• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

vastu tips: గబ్బిలం ఇంట్లోకి వస్తే ఏం జరుగుతుంది? శుభమా.. అశుభమా.. తెలుసుకోండి!!

|
Google Oneindia TeluguNews

హిందూ సంప్రదాయంలో, ఆచార వ్యవహారాలలో అనేక విశ్వాసాలు ఉంటాయి. బయటకు వెళ్తున్నప్పుడు పిల్లి ఎదురైతే అపశకునం అని, కుక్క ఏడవకూడదు అని, ఇక గబ్బిలాలు ఇళ్ళలోకి రాకూడదు అని ఇలా అనేక విశ్వాసాలు ఉంటాయి. మన ఇంట్లోకి ఏదైనా ఒక జంతువు గాని పక్షి గాని ఆకస్మాత్తుగా వస్తే దానికి సంబంధించి ఏదో భవిష్యత్ పరిణామాలు ఉంటాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతుంటారు. ఇక అటువంటి వాటిలో గబ్బిలం ఒకటి. అయితే కొంతమంది ఇంటికి గబ్బిలం రావడాన్ని చాలా శుభసూచకంగా పరిగణిస్తారు. అయితే ఎక్కువ మంది అశుభ సూచకంగా, చాలా డేంజర్ గా భావిస్తారు.

గబ్బిలం ఇళ్ళలోకి వస్తే ఏం జరుగుతుంది?

గబ్బిలం ఇళ్ళలోకి వస్తే ఏం జరుగుతుంది?

గబ్బిలాలు సహజంగా దేవాలయాలు మరియు పెద్ద మసీదులలో నివసిస్తాయి. కాబట్టి ఇది అదృష్టాన్ని తెస్తాయని చాలా మంది భావిస్తారు. ఇది లక్ష్మి దేవి యొక్క వాహనం కావడంతో గబ్బిలం వస్తే ఆ ఇల్లు సంపన్నంగా మరియు ధనవంతంగా ఉంటుందని భావించేవారు లేకపోలేదు. అయితే గబ్బిలం వస్తే మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుందని నమ్మేవారు అధిక సంఖ్యలో ఉన్నారు.

గబ్బిలాలకు రాత్రి సమయంలోనే కళ్ళు ఎక్కువగా కనిపిస్తాయి. రాత్రివేళ గబ్బిలం ఇంటికి ఎదురుగా వచ్చి ఉందంటే ఆ ఇంట్లో ఎవరో చనిపోతారని చాలామంది నమ్ముతుంటారు. ఇక ఇదే సమయంలో ఒకవేళ ఇంట్లోకి గబ్బిలం వస్తే ఏం చేయాలి అన్న దానిపై విపరీతంగా మదనపడుతూ ఉంటారు.

ఇంటికి గబ్బిలాల రాక వైవాహిక జీవితంలో ఇబ్బందులను సూచిస్తుంది

ఇంటికి గబ్బిలాల రాక వైవాహిక జీవితంలో ఇబ్బందులను సూచిస్తుంది

సాధారణంగా గబ్బిలాలు ఇళ్ల వద్ద కనిపించవు. ఒక్కోసారి అవి హఠాత్తుగా ఇంటికి రావడం, మళ్లీ మళ్లీ వచ్చి పోతూ ఉండటం జరుగుతూ ఉంటుంది. అయితే ఇంట్లో రెండు కంటే ఎక్కువ గబ్బిలాలు లేదా గబ్బిలాల గుంపు రావడం అనేది వైవాహిక జీవితంలో ఇబ్బందులను సూచిస్తుంది. ఒక్కోసారి గబ్బిలాల రాక ఆ కుటుంబంలో ఎవరైనా మరణానికి సంకేతంగా కూడా పరిగణించబడుతుంది. అందుకే గబ్బిలాల రాకను నిర్లక్ష్యం చేయకూడదు. గబ్బిలాలను ఇంటికి రాకుండా తరిమికొట్టాలి. కానీ పొరపాటున కూడా గబ్బిలం ని చంపకూడదు.

గబ్బిలం ఇంట్లోకి వస్తే చెయ్యాల్సింది ఇదే

గబ్బిలం ఇంట్లోకి వస్తే చెయ్యాల్సింది ఇదే

ఒకవేళ గబ్బిలం ఇంట్లోకి వస్తే, దాని రెక్కల ద్వారా విడుదలయ్యే బ్యాక్టీరియాతో ఇంటి వాతావరణం పాడవుతుంది. ఒకవేళ గబ్బిలం వల్ల ఇంట్లోకి వచ్చినట్లయితే ఆ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలని చాలా మంది భావిస్తుంటారు. కానీ గబ్బిలం ఇంట్లోకి వస్తే పసుపు నీళ్ళు తయారు చేసి ఇంటిని మొత్తం చల్లుకుని, తర్వాత గుగ్గిలం పొగ వేసి ఇంటిని వాడుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల గబ్బిలం రావడం వల్ల ఏర్పడిన ఎటువంటి దోషాలు తొలగిపోతాయి.

గబ్బిలాన్ని పొరబాటున కూడా చంపకండి.. ప్రతికూల ఫలితాలు వస్తాయి

గబ్బిలాన్ని పొరబాటున కూడా చంపకండి.. ప్రతికూల ఫలితాలు వస్తాయి

పొరపాటున గబ్బిలాన్ని చంపితే అది అనేక ప్రతికూల శక్తులను సూచిస్తుంది. దీని వల్ల ఇంట్లో అశాంతి నెలకొని, ఏ పనిలోనూ విజయం సాధించ లేని ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. అందుకే గబ్బిలం వచ్చినప్పుడు ఆందోళన చెందకుండా దానిని ఇంటికి రాకుండా చేసే మార్గాలపై దృష్టి సారించి ఇల్లు శుద్ధి చేసుకొని ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వచ్చేలాగా చూసుకుంటే సరిపోతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
Many people say that it is ominous if a bat enters the house. It is said that if a bat comes, turmeric water should be sprinkled in the house and guggilum should be smoked. It is said that never kill a bat even by mistake.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X