vastu tips: భార్యాభర్తల ప్రేమ బలపడాలంటే బెడ్ రూమ్ లో మీరు చెయ్యాల్సింది ఇదే!!

వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే కొన్ని సులభమైన వాస్తు చిట్కాలను పాటిస్తే ఫలితం ఉంటుందని చెబుతున్నారు వాస్తు శాస్త్రం నిపుణులు.

భార్య భర్తలు సంతోషంగా జీవించాలి అనుకుంటారు. ప్రేమానురాగాలతో దాంపత్యం చేయాలి అనుకుంటారు. అయితే భార్యాభర్తల మధ్య ఊహించని విధంగా గొడవలు జరుగుతుంటే, ఎప్పుడూ భార్యాభర్తల దాంపత్య జీవితం సుఖంగా లేకుంటే ఆ ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయని గుర్తించాల్సిన అవసరం ఉందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో సానుకూల శక్తి ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు వెల్లి విరుస్తాయి. అలా కాకుండా ప్రతికూల శక్తులు ఉంటే పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటాయి. చిన్న చిన్న వాటికి గొడవపడటం, మానసికంగా కృంగిపోవడం వంటి అనేక ఇబ్బందులు కలుగుతాయి. ఇంట్లో ఉండే వాస్తు దోషాలు వైవాహిక జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. అయితే వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే కొన్ని సులభమైన వాస్తు చిట్కాలను పాటిస్తే ఫలితం ఉంటుందని చెబుతున్నారు వాస్తు శాస్త్రం నిపుణులు.

భార్యాభర్తల మధ్య బంధం బలంగా ఉండాలంటే ఇంట్లో ఈ పని చెయ్యండి

భార్యాభర్తల మధ్య బంధం బలంగా ఉండాలంటే ఇంట్లో ఈ పని చెయ్యండి

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో భారీగా ఫర్నీచర్ ఉంటే అది అనేక సమస్యలను తెచ్చిపెడుతుంది. ఎప్పుడూ హాల్లో ఉండే ఫర్నీచర్ సింపుల్ గా ఉండాలి. చాలా బరువైన ఫర్నీచర్ ని ఇంట్లో పెట్టుకోవడం ఏమాత్రం మంచిది కాదు. ఇక భార్యాభర్తలు పడక గదిలో కూడా బరువు తక్కువగా ఉండే ఫర్నీచర్ నే ఉంచుకోవాలి. విపరీతమైన బరువు ఉన్న మంచాలు, వార్డు రోబ్ లు, డ్రెస్సింగ్ టేబుల్స్ ఉంచుకోవడం మంచిది కాదు. ఒకవేళ బరువైన వస్తువులు ఉంటే వాటిని ఇంటి దక్షిణం లేదా పశ్చిమ గోడ వైపు అమర్చుకోవాలి. ఇక లేతరంగుల ఫర్నీచర్ బెడ్రూంలో ఉంచడం వల్ల సానుకూల శక్తి వస్తుంది. అలాకాకుండా ముదురు రంగు ఫర్నీచర్ ఇంట్లో పెట్టుకుంటే అది ప్రతికూలతలను ప్రోత్సహిస్తుంది.

చెక్క వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం

చెక్క వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం

ఇక ఇంట్లో పెట్టుకునే చెక్క వస్తువుల విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాస్తులో కొన్ని చెక్కలను శుభాలు చేకూర్చేవిగా, మరికొన్నింటిని అశుభమైనవిగా పరిగణిస్తారు. ఇంట్లో మంచాన్ని కొనుగోలు చేయాలనుకున్నప్పుడు, లేదా తయారు చేస్తున్నప్పుడు చెక్క విషయంలో జాగ్రత్త పడటం మంచిది. రోజ్ వుడ్ తో కానీ, టేకు తో కానీ, గంధం, అశోక, అర్జున, వేప చెక్కతో కానీ చేసిన ఫర్నిచర్ ను కొనుగోలు చేస్తే ఇంటికి శుభం చేకూరుతుంది. కాబట్టి చెక్క వస్తువుల విషయంలో జాగ్రత్త తీసుకోవడం అవసరం.

బెడ్ రూమ్ లో భార్యాభర్తల ప్రేమ బలపడాలంటే ఇవి చెయ్యండి

బెడ్ రూమ్ లో భార్యాభర్తల ప్రేమ బలపడాలంటే ఇవి చెయ్యండి

ఇక వాస్తు శాస్త్రం ప్రకారం బెడ్ రూమ్ లో తప్పనిసరిగా కిటికీ ఉండాలి. ఇది గదిలోకి సానుకూల శక్తిని ప్రసరింపజేస్తుంది. భార్యాభర్తల మధ్య సంబంధాలపై కిటికీ ఉండడం వల్ల మంచి ప్రభావం ఉంటుంది. భార్యా భర్తల మధ్య సంబంధం ఎప్పుడు ప్రేమానురాగాలతో కూడుకొని ఉండాలంటే బెడ్రూంలో ఎప్పుడూ తాజా పువ్వులు ఉంచాలి. ఎండిపోయిన పువ్వులను బెడ్రూంలో ఉంచడం మంచిది కాదు. బెడ్ రూమ్ ఎప్పుడు సుగంధ పరిమళాలు వచ్చేలా చూసుకోవాలి. భార్యాభర్తల మధ్య దూరం ఎక్కువగా ఉంటే పడకగదిలో రెండు ఎరుపు రంగు కొవ్వొత్తులను వెలిగిస్తే, ఇద్దరి మధ్య అనుబంధం బలపడుతుంది.

భార్యాభర్తలు పడుకునే మంచం ఇలా ఉండకూడదు

భార్యాభర్తలు పడుకునే మంచం ఇలా ఉండకూడదు


పడకగదిలో ఎప్పుడు పడుకునే మంచానికి ఎదురుగా అద్దం ఉండకూడదు. అద్దం ఎప్పుడు ప్రతికూల శక్తులను ఆకర్షిస్తుంది. నిద్ర భంగాలు కలిగిస్తుంది. ఒకవేళ పడకగదిలో అద్దం ఉన్నప్పటికీ ఉదయం నిద్ర లేచిన వెంటనే పొరపాటున కూడా అద్దాన్ని నేరుగా చూడకూడదు. ఇది ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. వైవాహిక జీవితంలో ఇది అనేక ఇబ్బందులను తీసుకువస్తుంది. భార్య భర్తలు పడుకునే మంచం ఒకటిగానే ఉండాలి. రెండు మంచాలను కలిపి, రెండు పరుపులను కలిపి ఒకటిగా చేసి భార్యాభర్తలు పడుకోకూడదు. అటువంటి మంచం మీద పడుకుంటే భార్యాభర్తల మధ్య బంధాలు చెడిపోతాయి.

బెడ్ రూమ్ లో తీసుకోవాల్సిన వాస్తు చిట్కాలు ఇవే

బెడ్ రూమ్ లో తీసుకోవాల్సిన వాస్తు చిట్కాలు ఇవే

బెడ్రూంలో గదిగోడలకు ఎప్పుడు లేత రంగుల పెయింట్ చేసుకోవాలి. లేత గులాబీ రంగు, లేత పీచ్ కలర్ ప్రేమను మరింత పెంచుతుంది. ఇక పడకగదిని శుభ్రం చేసేటప్పుడు ఎప్పుడు ఉప్పునీటితో మర్చిపోవద్దు. ఉప్పు సానుకూల శక్తిని ప్రసరింప చేస్తుంది. పడకగదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. సాలెపురుగుల గూళ్ళు, బూజు పట్టనివ్వకూడదు. ఒకవేళ అలాంటివి ఉంటే ప్రతికూల ఫలితాలు వస్తాయి. పడకగదిలో ఉత్తరం గోడపైన భార్యాభర్తల మధ్య విడదీయరాన్ని ప్రేమ అనుబంధం పెంచడం కోసం రాధాకృష్ణులు ఆలింగనం చేసుకున్న చిత్రాన్ని పెట్టుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+