కాల అమృతయోగం అంటే ఏమిటి?

Posted By:
Subscribe to Oneindia Telugu

ఒక జాతకచక్రంలో అగ్రభాగంలో రాహువు చివర భాగంలో కేతువు ఉండి, ఈ రెండు గ్రహాలమధ్యా మిగిలిన ఏడుగ్రహాలు చిక్కుకున్నట్లయితే దానిని కాలసర్పయోగం లేదా కాలసర్పదోషం అని పిలుస్తారు. అయితే కొన్నిసార్లు కేతువు అగ్రభాగంలోను రాహువు చివరభాగంలోను ఉండటం మరియు ఆ రెండు గ్రహాలమధ్య ఇతర ఏడు గ్రహాలు చిక్కుకుని ఉండటం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితిని కాలఅమృతయోగం అని పిలుస్తారు.

కాంతి చక్రంలో 9 రంగులు ఉంటాయి. అయితే వీటిలో ఇన్‌ఫ్రారెడ్ కిరణాలు మరియు ఆల్లావైలెట్ కిరణాలు కూడా ఉన్నప్పటికీ అవి కంటికి కనపడవు. అనగా ఆ రెండు రంగులు కంటికి కనపడవు అన్నమాట. అందువల్ల కాంతిచక్రంలోఉండే 9 రంగుల్లో 7 రంగులు మాత్రమే కంటికి కనిపిస్తాయి అని గ్రహించాలి. ఈ రెండు రకాల కాంతికిరణాలు కంటికి కనపడకపోయినప్పటికీ వాటివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అనేక రకాల కండరాల మరియు ఎముకల సంబంధ వ్యాధుల చికిత్సలో ఈ కిరణాలు ఉపయోగపడుతున్నాయి. అదేవిధంగా రాహువు, కేతువు అనే గ్రహాలు కంటికి కనపడకపోయి నప్పటికీ మిగిలిన గ్రహాలకు లాగానే అవికూడా మానవుల జీవితాలపై అపారమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి.

What is Kala Amtrita Yogam?

ఇక కాలఅమృతయోగం విషయానికివస్తే జాతకచక్రంలో లగ్నాన్ని లెక్కలోకి తీసుకోకుండా, కేతవునుండి ప్రారంభించి చివర ఉన్న రాహువు వరకు పరిశీలించాలి. అలా చూసినట్లయితే ఆ రెండు గ్రహాలమధ్యా మిగిలిన ఏడు గ్రహాలు ఉన్నట్లయితే ఆ జాతకంలో కాలఅమృతయోగం ఉన్నట్లని చెప్పాలి. ఈరకమైన యోగం ఉన్న వ్యక్తులు శారీరకంగా రాహువు కలిగించే బాధలను మరియు మానసికంగా కేతువు కలిగించే బాధలను అనుభవించాల్సి ఉంటుంది.

"కలౌచండీవినాయకో" అన్నవేదసూక్తి ప్రకారం కాలసర్పయోగం ఉన్నవారు చండీదేవిన, కాలఅమృతయోగం ఉన్నవారు వినాయకుడిని పూజిస్తే ఆ దోషాలు పరిహారాలు కాగలవు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Who are in Kala Amtritha Yogam they will face Rahu and Kethu pains.
Please Wait while comments are loading...