వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండ్ల స్థలాలు కొనేప్పుడు జాగ్రత్తలు పడవలసిన అంశాలు ..వాస్తు ఏం చెబుతోంది..?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

మనం ఇండ్ల స్థలాలు కొనుక్కోవాలనుకున్నప్పుడు తప్పక కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మంచిది. మొదట స్థల పరీక్షా, భూమి పరీక్షా, పరిసర ప్రాంతాల పరీక్షా మొదలైన ఎన్నో అంశాలను దృష్టిలో పెట్టుకుని ఫలితాలు తెలియజేయాల్సి ఉంటుంది. అవేమిటో ముఖ్యమైనవి కొన్ని గమనిద్దాం.

What are the precautions to be taken while purcahsing plot?

1. నదుల దగ్గరగాని.

2. కొండల దగ్గరగాని.

3. స్మశానాల దగ్గరగాని.

4. దేవాలయం దగ్గరగాని ఇండ్ల స్థలాలు కొనకూడదు. పై తెలిపిన ప్రదేశాలలో తీసుకుని ఇల్లును నిర్మించుకుంటే భవిష్యత్తులో ఇబ్బందు తలెత్తుతాయి.

చతురస్రాకారము ప్లాట్ :- మనం ఇల్లు కట్టుకోవడం కొరకు తీసుకునే ప్లాట్ చతురస్రాకారముగా ఉంటే గృహ నిర్మాణానికి అన్ని విధములుగా మంచిది. ఇంటిలో అన్ని వసతులను వాస్తు సూత్రాలకు అనుగుణంగా కట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.

దీర్ఘ చతురస్రాకారము ప్లాట్ :- మనం ఇల్లు కట్టుకోవడానికి దీర్ఘ చతురస్రాకారము కూడా మంచిదే అయితే దాని పొడవు 2 :1 నిష్పత్తులకు మించి ఉండకూడదు. వాస్తు ప్రకారం సవరించడానికి పనికి వచ్చే ప్లాట్లను తీసుకోవాలి.

ఏదైనా ప్లాట్ కొనాలి అనుకున్నప్పుడు దిక్కులకు, విదిక్కులకు అనుకూలంగా ఉందా లేదా అని గమనించాలి. మీకు చూడడం రాదు అనుకున్నప్పుడు అనుభవజ్ఞులైన పండితుని సంప్రదించి వారికి ప్లాట్ చూపించి వారి సూచనల మేరకు తీసుకోవడం ఉత్తమం.

వాస్తు అంటే వాయువు, సూర్యుడు సరైన నిష్పత్తి భాగంలో ఇంటికి అందించే మార్గ సూచని. ప్రకృతికి సంబంధించి మానవునికి అనుగుణంగా ఉంచుతూ .. ఇతర ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తెలియజేస్తూ.. రక్షణగా కాపాడేది వాస్తుశాస్త్రం. ఇది శాస్త్రీయపరమైన విజ్ఞానం. మానవుని శరీరంలో ఉన్న సప్త దాతువులను అనుకూలంగా ఉండే విధంగా చక్కని ఆనందమయమైన ఆరోగ్యంగా జీవనం సాగించడానికి సూచించే శాస్త్రం వాస్తు.

1. ప్లాటులోని నైరుతి మూలనున్న కోణం తప్పని సరిగా 90 డిగ్రీలు ఉంటే మంచిది. వాయువ్యం మూల 90 డిగ్రీలు తప్పనిసరిగా ఉంటే మంచిది. అలాగే ఆగ్నేయ మూల కుడా 90 డిగ్రీలు తప్పనిసరిగా ఉండవలెను. ఇక ముఖ్యంగా ఈశన్యం మూల 90 డిగ్రీలు తప్పని సరి ఉండాలి. ఈశన్యం మూలలో 90 డిగ్రీలు కంటే తక్కువ అస్సలు ఉండకూడదు. ఈశాన్యం దిక్కు స్థలం ఎంత పెరుగుతే అంత మంచిది అనే అపోహలో చాలామంది ఉంటారు, వాస్తవానికి ఈశాన్యమ్ మరీ ఎక్కువగా పెరగకూడదు. ఇంటి స్థలాన్ని బట్టి నిర్దిష్టమైన పరిమాణంలో మాత్రమే పెరగాలి.

2. ప్లాటుకు ఉత్తరమునగాని తుర్పునగాని రోడ్డు కలిగిన ప్లాటు మంచిది.

3. ప్లాటుకు తూర్పున పడమర రోడ్డు ఉన్నా మంచిదే.

4. ప్లాటును ఈశాన్యం, ఉత్తరం, తూర్పు విస్తరించితే మంచిది.

5. ఇంటి స్థలం.. తూర్పు, పడమర పొడవుగాను దక్షిణం, ఉత్తరము పొడవు తక్కువగా ఉన్న ఇంట్లో నివసించిన వారికి మేలుచేస్తుంది.

6. మన ఇంటి స్థలానికి ఉత్తరమున గాని ఈశాన్యమునగాని తూర్పునగాని చెరువు, బావి, కుంటలు, నదులు ఉన్న మంచిది.

7. మన ఇంటి స్థలానికి పడమర వైపు కొండలు దక్షిణం వైపు ఎత్తుగా ఉన్న ప్లాటు చాలా మంచిది.

8. మన ఇంటి స్థలమునకు దక్షిణం ఎత్తుగాను ఉత్తరం పల్లంగాను పడమర ఎత్తుగాను తూర్పు పల్లంగాను ఉన్న స్థలం చాలా చాలా మంచిది.

9. వీధి శూల ( పోట్లు ) ఏ దిక్కులలో లేకుండా జాగ్రత్త పడటం సర్వోత్తమం. అదికూడా ప్రత్యేకించి సైటును పరిశీలిస్తే గాని చెప్పలేము అసలు ఆ ప్లాటుకు వీధి శూల లేక పోటు వర్తిస్తుందా లేదా అని నిర్ధారించాల్సి వస్తుంది. ఇలాంటి సందర్బాలలో అనుభవజ్ఞులైన పండితునితో చూపించి నిర్ధారణ చేసుకోవడం ఉత్తమం. కొందరు ప్లాటుకు వీధి శూల వర్తిస్తుందా లేదా అని సరైన అవగాహణ లేక లేని పోనీ అనుమానాలతో వ్యయప్రయాసలు పడుతుంటారు.

10. ఇంటి స్థలమునకు దిక్సూచి పెట్టి చూసినప్పుడు దాదాపు 10 డిగ్రీలు తేడా చూపించిన పర్వాలేదు, అలాంటి స్థలం తీసుకోవచ్చును.

* ఇంటిని క్షుణ్ణంగా అన్ని కోణాలలో పరిశీలిస్తేగాని అక్కడ ఉన్నలోపం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి వీలవుతుంది. ఒక వేళ లోపం ఉంటే దానికి తగిన నివారనోపాయలను తెలియజేయడానికి సాధ్యపడుతుంది.

English summary
It is advisable to take some precautions when we want to buy a plot for construction of house. First of all, the results have to be reported keeping in view many factors like site test, land test, surrounding area test etc.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X