Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

vastu tips: ఇంట్లోని ఈ భాగాలు రాహువుకు సంబంధించినవి, చిన్న దోషమున్నా సర్వ నాశనమే!!

ఇంట్లోని కొన్ని భాగాలు రాహువుకు సంబంధించినవిగా ఉంటాయని, వాటిలో చిన్న దోషమున్నా సర్వ నాశనమే జరుగుతుందని చెప్తున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

నవగ్రహాలలో రాహు గ్రహం అత్యంత కీలకమైన గ్రహం. ప్రతి మనిషి వారి జాతకంలోని రాహు కేతువుల స్థానాలను బట్టి, రాహు కేతువుల స్థితిని బట్టి వారి జాతక ఫలం ఏ విధంగా ఉంటుందో చెబుతారు. ఇక రాహు గ్రహ ప్రభావం ఇంట్లో కూడా అనేక భాగాలపైన ఉంటుంది. పెద్ద పెద్ద వాస్తు దోషాలకు రాహు గ్రహ ప్రభావం కారణమవుతుంది. అసలు రాహువు ఎవరు? రాహువు కు సంబంధించిన ఇంటి వాస్తు దోషాలు ఏ విధంగా ఉంటాయి? అవి ఎటువంటి ఫలితాలను, దుష్ప్రభావాలను కలిగిస్తాయి? వంటి అనేక విషయాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

ఇంట్లో అక్కడ వాస్తు దోషాలుంటే రాహువు తిష్ట

ఇంట్లో అక్కడ వాస్తు దోషాలుంటే రాహువు తిష్ట

జ్యోతిష్యంలో రాహువును క్రూరమైన గ్రహంగా అభివర్ణించారు. నల్లని మేని ఛాయ, ఎత్తయిన రూపం, నాలుగు భుజాలు కలిగి, కత్తి, త్రిశూలాన్ని ధరించి, కవచధారణ చేసి ఉంటాడు రాహువు. రాహువు అపసవ్య మార్గాన నడిచే స్త్రీ గ్రహం. వాస్తు పరంగా కానీ, జాతకపరంగా కానీ అత్యంత ప్రమాదకరమైన గ్రహంగా రాహువును భావిస్తారు. రాహువు మనిషి జీవితం పైన, ఇంటి పైన కూడా ప్రభావాన్ని చూపిస్తాడు. ఇంట్లోని అనేక భాగాలలో దోషాలు ఉంటే రాహువు తిష్ట వేస్తాడు. రకరకాల సమస్యలను ఇబ్బందులను కలిగించి, ఆ గృహస్థులను నాశనం చేస్తాడు. ఇంటికి రాహు దోషం ఉంటే వీలైనంత త్వరగా దానిని సరిచేసుకోవాలి.. లేదంటే సర్వనాశనం కావడం ఖాయం అని చెబుతున్నారు వాస్తు శాస్త్రం నిపుణులు.

రాహువుకు సంబంధించిన ఇంటి స్థలాలు ఇవే.. వీటి విషయంలో జాగ్రత్త

రాహువుకు సంబంధించిన ఇంటి స్థలాలు ఇవే.. వీటి విషయంలో జాగ్రత్త


ఇక ఇంతకీ రాహు కు సంబంధించిన ఇంటి స్థలాలు ఏమిటి? రాహు ఏ దిశలో తిష్ట వేస్తాడు? ఎలాంటి చోట రాహువుకు సంబంధించిన వాస్తు దోషాలు కలుగుతాయి అంటే నైరుతి దిశను రాహువు దిశగా పరిగణిస్తారు. ఈ దిశలో దోషాలు ఉంటే ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాడు రాహువు. నైరుతి దిశ మాత్రమే కాకుండా బాత్రూమ్, టాయిలెట్లు, ఇంటి పైకప్పు, మెట్లు రాహువు కు సంబంధించినవి. ఇంటి టాయిలెట్ మురికిగా ఉన్న, ఎక్కడైనా విరిగిపోయి, పగిలిపోయి, ట్యాప్ లు లీక్ అవుతున్నా అక్కడ రాహు దోషం తలెత్తుతుంది. మరుగుదొడ్లు సరైన స్థానంలో నిర్మించకపోయినా, ఇంటి మెట్లు సరైన స్థానంలో లేకపోయినా.. ఆయా చోట్ల చెత్తాచెదారం ఉన్నా రాహు దోషం తలెత్తుతుంది.

రాహు సంబంధమైన స్థలాలలో వాస్తు దోషాలు లేకుండా ఈ పని చెయ్యండి

రాహు సంబంధమైన స్థలాలలో వాస్తు దోషాలు లేకుండా ఈ పని చెయ్యండి


ఇంట్లోని రాహువు సంబంధమైన స్థలాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో చెత్తాచెదారాన్ని జమ చేసుకోకూడదు. పాత వస్తువులను పోగు పెట్టుకోకూడదు. ఇంటి లోపల, బయట ఎక్కడ ముళ్ళ చెట్లు, పిచ్చి మొక్కలు లేకుండా జాగ్రత్తలు పడాలి. ముళ్ళతో కూడిన చెట్లు మొక్కలు కూడా రాహు దోషాలకు కారణమవుతాయి. కాబట్టి రాహువు సంబంధమైన ఇంట్లోని స్థలాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. శుభ్రంగా ఉంచండి. లేదంటే రాహువు తన ప్రతాపాన్ని చూపిస్తాడు. ఆ కుటుంబ సభ్యులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తాడు.

రాహువు ప్రభావం ఇలా ఉంటుంది

రాహువు ప్రభావం ఇలా ఉంటుంది

ఇంట్లో రాహువు ప్రభావం మొదలైతే ఆ ఇంట్లో వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే.. రాహు దోషం ఉన్న ఇంట్లోని వారు ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడతారు. అనేక రకాల మానసిక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. వారు పదేపదే అనేక తప్పుడు నిర్ణయాలను తీసుకుంటూ కష్టాలలో పడతారు. జీవితంలో ఊహించని అనవసర సమస్యలు వారిని వేధిస్తాయి. విపరీతంగా ధన నష్టం జరిగి ఆర్థికంగా ఇబ్బందుల్లో పడతారు.

రాహు దోషాలను పట్టించుకోకుంటే జీవితం సర్వ నాశనమే

రాహు దోషాలను పట్టించుకోకుంటే జీవితం సర్వ నాశనమే

ఇంట్లో ఎవరో తిరుగుతున్నట్టు, తమకేదో ఇబ్బంది కలుగుతున్నట్టు భయపడుతూ ఉంటారు. ప్రతికూల శక్తులు ఇంట్లో ఉన్నట్టు ఫీల్ అవుతారు. విపరీతమైన డిప్రెషన్ కు లోనై పూర్తిగా అనారోగ్యం బారిన పడతారు. రాహువు కారణంగా మరణాలు సంభవించే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇంట్లోని రాహు సంబంధితమైన ప్రాంతాలలో వాస్తు దోషాలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే జీవితం సర్వనాశనం అవుతుంది.

disclaimer: ఈ కథనం వాస్తు నిపుణుల సూచనలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+