
గృహ నిర్మాణానికి స్థలం ఎలాంటిదై ఉండాలి
డా. ఎం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
గృహ నిర్మాణానికి స్థలం ఎంపికే ఆయువు పట్టు లాంటిది. ఇంటి నిర్మాణానికి స్థలాన్ని ఎంపిక చేసుకునే ముందు కొనుగోలు చేయబోయే స్థలం గురించి జాగ్రత్తగా పరిశీలించాలి. ముఖ్యంగా స్థలం దిశల కోణాలను నిశింతంగా పరిశీలించాలి. ఎంపిక చేసుకునే స్థలం చతుర్రసాకారం లేదా దీర్ఘ చతురస్రాకారంలో ఉండేలా చూసుకోవాలి. ఈ చతురస్ర, దీర్ఘ చతురస్ర ఆకారంలో లేని పక్షంలో.. మూలలకు సంబంధించిన దోషాలు కలిగే అవకాశాలు మెండుగా ఉంటాయి. దీర్ఘ చతురస్రం అంటే మరి పెద్దగా కాదు పొడవు x వెడల్పు 1:2 పరిమాణంలో ఉండాలి.
వాస్తు శాస్త్ర ప్రకారం కొన్ని దిశల స్థలాలను పరిశీలించినట్టియితే.. వాటి వల్ల కలిగే లాభ నష్టాలను పరిశీలిద్దాం.
* దక్షిణ ఆగ్నేయం పెరిగిన స్థలం మంచిది కాదు. అయితే ఇలాంటి స్థలాలను సరి చేసుకోవచ్చును.
* నైరుతి మూలను.. మూలమట్టాల నుంచి 90 డిగ్రీలు చేసి తూర్పు భాగానికి తాడును లాగి హద్దు చేసుకుని మిగిలిన స్థలాన్ని వదిలివేయడం మంచిది.

* దక్షిణ నైరుతి పెరిగిన స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టకుండా ఉంటే మంచిది. గత్యంతరం లేని పక్షంలో ఈ స్థలంలోనే ఇంటి నిర్మాణం చేపట్టదలిస్తే.. మూలలను సరిచేసుకోవడం మంచిది.
* దక్షిణ నైరుతి పెరిగిన స్థలాన్ని సరి చేసుకునేందుకు ఆగ్నేయ మూలను మూలమట్టాన్ని వుంచి 90 డిగ్రీలుగా పడమరకు తాడును లాగి, హద్దు చేసుకుని మిగిలిన స్థలాన్ని వదిలివేయాలి.
* ఇకపోతే.. తూర్పు ఆగ్నేయం, దక్షిణ ఆగ్నేయం పెరిగిన స్థలం ఇంటి నిర్మాణానికి పనికిరాదు. దీన్ని నివారించాలంటే.. ఈశాన్యం మూలన మూలమట్టాన్ని ఉంచి 90 డిగ్రీలు చూసి, దక్షిణ భాగానికి తాడులాగి హద్దు చేసి, అలాగే.. నైరుతిమూలన మూలమట్టం నుంచి 90 డిగ్రీలు చూపి తూర్పు భాగానికి తాడులాగి హద్దు చేసుకుని, మిగిలిన స్థలాన్ని వదిలివే యాలి.
* శాస్త్ర ప్రకారం దిక్కులు, విదిక్కులలో ఏ వైపు స్థలం పెరగవద్దు.
* ఈశాన్యం పెరుగుతే మంచిది అని కొందరి అభిమతం, ఈశాన్యం పెరగడం అంటే ఎంతపడితే అంతా స్థలం పెంచ కూడదు. మిగితా దిశల కంటే కొంచం కుడిగా ఉండాలి అంటే ''తౌస్" పరిమాణంలో పెంచుకుంటే దోషం ఉండదు. ఇష్టం వచ్చినట్టు పెంచుకుని ఈశాన్యం ఎంత పెరిగితే అంతా మంచిది అన్న భావన శాస్త్ర సమ్మతం కాదు. ఒకవేళ అలా పెరిగి ఇబ్బందు చవి చూడాల్సి వస్తుంది. ఈశాన్యం పెరుగుతే నైరుతి తగ్గుతుంది. యజమాని మీద చెడు ప్రభావం చూపిస్తుంది.
* స్థలానికి వీధి శూలలు " పోట్లు " లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది వీధి శూల, ఏది వీధి పోటు అని తెలియక అయోమయంలో పడుతున్నారు. స్వంత నిర్ణయాలకు ప్రాధాన్యతను ఇవ్వకుండా అనుభవజ్ఞులైన శాస్త్ర పండితులచే పరిశీలన చేయించుకోవడం ఉత్తమం.
* నిర్మాణం చేయాలకున్న స్థలానికి "భూ" పరీక్ష, స్థల శుద్ది, దిక్ సాధన చేపించుకోవాలి. పరిసరాల ప్రభావం, ప్లవముల పరిశీలన, శల్య దోష పరీక్ష తప్పకుండా చేపించుకోవాలి.
* పై తెలిపిన విషయాలను ఎక్కడో విన్నాం. యూ ట్యూబ్ లో చూసాం, మాకు తెలుసు అనే విషయాలలో పరిపూర్ణ శాస్త్ర పరిజ్ఞానం లేకుండా స్వయం కృతాపరాధం చేసుకోకూడదు. అనుభవజ్ఞులైన పండితుల పర్యవేక్షణలో జరిపించుకుంటే శుభకరం.