వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

vastu tips: నైరుతి అభిముఖంగా ఇల్లు.. ఈ వాస్తు నివారణలతో ఇకపై అశుభం కాదు!!

|
Google Oneindia TeluguNews

హిందూ ధర్మంలో వాస్తు శాస్త్రానికి తనదైన ప్రాధాన్యత ఉంటుంది. ఒక స్థలానికి కానీ, ఇంటికి కానీ వాస్తు కచ్చితంగా ఉండాలి. వాస్తు లేకపోతే ఆ స్థల యజమాని లేదా గృహస్తు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వాస్తు విషయంలో జాగ్రత్తలు పాటించడం అవసరం. వాస్తు సంబంధిత సమస్యలు ఇళ్లలో ఉంటే అనేక అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఎంత కష్టపడినా పురోగతి లేకపోవడం వంటి అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే వాస్తు విషయంలో ప్రతి ఒక్కరు కచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి.

నైరుతి దిశలో ఇల్లు .. కొన్ని వాస్తు దోష నివారణలు

నైరుతి దిశలో ఇల్లు .. కొన్ని వాస్తు దోష నివారణలు

ఇక వాస్తు ప్రకారం నైరుతి దిశలో ఉన్నటువంటి ఇళ్ళు ఏమాత్రం మంచిది కాదు. కానీ నైరుతి ముఖంగా ఉన్న ఇంటిని తీసుకున్నప్పటికీ కొన్ని వాస్తు జాగ్రత్తలు పాటించినట్లయితే భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. సదరు ఇంట్లో కొన్ని మార్పులు చేయడం వల్ల అశుభకరంగా ఉన్న వాటిని కూడా శుభంగా మార్చవచ్చని సూచిస్తున్నారు. ఇక మరి ఆ వాస్తు నివారణల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం..

నైరుతి ముఖంగా ఇల్లు ఉన్నా ప్రధాన ద్వారం ఆ దిశలోనే

నైరుతి ముఖంగా ఇల్లు ఉన్నా ప్రధాన ద్వారం ఆ దిశలోనే

నైరుతి ముఖంగా ఉన్న ఇంటిని తీసుకున్నవారు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి ఈశాన్య దిశను పూర్తిగా ఖాళీగా ఉంచాలి. అప్పుడు ప్రతికూల శక్తులు ఇంట్లోకి రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇంటి యొక్క ప్రధాన ద్వారానికి అత్యంత సానుకూలమైన శక్తి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు నైరుతి దిశలో ఇల్లు ఉన్నప్పటికీ ఇంటి యొక్క ప్రధాన ద్వారం నైరుతి వైపున కానీ దక్షిణం వైపున కానీ ఉండకూడదు. ఇంటి ప్రధాన ద్వారం తూర్పు వైపు కానీ, ఉత్తరం వైపు కానీ, ఈశాన్యం వైపు కానీ ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి.

నైరుతిలోనే ప్రధాన ద్వారం ఉంటే వాస్తు దోష నివారణలు ఇవే

నైరుతిలోనే ప్రధాన ద్వారం ఉంటే వాస్తు దోష నివారణలు ఇవే

నైరుతి అభిముఖంగా ఇల్లు ఉన్నప్పటికీ ఇంట్లోకి వెళ్ళే ప్రధాన ద్వారం విషయంలో తగిన జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి. ఇక ఎట్టి పరిస్థితులలోను నైరుతి వైపు తప్ప ప్రధాన ద్వారం ఏర్పాటు చేయడానికి అవకాశం లేకపోతే తలుపు వెలుపల గాయత్రి మంత్రం, హనుమంతుని చిత్రపటాలు కానీ, టైల్స్ కానీ అమరిస్తే మంచి ఫలితం ఉంటుంది. వాస్తు ప్రకారం వంటగది నైరుతి ముఖంగా ఉన్న ఇంటికి ఈశాన్య మూలలో ఉండాలి. అలా కాకుండా మీ వంటగది నైరుతి దిశలోనే ఉంటే దానికి లైట్ కలర్ పెయింట్ వేస్తే మంచిదని చెప్తున్నారు. ఇక నైరుతి దిశను నియంత్రణ దిశగా పరిగణిస్తారు కాబట్టి నైరుతి దిశలో పడకగది ఉంటే శుభప్రదంగా ఉంటుందని భావిస్తారు.

నైరుతి ముఖంగా ఇల్లు ఉంటే తలుపులు, కిటికీలు ఇలా

నైరుతి ముఖంగా ఇల్లు ఉంటే తలుపులు, కిటికీలు ఇలా

నైరుతి దిశలో పడగదిని ఏర్పాటు చేయడం స్థిరమైన సంపన్నమైన జీవితాన్ని ఇస్తుంది. ఇక ఈ దిశలో పడకగది ఏర్పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి ,పురోగతికి కారణమవుతుంది. ఇక నైరుతి ముఖంగా ఇల్లు ఉన్నట్లయితే ఇంటి కప్పుపై నైరుతి వైపే వాటర్ ట్యాంక్ ఉండొచ్చు. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని చెప్తున్నారు. నైరుతి ముఖంగా ఇల్లు ఉంటే ఇంట్లో కిటికీలు, తలుపులు అన్నీ సరి సంఖ్యలో అమర్చాలని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే నైరుతి ముఖంగా ఇల్లు ఉండటం డేంజర్ అయినప్పటికీ చిన్న చిన్న వాస్తు జాగ్రత్తలు పాటిస్తే అంత ప్రభావం లేకుండా తప్పించుకోవచ్చని చెబుతున్నారు.

Disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Vastu tips: ఇంట్లో మహిళలకు ఎప్పుడూ రోగాలా? ఈ వాస్తు దోషాలతోనే కావచ్చు!!Vastu tips: ఇంట్లో మహిళలకు ఎప్పుడూ రోగాలా? ఈ వాస్తు దోషాలతోనే కావచ్చు!!

English summary
South-west facing house is said to be inauspicious. But with these Vastu remedies, we can make it favorable with small Vastu tips.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X