నిపుణులు పలు కీలక సూచనలు చేశారు. వాస్తులో అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏ దిక్కులో ఏది ఉంచాలి అన్నది తెలుసుకోవటమే.సరైన దిశలో మందిరం లేకుంటే అది ఆర్ధిక నష్టాలను, కష్టాలను కలిగిస్తుంది.

పూజ గది ఈ దిక్కులో ఉంటే మంచిది

పూజ గది ఈ దిక్కులో ఉంటే మంచిది

ఇక పూజ గది నిర్మాణం ఈశాన్య దిక్కులో చేస్తే మంచిదని వాస్తు శాస్త్రం చెబుతోంది. అంతేకాదు పడమర, ఉత్తరం మరియు తూర్పు దిక్కులు కూడా బాగానే ఉంటాయని, మీరు ప్రార్థన చేసేటప్పుడు మందిరాన్ని పడమర లేదా తూర్పు వైపుగా ఉండాలని, అది కుదరని పక్షంలో ఉత్తరం వైపుకు ఎదురుగా ఉండి పూజలు చేస్తే ఉంటే కలిసి వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో మీ అనుకూలత కోసం ఏ దిక్కులో పడితే ఆ దిక్కులో పూజగది నిర్మించరాదని కూడా చెప్తున్నారు.

పూజగదిలో విగ్రహాల బదులు దేవుడి చిత్రపటాలే మంచిది

పూజగదిలో విగ్రహాల బదులు దేవుడి చిత్రపటాలే మంచిది


పూజగదిలో దేవుళ్లు, దేవతల చిత్రాలు ఉండాలి తప్ప విగ్రహాలు ఉండకూడదని పేర్కొన్నారు. లోహాలు లేదా రాళ్లతో చేసిన విగ్రహాలను ప్రతిష్టించే సంప్రదాయాన్ని కలిగి ఉంటే, అవి మీ పిడికిలితో పాటు బొటనవేలు కంటే పొడవుగా ఉండకూడదని చెప్తున్నారు . ఒకే దేవుడు విగ్రహాలను ఎక్కువ పెట్టకుండా చూసుకోవాలి. విగ్రహాల కంటే దేవుడు చిత్రాలు పెట్టుకోవడం మంచిదని సూచించబడింది. దేవుడి విగ్రహాలను పెడితే నిత్య పూజలు చేయాల్సి ఉంటుంది. ఇంట్లో మాంసాహారం వంటివి తినకుండా భక్తిశ్రద్ధలతో భగవంతునికి పూజాదికాలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి దేవతామూర్తుల చిత్రపటాలే పెట్టుకోవడం వల్ల పెద్దగా ఇబ్బందులు తలెత్తవని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

పగిలిపోయిన దేవుడి చిత్రాలను, విరిగిన విగ్రహాలను ఉంచుకోకూడదు

పగిలిపోయిన దేవుడి చిత్రాలను, విరిగిన విగ్రహాలను ఉంచుకోకూడదు


అంతేకాదు ఇంటి పూజామందిరంలో పగిలిపోయిన దేవుడి చిత్రపటాలను లేదా విరిగిన విగ్రహాన్ని ఎప్పుడూ ఉంచవద్దు. అలా ఉంచితే నెగిటివిటీ పెరుగుతుందని సూచించబడింది. దేవుని గదంతా విగ్రహాలను ఎప్పుడూ ఉంచవద్దు. కొంతమంది తమ దేవతామూర్తుల విగ్రహాల సేకరణను ప్రెస్టేజ్ గా భావించి ఇంటికి వచ్చిన వారికి గర్వంగా చూపిస్తారు. దేవతలు మరియు దేవతల బొమ్మలను ఇంట్లో ఎక్కడపడితే అక్కడ పెట్టడం మంచిది కాదని సూచించబడింది. పూజా మందిరంతో పాటు, భగవంతుని పవిత్రతను కాపాడుకోవడం కోసం సూచించిన వాస్తు శాస్త్ర నియమాలను అందరూ విధిగా పాటిస్తే మానసిక ప్రశాంతతతో పాటు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని చెబుతున్నారు.

English summary
pooja room plays a major role in the house's peace. Architects say that if the rules of architecture are not followed in the case of worship, problems will suffer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X