ఈ రాశులను లక్షాధికారులను చేస్తున్న శుక్రాచార్యులవారు!
రాక్షసులకు గురువైన శుక్రుడు నవగ్రహాల్లో అత్యంత కీలకమైన గ్రహం. సంపదకు, విలాసవంతమైన జీవితానికి, కళలకు, అందానికి, ఫ్యాషన్ రంగాలకు కారకుడు. జాతకంలో శుభస్థానంలో ఉంటే అంతులేని సంపదనిస్తాడు. వైవాహిక జీవితంలో అంతులేని ఆనందాన్ని కల్పిస్తాడు. ప్రతి 23 రోజులకు ఒకసారి రాశిని మారుస్తుంటాడు. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి జీవితంలో మంచి స్థాయికి చేరుకోవాలంటే శుక్రుడి అనుగ్రహం చాలా ముఖ్యం. ఏ రాశులను ఆయన ఇష్టపడతాడు, వారికి ఎటువంటి వరాల జల్లులు కురిపిస్తుంటాడు అనే విషయాలను తెలుసుకుందాం.
వృషభ రాశి
ఈ రాశివారికి శుక్రుడి అనుగ్రహం 24 గంటలూ లభిస్తుంటుంది. ఏ పనిలోనైనా అదృష్టం కలిసివచ్చు విజయాలు అందుకుంటారు. కొన్ని అరుదైన పనులు చేయడంద్వారా మంచి పేరు తెచ్చుకుంటారు. ధనలాభం ఉంది. శుక్రుడి ఆశీర్వాదంతో జీవితంలో స్థిరపడతారు. విద్యారంగంలో ఉన్నవారికి బాగా కలిసివస్తుంది. ఈ రాశివారికి ఉన్న కోరికలన్నీ నెరవేరతాయి. ఎంతో సహనం, ఓర్పుతో ఉంటారు. ఏ పనినైనా చాలా సులభంగా పూర్తిచేయగలిగే సామర్థ్యాన్ని కలిగివుంటారు.

మీనరాశి
ఏ రంగంలోనైనా వీరు అద్భుతమైన విజయాలను కైవసం చేసుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలతోపాటు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ఏ పనినైనా వీరు చాలా మనసు పెట్టి ఏకాగ్రతతో పనిచేస్తారు. దీనివల్ల విజయాలు సాధిస్తారు. వీరికి శుక్రుడు ఎంతో మేలు చేయనున్నాడు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతోపాటు శుక్రుడిని పూజించడంవల్ల ఈ రాశివారికి ఇంకా మేలు కలుగుతుంది. అన్నిరకాలుగా బాగుంటుంది.
తులా రాశి
వీరికి శుక్రుడు ఎప్పుడూ మేలు చేస్తూనే ఉంటాడు. అది వారి అదృష్టం. కోరికలన్నీ నెరవేరడమేకాదు.. ఏ పని అనుకున్నా పూర్తవుతుంది. అలాగే ఏ పని చేపట్టినా విజయం తథ్యం. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. శుక్రుడి వల్ల ఇది సాధ్యమవుతుంది. ఎప్పుడూ దీనికే అలవాటుపడకూడదు. జాగ్రత్తగా ఉంటూ జీవితాన్ని గమనించుకుంటూ నిరాడంబరంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. డబ్బుందికదా అని పాడుచేసుకోవద్దు.












Click it and Unblock the Notifications