వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

vastu tips: ఇంట్లో తులసిమొక్కను పూజిస్తున్నారా? అయితే ఈ ముఖ్యమైన విషయాలు తప్పక తెలుసుకోండి!!

|
Google Oneindia TeluguNews

హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం మహా లక్ష్మీ స్వరూపమైన తులసి చెట్టును హిందువులు అత్యంత పవిత్రంగా భావించి పూజలు నిర్వహిస్తారు. ఇక ముఖ్యంగా కార్తీకమాసంలో తులసి చెట్టును చాలా ప్రత్యేకంగా పూజిస్తారు. తులసి పూజ చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని, మహిళలు ముత్తయిదువులు గా జీవిస్తారని హిందువులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అయితే ఇంట్లో తులసి మొక్కను పూజించేవారు అనేక ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాలని, తులసి మొక్కను నాటడం లోనూ, తులసి మొక్కను పూజించటంలోనూ, వాస్తు నియమాలను పాటించాలని వాస్తు శాస్త్ర పండితులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తులసి మొక్క ఎప్పుడూ ఈ దిశలోనే..

తులసి మొక్క ఎప్పుడూ ఈ దిశలోనే..

తులసి మొక్కను ఎప్పుడు తూర్పు దిశలోనే పెట్టాలి. తూర్పు దిశలోనే తులసి మొక్కను పెంచితే శుభం జరుగుతుందని పండితులు చెబుతున్నారు. తూర్పు దిశలో స్థలం లేకపోతే ఈశాన్య దిశలో కాని, ఉత్తర దిశలో కానీ తులసి మొక్కని పెంచుకోవచ్చు. ఈశాన్యంలో తులసి మొక్కను పెడితే విశేషమైన ఫలితాలు ఉంటాయని చెప్తున్నారు. ఇంటి ముందు తులసి మొక్క ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా అడ్డుకుంటుంది అని చెప్తున్నారు.

తులసి మొక్కను దక్షిణంలో పెట్టారో తీవ్ర నష్టాలు

తులసి మొక్కను దక్షిణంలో పెట్టారో తీవ్ర నష్టాలు

తులసి మొక్కను ఇంటి ఆవరణలో ఎట్టి పరిస్థితులలోనూ దక్షిణ దిశలో నాటకూడదు అని చెబుతున్నారు. దక్షిణ దిశ ను పూర్వీకుల దిశగా భావిస్తారు. దక్షిణ దిశకు అధిపతి గా యముడిని చెబుతారు. కాబట్టి దక్షిణ దిశలో ఎట్టిపరిస్థితులలోనూ తులసి మొక్కను పెంచకూడదు. ఒకవేళ దక్షిణదిశలో తులసి మొక్కను పెడితే భారీ నష్టం జరుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కుటుంబ కలహాలు కూడా పెరిగే ప్రమాదం ఉంటుందని, అనవసరమైన చిరాకులు కలుగుతాయని చెబుతున్నారు. అందుకే తులసి మొక్కను పెట్టే దిశ పైన కూడా సరైన అవగాహన ఉండాలని సూచిస్తున్నారు.

తులసిమొక్కను ఇంట్లో పెట్టటానికి సరైన ముహూర్తం అవసరం

తులసిమొక్కను ఇంట్లో పెట్టటానికి సరైన ముహూర్తం అవసరం

ఇంట్లో తులసి మొక్కను ఎప్పుడు పడితే అప్పుడు పెట్టకూడదని చెబుతున్నారు. ఇంట్లో తులసి మొక్కను పెట్టడానికి కూడా మంచి రోజు చూసుకుని పెట్టుకోవాలని సూచిస్తున్నారు. తులసి మొక్క ను సాధారణంగా కార్తీకమాసంలో పెట్టుకోవడం ఉత్తమ సమయమని భావిస్తారు. ముఖ్యంగా కార్తీకమాసంలో గురువారం రోజున తులసి మొక్కలను నాటడానికి సరైన రోజుగా పరిగణిస్తారు. తులసి మొక్కను నాటే సమయంలో విష్ణుమూర్తికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు. కార్తీక మాసం లోనే కాకుండా చైత్రమాసంలో కూడా, శుక్రవారం రోజున తులసి మొక్కను నాటుకోవచ్చని చెబుతున్నారు.

తులసి పూజకు నియమాలు

తులసి పూజకు నియమాలు

ఇక ఇంట్లో తులసి మొక్కను పూజిస్తున్న వారు నియమనిష్టలను పాటించాలని చెబుతున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు తులసి మొక్కను తాకకూడదు అని, ఎప్పుడు పడితే అప్పుడు తులసి మొక్కకు నీరు పోయకూడదు అని చెబుతున్నారు. ఆదివారం రోజున తులసి మొక్కకు నీళ్లు పోయ కూడదని, పూజలు చేయకూడదని చెబుతున్నారు. ఆదివారం నాడు పొరపాటున కూడా తులసి మొక్క ఆకులు తుంచకూడదని చెబుతున్నారు. ఒకవేళ అలా చేస్తే అశుభ ఫలితాలు వస్తాయని చెబుతున్నారు.

ఈ రోజులలో తులసి మొక్కను తాకరాదు

ఈ రోజులలో తులసి మొక్కను తాకరాదు

ఇక సూర్యగ్రహణం, చంద్రగ్రహణం రోజులలో, సోమవారం, బుధవారం, ఆది వారం రోజులలో, ఏకాదశి ఉన్న రోజులలో తులసి మొక్కను తాకకూడదు అని చెబుతున్నారు. పరమ పవిత్రంగా భావించే తులసి మొక్కను అంతే పవిత్రంగా చూసుకోవాలని, తులసి పూజలో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. లక్ష్మీ స్వరూపంగా భావించే తులసిమొక్కను నియమ నిష్ఠలతో పూజిస్తే మంచి ఫలితం ఉంటుందని చెప్తున్నారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
Worshiping Tulsi plant at home? But in which direction? When to put? One must know important things related to Tulsi Puja, rules like how to worship.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X