వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

vastu tips: మామిడితో ఐశ్వర్యం; వాస్తు దోష నివారణలో మామిడిచెట్టు మహిమ ఇంతింత కాదయా?

|
Google Oneindia TeluguNews

ప్రతి వ్యక్తి తన ఇంట్లో ఆనందం మరియు శాంతిని కోరుకుంటాడు. దీనికోసం వ్యక్తులు అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం పనులు చేయకపోతే ఈ కష్టమంతా చెడిపోతుంది. మన ఇంట్లో ఉండే వాస్తు దోషాల వల్ల ఊహించని అనర్ధాలు జరుగుతాయి. ఇంట్లో సరైన వాస్తు ఉండటం చాలా ముఖ్యం. ఇక ఇంట్లో సరైన వాస్తు లేనివారు అత్యంత మహిమాన్వితమైన మామిడితో వాస్తు దోషాలు తొలగించుకోవచ్చునని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

మామిడి చెట్టు ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది..

మామిడి చెట్టు ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది..

వాస్తు ప్రకారం ఇంటి ఆవరణలో మామిడి చెట్లు పెంచడం మంచిది కాదని చెబుతారు కానీ వాస్తు శాస్త్రం ప్రకారం మామిడి చెట్లను ఇంటి ఆవరణ బయట పెట్టడం మంచిదని సూచించబడింది. వాస్తు ప్రకారం, చెట్లను నాటినప్పుడు, తియ్యటి మామిడి పండ్లతో పాటు, అవి కుటుంబంలో శ్రేయస్సు మరియు సంతోషాన్ని కూడా కలిగిస్తాయి. మధురమైన, రుచికరమైన పండ్లను ఇచ్చే మామిడి చెట్టు ఇంటి ఐశ్వర్యాన్ని కూడా ఎలా పెంచుతుందో తెలుసుకుందాం.

ఈ దిశలోనే మామిడి చెట్టును నాటాలి

ఈ దిశలోనే మామిడి చెట్టును నాటాలి

మీరు ఇంటి బయట ఆవరణలో మామిడి చెట్టును నాటడానికి ఇష్టపడితే, దాని దిశను ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. వాస్తు శాస్త్రం ప్రకారం మామిడి చెట్టును నైరుతి దిశలో నాటాలి. ఈ దిశలో మామిడి చెట్టును నాటడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నివసిస్తుంది. అంతే కాకుండా కుటుంబంలో ఆనందం మరియు శోభ ఉంటుంది. ఇంటి సభ్యులు కూడా విజయం సాధిస్తారు. అయితే మామిడి చెట్టును ఇంట్లో నాటడం మంచిది కాదని చెబుతారు.

ఇంట్లో మామిడి చెట్టు నీడ పడకూడదు

ఇంట్లో మామిడి చెట్టు నీడ పడకూడదు

మామిడి చెట్టును ఇంటి దగ్గర ఎప్పుడూ నాటకూడదు, ఎందుకంటే దాని నీడ ఇంటిపై పడటం అశుభం. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ముందు 5 నుంచి 6 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న చెట్టును నాటకూడదు. ఇది ఇంట్లో గందరగోళాన్ని సృష్టిస్తుంది. దీంతో ఇంట్లో నిత్యం ఘర్షణలు చోటుచేసుకుంటాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లోపిస్తుంది అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

 ఇంటి బయట మామిడి ఆకుల తోరణాలు కట్టడం శ్రేయస్కరం

ఇంటి బయట మామిడి ఆకుల తోరణాలు కట్టడం శ్రేయస్కరం

మామిడి చెట్టు ఆకులను కూడా పూజలో ఉపయోగిస్తారు. అంతే కాకుండా ఇంటి బయట మరియు ప్రాంగణంలో మామిడి ఆకులను తోరణాలుగా కట్టడం వల్ల ఇంట్లో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మామిడి ఆకుల తోరణాలు కఠిన ఇంట్లో లక్ష్మీ దేవి, విష్ణుమూర్తి నివసిస్తారని వాస్తు శాస్త్ర పండితులు చెబుతున్నారు. పండుగలప్పుడు, పూజ సమయంలో మాత్రమే కాకుండా ప్రతీ వారం ఇంటికి మామిడి తోరణాలు కట్టడం వల్ల ఎల్లప్పుడూ సానుకూల శక్తి ఉంటుంది. ఇక ఈ మామిడి తోరణాలు కట్టడం లోనూ సంఖ్యను పాటించాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 11 మామిడి ఆకులను, బ్రహ్మను జపిస్తూ వాస్తు పురుషుని జపిస్తూ దారానికి కట్టి తోరణాలుగా ఇంటికి కట్టడంవల్ల ఇంట్లో ఏవైనా వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయని చెబుతున్నారు.

 మామిడి కలపతో దోషాల నివారణ.. మామిడి కలపతో యాగాలు చేస్తే శుభ ఫలితాలు

మామిడి కలపతో దోషాల నివారణ.. మామిడి కలపతో యాగాలు చేస్తే శుభ ఫలితాలు

ఇక మామిడి కలప కూడా దోషాలను నివారించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో ఏదైనా శుభకార్యాలు చేస్తున్నప్పుడు, పూజాదికాలు నిర్వహిస్తున్నప్పుడు మామిడి కలపతో యజ్ఞయాగాదులు చేస్తే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుందని, ఇంటి పైఉన్న నరదృష్టి తొలగిపోతుందని వాస్తు పండితులు చెబుతున్నారు. అందుకే మామిడి కొమ్మలను ఎండబెట్టుకుని ఉంచుకోవడం, వాటిని యాగాలలో వినియోగించడం మంచిదని సూచిస్తున్నారు.

తూర్పు వాస్తు దోషం ఉన్న ఇళ్లలో మామిడి చెక్కతో చేసిన స్వస్తిక్ శుభదాయకం

తూర్పు వాస్తు దోషం ఉన్న ఇళ్లలో మామిడి చెక్కతో చేసిన స్వస్తిక్ శుభదాయకం

ఇక ఇదే సమయంలో తూర్పు వైపు వాస్తు దోషం ఉన్న ఇళ్లలో మామిడి చెక్కతో స్వస్తిక్ గుర్తును తయారు చేసి పెట్టుకుంటే ఇంటి తలుపు పెట్టుకుంటే శుభఫలితాలు ఉంటాయని, వాస్తు దోషం తొలగిపోతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు . ఒక స్వస్తిక్ గుర్తు మాత్రమే కాకుండా, ఓంకారం కానీ, మరే ఇతర భగవంతుని సూచించే గుర్తులు మామిడి చెక్కతో చేయించినా ఫలితముంటుందని చెబుతున్నారు. ఇక ఫామ్ హౌస్ లలో మామిడి చెట్లు పెంచాలి అనుకునేవారు వాటిని పశ్చిమదిశలో, దక్షిణం వైపు పెంచాలని, ఆ దిక్కులలో పెంచడం వల్ల సానుకూల శక్తి మరింత బలపడుతుందని చెబుతున్నారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
Vastu Shastra experts say that wealth is obtained with mango trees. Mango trees are also said to be important in solving Vastu defects.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X