Vastu tips: ఈ వీధిపోటు ఉంటే గొర్రెతోక బెత్తెడన్నట్టే జీవితం.. అన్నీ అపజయాలే!!
వాస్తు శాస్త్రంలో వీధిపోటుకు ప్రాధాన్యత ఉంటుందని ఇప్పటికే తెలుసుకున్నాం. కొన్ని వీధిపోట్లు, ఆయా స్థలాలలో ఇల్లు కట్టుకునే గృహస్థులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తాయని చెప్పుకున్నాం. ముఖ్యంగా తూర్పు ఈశాన్యం వీధిపోటు, ఉత్తర ఈశాన్యం వీధిపోటు, పశ్చిమ వాయువ్యం వీధిపోటు, దక్షిణ ఆగ్నేయం వీధి పోటు ఉన్న స్థలాలను నిశ్చింతగా కొనుగోలు చేయవచ్చని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక కొనుగోలు చెయ్యకూడని కొన్ని వీధి పోట్లు గురించి కూడా వాస్తు శాస్త్రంలో వివరించారు.

ఈ వీధిపోట్లు ఉన్న స్థలాలు, ఇళ్ళు కొంటే యమా డేంజర్
ఇక కొనుగోలు చెయ్యకూడని వీధి పోట్ల వివరాల్లోకి వెళితే తూర్పు ఆగ్నేయం వీధి పోటు ఉన్న స్థలాన్ని, దక్షిణ నైరుతి వీధి పోటు ఉన్న స్థలాన్ని, పశ్చిమ నైరుతి వీధి పోటు ఉన్న స్థలాన్ని, ఉత్తర వాయువ్యం వీధిపోటు ఉన్న స్థలాలను కొనుగోలు చేయకూడదు. ఈ వీధి పోట్లు ఉన్న ఇళ్లను కూడా కొనుగోలు చేయకూడదు. ఈ వీధి పోట్లు ఉన్న స్థలాలను కొనుగోలు చేస్తే ఊహించని అనర్ధాలు జరుగుతాయి అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక వీటిలో పశ్చిమ నైరుతి వీధిపోటు ఉన్న ఇంటిని, స్థలాన్ని కొనుగోలు చేస్తే కలిగే అనర్థాలను గురించి ఈరోజు తెలుసుకుందాం.

పశ్చిమ నైరుతి వీధిపోటు ఉంటే జీవితం అపజయాల జాతర
పశ్చిమ నైరుతి వీధిపోటు ఉన్న స్థలాన్ని కానీ, ఇంటిని గాని కొంటే జీవితం అపజయాల జాతర అన్నట్టుగా మారుతుంది. పశ్చిమ నైరుతి వీధిపోటు వల్ల ఆ ఇంట్లోని సభ్యులకు మనశ్శాంతి నశిస్తుంది. పశ్చిమ నైరుతి వీధిపోటు ప్రభావంతో ఇంట్లోని వారు ఎప్పుడూ నిరాశ నిస్పృహలకు లోనవుతుంటారు. ఈ వీధి పోటు ఉంటె కష్టానికి తగిన ప్రతిఫలం లభించదు. ముఖ్యంగా ఈ వీధి పోటు ఇంట్లో నివసించే పురుషులపై ప్రధానంగా ప్రభావం చూపుతుంది. ఈ వీధి పోటు ఉన్న ఇంట్లో ఉండే పురుషులు బయట అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

అన్నిట్లోనూ ఫెయిల్యూర్ .. ఆర్ధిక నష్టాలు
అనవసరమైన నిందలు వారిపై పడే అవకాశాలుంటాయి. ఎంత కష్టపడినా విజయం అందినట్టే అంది చివరకు చేజారిపోతుంది. అనుకున్న లక్ష్యాలను సాధించడంలో ఈ వీధి పోటు ప్రభావం వల్ల వారు అన్నింటా ఫెయిల్ అవుతారు. ఇక ఇంట్లోని మగవారి పరిస్థితి దారుణంగా ఉన్నప్పుడు ఇంటిల్లపాదికి దాని ప్రభావం ఉంటుంది. ఆర్థికంగా తీవ్రమైన నష్టాలను చవి చూస్తారు. జీవితం ఎప్పుడు గొర్రె తోక బెత్తెడే అన్నట్టుగా ఉంటుంది. ఎంత కష్టపడి పని చేసిన ఎదుగూ బొదుగూ లేకుండా, సుఖసంతోషాలు లేకుండా జీవించాల్సి వస్తుంది. అందుకే ఈ వీధిపోటు ఉన్న స్థలాన్ని పొరబాటున కూడా కొనుగోలు చెయ్యకండి. తక్కువ ధరకు వస్తున్నా కొనకండి.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications