వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

vastu tips: ఇంటికి గుమ్మడికాయ కట్టకపోతే ఏమవుతుంది? నేరుగా అది ఇంట్లోనే తిష్ట వేస్తుంది!!

|
Google Oneindia TeluguNews

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి నిర్మించుకోవడం ఇంట్లో వస్తువులను పెట్టుకోవడం ఎంత అవసరమో? వాస్తు నియమాలను పాటించడం కూడా అంతే అవసరమని అనేక సందర్భాలలో తెలుసుకున్నాం. ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ముందు గుమ్మడికాయ ను ఎందుకు కట్టుకోవాలి? ఎప్పుడు కట్టుకోవాలి? అసలు గుమ్మడికాయ కట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? గుమ్మడికాయ కట్టకపోతే జరిగే నష్టమేంటి? అనే అనేక విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంటి ముందు గుమ్మడి కాయ కట్టుకోవటం వల్ల అనేకఫలితాలు

ఇంటి ముందు గుమ్మడి కాయ కట్టుకోవటం వల్ల అనేకఫలితాలు

సాధారణంగా ఎవరి ఇంటికి వెళ్లినా ప్రతి ఒక్కరి ఇళ్ళముందు గుమ్మడి కాయ వేలాడుతూ కనిపిస్తుంది. గుమ్మడికాయ ఇంటి ముందు కట్టుకోవడం మంచిదని పెద్దలు చెబుతారు. గుమ్మడికాయ ఇంటి ముందు కట్టుకోవడం వెనుక అనేక కారణాలు ఉన్నాయని కూడా చెబుతూ ఉంటారు. గుమ్మడికాయ ఇంటికి కట్టుకుంటే కాలభైరవుడు ఇంటికి రక్షగా ఉన్నట్టు చెబుతారు. ఇంటి ముందుకు వచ్చేటువంటి దోషాలు ఏవైనా సరే గుమ్మడికాయ దూరం చేస్తుందని చెబుతారు.

గుమ్మడికాయకు ఇంటిపై ఉండే చెడు ప్రభావాన్ని లాక్కునే శక్తి

గుమ్మడికాయకు ఇంటిపై ఉండే చెడు ప్రభావాన్ని లాక్కునే శక్తి

నర ఘోష, నరపీడ లు, నరదృష్టి వంటి అనేక దోషాలు నుండి కాలభైరవ స్వరూపమైన గుమ్మడికాయ కాపాడుతుందని చెబుతారు. అందుకే ప్రతి ఒక్కరూ ఇంటిముందు గుమ్మడికాయ కట్టుకోవాల్సిన అవసరం ఉందని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీ రాకుండా గుమ్మడికాయ అడ్డు పడుతుందని చెబుతారు. మన ఇంటి మీద ఎటువంటి చెడు ప్రభావం ఉన్నా గుమ్మడికాయ లాక్కుంటుందని దానికి ఆ శక్తి ఉందని చెబుతారు.

గుమ్మడి కాయ కట్టేటప్పుడు పాటించాల్సిన నియమాలు

గుమ్మడి కాయ కట్టేటప్పుడు పాటించాల్సిన నియమాలు


గుమ్మడి కాయ ని కట్టేటప్పుడు కొన్ని నియమాలు, జాగ్రత్తలు కూడా పాటించాలని చెబుతున్నారు. ఎప్పుడైనా గుమ్మడికాయల పెట్టాలనుకుంటే దానిని ముందురోజు సాయంత్రం తెచ్చుకొని తరువాతి రోజు సూర్యోదయ సమయంలో ఇంటి ముందు అలంకరించుకోవాలి, అని పసుపు కుంకుమ దానికి రాసి ఇంటి ముందు వేలాడదీసుకోవాలని చెబుతున్నారు. రెండు అగరబత్తీలువెలిగించి గుమ్మడికాయ ధూపం చూపించాలని, మనం ఇంట్లో పూజ చేసుకున్న ప్రతి రోజు గుమ్మడికాయలకు అగర్బత్తి ల తో ధూపం చూపిస్తే మంచిది అని కూడా చెబుతున్నారు.

ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకోవటానికి ఈ రోజులే ముఖ్యం

ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకోవటానికి ఈ రోజులే ముఖ్యం


అంతేకాదు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం కోసం కొన్ని ప్రత్యేకమైన దినాలు ఉన్నాయి అని కూడా చెబుతున్నారు. కొత్త గుమ్మడికాయ ఇంటి ముందు పెట్టాలనుకుంటే బుధవారం నాడు, గురువారం నాడు, ఆదివారం నాడు ఆ పనిచేయాలని సూచిస్తున్నారు. గుమ్మడి కాయని కట్టిన తర్వాత ఆ గుమ్మడికాయ త్వరగా పాడైపోతే మీకు తగలవలసిన దోషాన్ని ఆ గుమ్మడికాయ తీసుకుని పాడైపోయింది అని గుర్తించాలి. పాడైపోయిన గుమ్మడికాయ ఇంటి ముందు ఉంచుకోకుండా వెంటనే మార్చుకోవాలి.

ఇంటి ముందు గుమ్మడికాయలు కట్టుకోకపోతే జరిగేదిదే

ఇంటి ముందు గుమ్మడికాయలు కట్టుకోకపోతే జరిగేదిదే

సొంత ఇల్లయినా, అద్దె ఇంట్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరి ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకోవడం మంచిదని చెబుతున్నారు. ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోకపోతే నేరుగా నెగటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేస్తుంది అని, నరదృష్టి ప్రభావం నేరుగా కుటుంబానికి తగిలి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఇంతకుముందు గుమ్మడికాయ కట్టుకోకున్నా, ఇప్పుడు ఒక మంచి బూడిద గుమ్మడికాయను తెచ్చి ఇంటి ముందు కట్టేయండి.

Disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
What happens if you don't build a pumpkin at home? It is said that direct negative energy creates evil in the house. That is why it is advised to make a pumpkin at home.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X