అద్దె ఇంట్లో ఉండేవారు కచ్చితంగా ఈ వాస్తు నియమాలు పాటించాలి
సొంతింట్లో ఉంటున్నా, అద్దె ఇంట్లో ఉంటున్నా వాస్తును అనుసరించడం ముఖ్యం. ఎవరికైనా ఇది వర్తిస్తుంది. పట్టణాల్లో చాలామంది అద్దె ఇళ్లల్లోనే నివసిస్తుంటారు. కాబట్టి వారు కూడా వాస్తును అనుసరించాలి. వాస్తు దోషాలు ఉన్నాయో లేదో చూసుకొని అద్దె ఇంట్లోకి దిగాలి. వాస్తు బాగుంటే కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వాస్తు గురించి ఇంటి యజమానులతో మాట్లాడండి. తెలిసిన నిపుణులను తీసుకువచ్చి చూపించుకొని అద్దె ఇంట్లోకి మారాలి. ఏవైనా దోషాలుంటే చిన్న చిన్న మార్పుల ద్వారా సవరించుకోవచ్చు.
ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక గుర్తు గీయాలి.
అలాగే మధ్యలో ఓం చిహ్నాన్ని ఉంచాలి.
ఇవి రెండూ ప్రతికూల శక్తిని ఇంట్లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటాయి.
ఇంటికి వచ్చే అతిథులతో సంబంధాలు దీనివల్ల మెరుగుపడతాయి.

ప్రతికూలతను కళ్లు ఉప్పు బాగా తగ్గిస్తుంది.
ఒక గాజు గిన్నెలో రాతి ఉప్పు నింపి ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉంచాలి.
ఇది ఆర్థికంగా ఎదురవుతున్న అడ్డంకులను తొలగిస్తుంది.
గది వాతావరణం బాగుండేలా చూస్తుంది.
ప్రతి 15 రోజులకు ఒకసారి, లేదంటే వారానికోసారి ఉప్పును మారుస్తుండండి.
ఈశాన్యం మూల తేలికగా ఉండాలి. బరువు ఉండకూడదు.
బరువుంటే మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అనారోగ్యం కలుగుతుంది.
ఈశాన్యంలో నీటితో నిండిన కలశం లేదంటే గంగాజలం లాంటివి ఉంచాలి.
బెడ్ రూంలో మనం నిద్రించే మంచం దిశ కూడా చాలా ముఖ్యం.
తల తూర్పు వైపు లేదంటే దక్షిణం వైపు ఉండాలి.
నైరుతి మూలలో మంచాన్ని ఉంచితే స్థిరత్వం వస్తుంది.
నైరుతిలో బరువుంటే అల్మారా ఉంచడంద్వారా సమతులత్య తేవొచ్చు.
ఇలాంటి చిన్న చిన్న మార్పులు వాస్తు దోషాలను తొలగిస్తాయి.
నిర్మాణ మార్పులు లేకుండా, భారీ ఖర్చులు లేకుండా వీటిని పాటిస్తే చాలు.












Click it and Unblock the Notifications