వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Vastu tips: ఇంటికి వాస్తు బాగున్నా కలిసిరావటం లేదా? అయితే పరిసరాలవాస్తు చెక్ చేసుకోండి!!

|
Google Oneindia TeluguNews

వాస్తు లో గృహాన్ని నిర్మించుకున్నా, పరిసరాల వాస్తు కూడా సరిగా ఉంటేనే ఫలితం అనుకూలంగా ఉంటుంది. ఇంటికి వాస్తు ఎంత ముఖ్యమో ఇంటి పరిసరాల వాస్తు కూడా అంతే ముఖ్యం. వాస్తులో పరిసరాల వాస్తు కు అంతటి ప్రాధాన్యత ఉంటుంది. ఒక్కోసారి గృహవాస్తు పక్కాగా నిర్మించుకున్నప్పటికీ పరిసరాల వాస్తు సరిగా లేకపోతే ఆ ఇంట్లో నివసించే వారు ఉత్తమ ఫలితాలను పొందడం కష్టంగా ఉంటుంది. అందుకే ఎక్కడైనా ఇంటికి నిర్మించుకోవాలి అనుకున్నప్పుడు ఇంటి స్థలం తో పాటుగా, పరిసరాల వాస్తు కూడా గమనించాల్సిన అవసరం ఉందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు

పరిసరాల వాస్తు అంటే ఏమిటి?

పరిసరాల వాస్తు అంటే ఏమిటి?

మన ఇంటి ప్రహరీ తర్వాత బయటి స్థలము పై ఉన్న శుభ, అశుభ వాస్తు ప్రభావాలను పరిసరాల వాస్తు అంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే మన ఇంటి చుట్టూ ఉండే పరిసరాల వాస్తు ప్రభావం మన ఇంటిపై ఉంటుంది. ఇంటి పక్క స్థలాల ప్రభావం దానిని ఆనుకుని ఉన్న గృహాలపై, తప్పకుండా ఉంటుంది. ఒకవేళ పరిసరాల వాస్తు అశుభకరంగా ఉన్నప్పుడు, అదే సమయంలో మన ఇంట్లో కూడా వాస్తు లేకపోతే పది సంవత్సరాలలో కలిగే నష్టం, ఒక సంవత్సరంలోనే కలుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

పరిసరాల వాస్తు, ఇంటి వాస్తు బాగుంటే పట్టిందల్లా బంగారమే

పరిసరాల వాస్తు, ఇంటి వాస్తు బాగుంటే పట్టిందల్లా బంగారమే

ఇక పరిసరాల వాస్తు లేకపోయినప్పటికీ, మన ఇల్లు వాస్తు తో నిర్మించుకున్నట్లయితే జరగబోయే నష్టాన్ని చాలా కాలం పాటు ఆపే శక్తి మన ఇంటి వాస్తుకు ఉంటుంది. తద్వారా నష్టాలకు బదులు లాభాల దిశగా మన గృహం ముందుకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. ఇక పరిసరాల వాస్తు సరిగా ఉండి, గృహ వాస్తు కూడా బాగుంటే అటువంటి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. పరిసరాల వాస్తు, గృహ వాస్తు బాగున్న వారి ఇళ్ళల్లో పిల్లలు మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఆ ఇళ్లలో నివసించే గృహస్థులు సంతోషంగా జీవిస్తారు. మంచి పురోగతి సాధిస్తారు.

కొనుగోలు చేసే స్థలం వాస్తు ఉన్నా గుడి గోపురం నీడ పడే స్థలాలను కొనకూడదు

కొనుగోలు చేసే స్థలం వాస్తు ఉన్నా గుడి గోపురం నీడ పడే స్థలాలను కొనకూడదు

మనం కొనుగోలు చేసే స్థలానికి పూర్తిగా వాస్తు ఉన్నా, ఆ పక్కనే ఆలయాలు ఉంటే, ఆలయ గోపురం నీడ ఇంటి మీద పడుతుంటే, ఆ స్థలాలను కొనుగోలు చేయకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఆలయం, ఇల్లు పక్కనే ఉంటే ఆలయ శిఖరం కంటే ఎత్తులో ఇంటి నిర్మాణం చేయాలి. ఇక ఇంటి తలుపు గుడి తలుపు కంటే ఎత్తుగా ఉండకూడదు. వాస్తవంగా ఆలయాలు, పవిత్రతకు, పాజిటివ్ ఎనర్జీ కి మూల కేంద్రాలుగా భావించినప్పటికీ ఆలయాలు దగ్గర ఇల్లు నిర్మాణం చేస్తే ఇంట్లో ప్రశాంతత ఉండదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

 ఇల్లు, స్థలాలు కొనే ముందు పరిసరాల వాస్తు చెక్ చేయించటం మంచిది

ఇల్లు, స్థలాలు కొనే ముందు పరిసరాల వాస్తు చెక్ చేయించటం మంచిది

గుడి నుండి వెలువడే గంట శబ్దాలు, హారతి, ధూపదీపాలు బయటకు నెగిటివ్ ఎనర్జీ ని పంపిస్తాయి అని, అవి గుడి పక్కనే ఉన్న ఇళ్లలోకి వచ్చే అవకాశం ఉంటుందని, తద్వారా ఆ ఇళ్లలో అశాంతి నెలకొంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఒక గుడి మాత్రమే కాదు చర్చి, దర్గా, మసీదుల నీడ కూడా ఇంటిపై పడటం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇంటి స్థలాలు కొనుగోలు చేసేటప్పుడు చుట్టూ ఉండే పరిసరాల వాస్తు కూడా గమనించాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మనం కొనుగోలు చేసి ఇంటికి వాస్తు ఉన్నప్పటికీ, పరిసర వాస్తు దోషాలు ఉంటే దాని ప్రభావం మనపై ఖచ్చితంగా పడుతుందని, అందుకే ఏదైనా కొనుగోలు చేసే ముందు వాస్తు సిద్ధాంతికి చూపించుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

Disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
Vastu of the house as well as Vastu of surroundings should be good. Then the family lives happily. If the house has Vaastu but the surrounding area does not have Vaastu, and if the house and surroundings do not have Vaastu damage will occur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X