• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆరోగ్య పరిపుష్టికి పాటించాల్సిన నిద్ర నియమాలు

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

మానవునికి సరైన నిద్ర ఉంటే ఆరోగ్యం అనుకులంగా ఉంటుంది. చేసే పనులలో ఏకాగ్రత పెరుగుతుంది. అనారోగ్యాలు దరిచేరవు. కాబట్టి మానవుడు సంపూర్ణ ఆరోగ్యంతో జీవనం సాగించాలంటే ఏం చేయాలి అని గమనిద్దాం.

* ఆరోగ్యం, శరీరపుష్టి, రోగము, బలము, శరీర బలహీనత, పురుషత్వము, నపుంసకత్వం, జ్ఞానము, అజ్ఞానము, జీవితము, మరణము ఇవన్నియు నిద్రకు అధీనములై ఉన్నవి. అనగా నిద్రపైన ఆధారపడి ఉన్నవని అర్థం.

Rules to be followed for a healthy sleep

* నిద్రించుటకు రాత్రియే సరైన సమయము. రాత్రి సమయములో 6 నుండి 8 గంటలు నిద్రించవలెను. కాలాన్ని అతిక్రమించక నిద్రించవలెను. ఒకవేళ రాత్రి సమయములో జాగరణ చేయవలసి వచ్చినచో ఆ జాగరణ ఎంత సమయం చేసారో అందులో సగం సమయం మధ్యాహన్న భోజనమునకు ముందు ఉదయాన్నే నిద్రించవలెను.

* రాత్రి సమయములో ఎక్కువ సేపు మేలుకొని ( జాగరణ ) చేసినచో శరీరం నందు రూక్షగుణం ఎక్కువై వాతరోగములు కలుగును.

* వృద్దులు, బాలురు, బలహీనులు, ధాతుక్షయం కలవారు, శ్వాస, అతిసారం, దెబ్బలు తగిలినవారు, శూల, దప్పి, అజీర్ణం, ఉన్మాదం రోగములు కలవారు, అధికంగా మాట్లాడుట, ఆయాసం కలిగించు పనులు, ప్రయానములలో, మద్యము తాగుట, భయం, కోపం, శోకములచే శ్రమ చేసేవారికి దోష ధాతు అసమానత కలుగును.

* ప్రతిదినం మధ్యాహ్నం నిద్రించే అలవాటుగా గలవారు పగలు నిద్రించవచ్చును.

* ఎక్కువైన మేథస్సు, కఫం కలిగినవారు, గట్టిగా ఉండు ఆహారం తీసుకున్నవారు ఎప్పుడూ పగలు నిద్రించకూడదు. ఇటువంటివారు ఎండాకాలంలో కూడా నిద్రించరాదు.

* ఆయా కాలంలో నిద్రించుచున్న ఆరోగ్యమును, ఆయువును నశింపచేయుటయే గాక మోహము, జ్వరం, శిరోరోగము, వాపు, మూత్రబంధనం వంటిరోగాలు కలుగును.

* నిద్రయొక్క వేగమును ఆపుట వలన మోహము, తలబరువు, కండ్లునొప్పులు, సోమరితనం, ఆవలింతలు, శరీరం బరువు పెరగటం వంటివి కలుగును. ఈ స్థితి యందు శరీరమర్ధనం, శరీర అంగములు పిసుకుట, నిద్రించుట చేయవలెను.

* రాత్రి నిద్ర తక్కువైనచో అలాంటి సమయంలో మరుసటిరోజు ఉదయమున భోజనం చేయకుండా నిద్రించవలెను . రాత్రియందు సక్రమముగా నిద్రపట్టనివారు పాలు, మాంస" పాయసూప్"రసము , పలుచటి రైత లాంటివి తాగవలెను. అభ్యంగనం, స్నానం మొదలగునవి ఆచరించవలెను.

* నిద్రించునప్పుడు నిద్రాభంగము కలిగినచో సోమరితనం, తలబరువు, ఆవలింతలు, ఒళ్ళు నొప్పులు, బడలికగా ఉండటం, పనుల యందు ఇష్టం లేకుండా ఉండటం, భ్రమ, అజీర్ణం, వాతరోగములు కలుగును.

* కూర్చుండి నిద్రపోయినచో కఫవృద్ధి, ఆరోగ్యభంగం కలుగదు.

* సాయంత్రం 4 తర్వాత 'టీ' కాఫీ లాంటివి త్రాగాకూడదు. ఒక వేళ త్రాగితే రాత్రి సమయంలో పడుకున్న వెంటనే నిద్ర రాకుండా చేస్తుంది.

English summary
Rules to be followed for a healthy sleep
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X